సికింద్రాబాద్ వెళ్లే రైలు ప్రయాణీకులకు రైల్వే శాఖ షాక్ ఇచ్చింది. నిత్యం రద్దీగా ఉండే సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌పై ఒత్తిడి తగ్గించేందుకు రైల్వే శాఖ భారీ ఎత్తున మార్పులు చేర్పులు చేసింది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు ప్రత్యామ్నాయంగా చర్లపల్లి రైల్వేస్టేషన్‌ను అభివృద్ధి చేశారు. ఏకంగా రూ.450 కోట్లు ఖర్చు చేసి 20 ప్లాట్‌ఫామ్‌లతో అత్యాధునిక హంగులతో రైల్వేస్టేషన్‌ను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. వరంగల్, కాజీపేట వైపు నుంచి వచ్చే కొన్ని రైళ్లను ఇక్కడి నుంచే ఆపరేట్ చేయాలని రైల్వే శాఖ భావిస్తోంది. దీని వల్ల సికింద్రాబాద్ స్టేషన్‌కు వచ్చే రైళ్ల రాకపోకలు తగ్గిపోతాయనేది అధికారుల భావన. ఇందుకోసం ఇప్పటికే అధికారులు కసరత్తు మొదలుపెట్టారు. రైల్వే స్టేషన్ ప్రారంభించి ఇప్పటికే 4 నెలలు గడిచినప్పటికీ.. ప్రస్తుతానికి అన్ని రైళ్లు సికింద్రాబాద్ స్టేషన్‌కు వస్తున్నాయి. కానీ భవిష్యత్తులో మాత్రం కొన్ని రైళ్లను చర్లపల్లి నుంచే నడిపించాలని అధికారులు నిర్ణయించారు.
Also Read : ఢిల్లీలో చంద్రబాబు, పవన్ రాజకీయం..!
వేసవి రద్దీని దృష్టిలో పెట్టుకుని కొన్ని రైళ్ల రాకపోకలను అధికారులు మార్పులు చేర్పులు చేశారు. ఇందులో భాగంగానే కొన్ని రైళ్లను సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కు వెళ్లకుండా చర్లపల్లి నుంచే బైపాస్ చేశారు. రైలు నంబర్ 20809 సంబల్‌పూర్-నాందేడ్ ఎక్స్‌ప్రెస్‌ను చర్లపల్లి నుంచే బైపాస్ చేశారు. అలాగే 20810 నాందేడ్ – సంబల్‌పూర్ రైలు కూడా ఇకపై సికింద్రాబాద్ స్టేషన్‌కు రాదు. రైలు నంబర్ 20811 విశాఖపట్నం – నాందేడ్ ఎక్స్‌ప్రెస్ రైలు రాత్రి 8 గంటలకు విశాఖలో బయలుదేరి ఉదయం 6.45 గంటలకు చర్లపల్లి చేరుకుంటుంది. అక్కడ నుంచి కామారెడ్డి మీదుగా మధ్యాహ్నం 1.45 గంటలకు నాందేడ్ చేరుతుంది. తిరుగు ప్రయాణంలో కూడా రైలు నంబర్ 20812 నాందేడ్ – విశాఖ రైలు సాయంత్రం 4.30 గంటలకు నాందేడ్‌లో బయలుదేరి రాత్రి 9.15 గంటలకు చర్లపల్లి చేరుకుంటుంది. అక్కడి నుంచి కాజీపేట్ మీదుగా ఉదయం 9.20 గంటలకు విశాఖ చేరుకుంటుంది.
Also Read : ఢిల్లీలో చంద్రబాబు, పవన్ రాజకీయం..!
ఇక విశాఖ, నరసాపురం, మచిలీపట్నం, కాకినాడ నుంచి నాగర్‌సోల్, సాయినగర్ షిరిడి మధ్య రాకపోకలు సాగించే రైళ్లు ఇకపై చర్లపల్లి నుంచే బైపాస్ కానున్నాయి. రైలు నంబర్ 18503, 18504, 12787, 12788, 17231, 17232, 17208, 17207, 17206, 17205 ఇకపై నేరుగా చర్లపల్లి నుంచి లింగంపల్లి మీదుగానే రాకపోకలు సాగించనున్నాయి. ఈ రైళ్లు సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌ను బైపాస్ చేయనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. వీటితో పాటు విశాఖ నుంచి లోకమాన్య తిలక్ టెర్మినస్ మధ్య రాకపోకలు సాగించే 18519/18520 రైళ్లు కూడా ఇకపై సికింద్రాబాద్ స్టేషన్‌కు రావు. రాత్రి 11.20 గంటలకు విశాఖలో బయలుదేరి మధ్యాహ్నం 12.35 గంటలకు చర్లపల్లి చేరుకుంటుంది. ఆ తర్వాత లింగంపల్లి మీదుగా ఉదయం 4.30 గంటలకు లోకమాన్యతిలక్ టెర్మినస్ చేరుకుంది. అలాగే ఉదయం 6.55 గంటలకు లోకమాన్యతిలక్ నుంచి బయలుదేరరి.. రాత్రి 8.15 గంటలకు చర్లపల్లి వస్తుంది. ఆ తర్వాత కాజీపేట మీదుగా ఉదయం 10.50 గంటలకు విశాఖ చేరుతుంది.
Also Read : హైదరాబాద్ వాసులకు పొంచి ఉన్న ప్రమాదం…!
ఈ మార్పులు మార్చి 28వ తేదీ నుంచి అమలులోకి వస్తాయని రైల్వే అధికారులు ప్రకటించారు. సికింద్రాబాద్ రిజర్వేషన్ చేసుకున్న ప్రయాణీకులు చర్లపల్లి నుంచే రాకపోకలు సాగించాలని సూచించారు. అయితే సికింద్రాబాద్ నుంచి చర్లపల్లికి ప్రస్తుతం లోకల్ రైళ్లు చాలా తక్కువగా ఉన్నాయి. పైగా కొన్ని రైళ్లు రాత్రి పూట వస్తున్నాయి. వీటికి అనుగుణంగా ప్రస్తుతం ఆర్టీసీ కూడా బస్సులు నడిపించడం లేదు. దీంతో ప్రయాణీకులు ఆటోలనే ఆశ్రయించాల్సి వస్తుంది. ఇది ప్రయాణీకులకు భారంగా ఉంటుందని… మార్పులకు అనుగుణంగా.. సికింద్రాబాద్ – చర్లపల్లి మధ్య ఎంఎంటీఎస్ రైళ్లు నడిపించాలని ప్రయాణీకులు కోరుతున్నారు.

