Sunday, June 21, 2026 06:22 AM
Sunday, June 21, 2026 06:22 AM

డ్రగ్స్ కేసులో దొరికిపోయిన స్టార్ హీరోయిన్ తమ్ముడు..?

టాలీవుడ్ లో, హైదరాబాద్ లో డ్రగ్స్ ను బయటకు తీయాలని తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోన్న తెలంగాణా పోలీసులు.. ఎప్పటికప్పుడు కఠినంగా వ్యవహరిస్తున్నారు. సినిమా వాళ్ళ కారణంగానే డ్రగ్స్ విస్తరిస్తున్నాయి అనే ఆరోపణలు సైతం పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. గతంలో కూడా సినిమా వాళ్ళను విచారించారు పోలీసులు. ముఖ్యంగా పంజాబ్ నుంచి వచ్చే డ్రగ్స్ ను.. హైదరాబాద్ లో ప్రముఖుల సహకారంతో విక్రయిస్తున్నారు అనే ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడు వారిపైనే పోలీసులు ఫోకస్ చేసారు.

Also Read : గంభీర్ డ్రామాలకు తెరదించిన కోహ్లీ, రోహిత్

ఈగల్ టీం ద్వారా.. వేటాడుతున్నారు పోలీసులు. ఈ నేపధ్యంలో తాజాగా మరో సంచలనం నమోదు అయింది. మాసబ్‌ట్యాంక్‌ డ్రగ్స్‌ కేసులో సినీనటి రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ సోదరుడు పరారీలో ఉన్నట్టు పోలీసులు భావిస్తున్నారు. గత ఏడాది కూడా డ్రగ్స్ కేసులో ఇతనిని పోలీసులు అరెస్ట్ చేశారు. సినిమా పరిశ్రమకు ఎక్కువగా ఇతని ద్వారానే డ్రగ్స్ వస్తున్నట్టు గుర్తించారు. రకుల్‌ సోదరుడు అమర్‌ ప్రీత్‌ సింగ్‌ సహా.. అతని సన్నిహితులు అందరిపై దృష్టి పెట్టారు పోలీసులు. అతని ఆధీనంలో పని చేస్తున్న వారి వివరాలు సేకరించి దాడులు మొదలుపెట్టారు.

Also Read : దమ్ముంటే మోడీని, అమిత్ షా ని అరెస్ట్ చేస్తానని ప్రకటించగలవా?

తాజాగా నితిన్‌ సింఘానియా, శ్రేనిక్‌ సింఘ్వి అరెస్టుతో తెరపైకి రకుల్‌ సోదరుడి పేరు వచ్చింది. పట్టుబడ్డ ఇద్దరు వ్యాపారులకు నలుగురు రెగ్యులర్‌ కస్టమర్లు సప్లై చేస్తున్నట్లు గుర్తించారు. ఇద్దరు వ్యాపారవేత్తల నుంచి రకుల్‌ సోదరుడు అమర్‌ ప్రీత్‌ డ్రగ్స్‌ కొనుగోలు చేసినట్టు గుర్తించారు. వీరి నుంచి 43 గ్రాముల కొకైన్‌, ఎండీఎంఏ డ్రగ్స్‌ స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం బెయిల్ మీద ఉన్న అతనిపై సైబరాబాద్ పోలీసులు సీరియస్ గా ఫోకస్ పెట్టారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

తిరుపతిలో కేఎఫ్‌సీ, డొమినోస్‌...

ప్రముఖ అంతర్జాతీయ ఫుడ్ బ్రాండ్ల ఆహార...

తిరుపతిలో వడ్డీ మాఫియా.....

తిరుపతి నగరంలో వడ్డీ వ్యాపారం పేరుతో...

సాయికృష్ణ కేసులో వైసీపీ...

విజయవాడ రౌడీ షీటర్‌ గాదె సాయికృష్ణ...

బ్రేకింగ్: అల్లు అర్జున్‌...

హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సంధ్య...

తెలంగాణాలో జనసేన తొలి...

గత కొన్నాళ్ళుగా తెలంగాణాలో పార్టీ బలోపేతం...

బ్రేకింగ్: కొడాలి అరెస్ట్...

ఏపీలో వైసీపీ కీలక నేతలకు చట్టపరమైన...

పోల్స్