Thursday, September 17, 2026 11:35 PM
Thursday, September 17, 2026 11:35 PM

రైతులకు ఇచ్చిన డ్రోన్లు ఎలా ఉన్నాయో తెలుసా..?

ప్రతి పనిలో సాంకేతిక పరిజ్ఞానం వినియోగించాలనేది ఏపీ సీఎం చంద్రబాబు మాట. భవిష్యత్తులో వచ్చే ఎన్నో మార్పులను ముందుగానే ఊహించగల దిట్ట. అందుకే ఏపీని డ్రోన్ హబ్‌గా చేస్తామంటూ ఏడాదిన్నర క్రితమే ప్రకటించారు. నిజానికి ఈ ప్రకటన వెనుక చాలా లోతైన ఆలోచన ఉంది. భవిష్యత్తులో ప్రతి విషయం డ్రోన్‌తో ముడిపడి ఉంటుంది. ఇప్పటికే విపత్తు సమయాల్లో డ్రోన్ ద్వారా ఆహారం, మందులు అందిస్తున్నారు. అలాగే పోలీసులు కూడా డ్రోన్ సాయంతో కేసులను పరిష్కరిస్తున్నారు. కొన్ని దేశాల్లో డ్రోన్ ట్యాక్సీలు ఇప్పటికే అందుబాటులోకి వచ్చాయి. భవిష్యత్తులో కార్లకు బదులుగా డ్రోన్ రవాణా వస్తుందని నిపుణులు ఇప్పటికే అంచనా వేస్తున్నారు.

Also Read : ఆఫ్ ది రికార్డ్.. అందుకే విందు రాజకీయం..!

ఇక వ్యవసాయ రంగంలో డ్రోన్ సేవలు మంచి ఫలితాలు ఇస్తున్నాయి. డ్రోన్ సాయంతో పొలాలకు యూరియా పిచికారీ చేస్తున్నారు. నిజానికి యూరియా పిచికారి వల్ల ఎంతో మంది రైతులు క్యాన్సర్ బారిన పడి మృతి చెందారు. అలాగే రసాయనిక ఎరువులు నేలకు చేరడం వల్ల భూమి సారం కూడా పోతుంది. కానీ డ్రోన్ సాయంతో మందు పిచికారి చేస్తే.. నేరుగా మొక్కకు చేరుతుంది. దీని వల్ల భూమి సారవంతమవుతుంది కూడా. అందుకే డ్రోన్ వినియోగంపై రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. డ్రోన్ ద్వారానే పురుగు మందులు పిచికారి చేయాలని సూచిస్తున్నారు. రైతులకు సబ్సిడీపై డ్రోన్‌లను అందిస్తున్నారు కూడా.

ఏపీ ప్రభుత్వం రైతులకు డ్రోన్ అందించేందుకు ప్రభుత్వ రంగ సంస్థలను కాదని ప్రైవేటు సంస్థకు కాంట్రాక్ట్ ఇవ్వడం వివాదాస్పదమైంది. నిజానికి డ్రోన్ తయారీ, వినియోగంపై కోరమాండల్ వంటి ప్రభుత్వ రంగ సంస్థలు ఎన్నో ఏళ్లుగా కృషి చేస్తున్నాయి. రైతులకు అవగాహన కల్పిస్తున్నాయి కూడా. అలాంటి సంస్థలను కాదని.. హైదరాబాద్‌కు చెందిన ఓ ప్రముఖ పారిశ్రామిక వేత్త కుమారుడు నిర్వహిస్తున్న సంస్థకు డ్రోన్ సరఫరా కాంట్రాక్ట్ ఇచ్చారు. నిజానికి మేకిన్ ఇండియా, మేడిన్ ఆంధ్ర స్కీమ్ కింద డ్రోన్ తయారు చేసి అందించాల్సి ఉంది. కానీ సదరు సంస్థ మాత్రం.. చైనా నుంచి డ్రోన్ విభాగాలు తీసుకువచ్చి.. వాటిని ఇక్కడ అసెంబ్లిగ్ చేసి.. రైతులకు అందించారు. ఇవి నాసిరకం కావడంతో.. చాలా వరకు విరిగిపోయాయి. ఇదేమిటీ అంటే.. రీ ప్లేస్ చేస్తామంటున్నారు తప్ప.. సంస్థ నిర్వాహకులు మళ్లీ కనిపించటం లేదు.

Also Read : అటవీశాఖలో సంస్కరణలు: పవన్ కళ్యాణ్ వినూత్న ఆలోచన

ఈ వ్యవహారంపై ఇప్పటికే కోరమాండల్ సహా పలు ప్రభుత్వ రంగ సంస్థల ప్రతినిధులు, నిపుణులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి నేరుగా ఫిర్యాదు చేశారు. దీంతో అసలు విషయం తెలుసుకున్న సీఎం చంద్రబాబు.. ఈ ఏడాది డ్రోన్ సరఫరాను టెండర్ ద్వారా కేటాయించాలని అధికారులను ఆదేశించారు. దీంతో ప్రస్తుతానికి ఈ వివాదం ముగిసినట్లు అయ్యింది. అయితే గతంలో కాంట్రాక్ట్ తీసుకున్న సంస్థపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని నిపుణులు డిమాండ్ చేస్తున్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

మరో వైసీపీ కీలక...

అనంతపురం జిల్లాలో జరుగుతోన్న అక్రమ మైనింగ్...

కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్‌హౌస్...

తెలంగాణ మాజీ సిఎం, బీఆర్ఎస్ అధినేత...

చంద్రబాబుపై కేంద్ర మంత్రి...

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత...

రచ్చకెక్కిన ఉత్తరాంధ్ర వైసీపీ...

శ్రీకాకుళం జిల్లాలో సుదీర్ఘ రాజకీయ అనుభవం...

గ్రామాల్లో అభివృద్ధి పండుగ,...

ఏపీ డిప్యూటి సిఎం పవన్ కళ్యాణ్...

నేను లండన్ వెళ్తా...

సోషల్ మీడియా సెలబ్రిటీ, ప్రముఖ యూట్యూబర్...

పోల్స్