Thursday, September 24, 2026 07:14 PM
Thursday, September 24, 2026 07:14 PM

ఈ చైర్మన్ మాకు వద్దు.. దింపేద్దాం..!

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు హాట్ హాట్‌గా సాగుతున్నాయి. వైసీపీ ఎమ్మెల్యేలు శాసనసభకు రాకపోయినప్పటికీ.. శాసనమండలిలో మాత్రం ఆ పార్టీ సభ్యులు నానా రచ్చ చేస్తున్నారు. పదే పదే నినాదాలతో మండలి కార్యకలాపాలను అడ్డుకుంటున్నారు. పెద్దల సభలో ఉన్నామనే విషయం కూడా మర్చిపోయిన వైసీపీ సభ్యులు.. చైర్మన్ పోడియం పైకి వెళ్లి మరీ ఆందోళన చేస్తున్నారు. చైర్మన్‌కు వ్యతిరేకంగా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ.. మండలిలో ప్లకార్డులు ప్రదర్శిస్తున్నారు. అయితే చైర్మన్ మాత్రం వైసీపీ సభ్యుల తీరును సమర్థిస్తున్నట్లే ఉంది తప్ప.. వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవటం లేదు అనేది ప్రధాన ఆరోపణ.

Also Read : రాజకీయాల నుంచి విజయ్ అవుట్.. తండ్రి మద్దతు కోడలికే

ఏపీలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ అధినేత తీరును తీవ్రంగా వ్యతిరేకిస్తూ.. ఆరుగురు వైసీపీ ఎమ్మెల్సీలు తమ సభ్యత్వానికి రాజీనామా చేశారు. వీటిని స్పీకర్ ఫార్మెట్‌లోనే చైర్మన్‌కు అందించారు. చైర్మన్ స్థానంలో ఉన్న వైసీపీ నేత మోషేన్ రాజు.. వీటిని ఇప్పటి వరకు ఆమోదించలేదు. దీంతో రాజీనామా చేసిన ఎమ్మెల్సీలు చైర్మన్ తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. తమ రాజీనామాలు ఆమోదించాలంటూ ఇప్పటికే పలుమార్లు మండలిలోనే సభ్యులు విజ్ఞప్తి చేశారు. అయినా సరే.. చైర్మన్ మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో చైర్మన్ తీరుపై రాజీనామా చేసిన వైసీపీ ఎమ్మెల్సీలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు.

Also Read : రైతులకు ఇచ్చిన డ్రోన్లు ఎలా ఉన్నాయో తెలుసా..?

ఏపీ శాసనమండలి ఛైర్మన్‌పై అవిశ్వాసం పెట్టే యోచనలో రాజీనామా చేసిన వైసీపీ ఎమ్మెల్సీలు ఉన్నట్లు తెలుస్తోంది. ఆరుగులు సభ్యులు తమ పదవికి రాజీనామా చేసినప్పటికీ.. ఇంతవరకూ వాటిని మండలి ఛైర్మన్ ఆమోదించలేదు. దీంతో చైర్మన్ తీరుకు నిరసనగా అవిశ్వాసం పెట్టాలని ఆరుగులు ఎమ్మెల్సీలు భావిస్తున్నట్లు సమాచారం. టీడీపీ, జనసేన, బీజేపీ సభ్యుల మద్దతు కూడా ఉంటుంది కాబట్టి.. అవిశ్వాసం పెట్టేందుకు తగినంత సంఖ్యాబలం ఇప్పుడు ఉంది. దీంతో ఆ దిశగా రాజీనామా చేసిన వైసీపీ ఎమ్మెల్సీలు ఆలోచన చేస్తున్నట్లు పొలిటికల్ సర్కిల్‌లో జోరుగా వినిపిస్తోంది. వైసీపీని వీడి బయటకు వచ్చిన ఎమ్మెల్సీలు జయమంగళ వెంకటరమణ, జకియా ఖానమ్‌, బల్లి కళ్యాణ్‌ చక్రవర్తి, కర్రి పద్మశ్రీ, పోతుల సునీత, మర్రి రాజశేఖర్‌.. తమ పదవులకు రాజీనామా చేసినప్పటికీ, వాటిని మండలి ఛైర్మన్ ఇంతవరకు ఆమోదించకపోవడం ఇప్పుడు పెను వివాదానికి దారితీస్తోంది. తాను రాజీనామా చేసినా కూడా.. దానిని చైర్మన్ ఆమోదించటం లేదని జయమంగళ వెంకటరమణ హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేశారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

కాంగ్రెస్ ఎమ్మెల్యే నోటి...

ఇప్పటికీ ఒక సామాజిక వర్గానికి చంద్రబాబు...

పల్నాడులో వైసీపీ...

పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గ పరిధిలో...

భోగాపురంలో కంగారుపెట్టిన విమానం..!

విజయవాడ నుంచి భోగాపురం బయలుదేరిన ఎయిర్...

టీచర్లను కొట్టినా 24...

విజయవాడ శాప్ కార్యాలయం వద్ద వైఎస్సార్‌సీపీ...

పిఠాపురంలో పవన్ మార్క్.....

పిఠాపురం నియోజకవర్గ పర్యటనలో భాగంగా ఉప...

శీనన్న.. ఇలా అడ్డంగా...

తెలంగాణ రాజకీయాలు హాట్ హాట్‌గా ఉన్నాయి....

పోల్స్