సాధారణంగా… సామాన్య ప్రజల్లో ఒక నానుడి ఉంటుంది. అది ఎవరైనా సరే రాజకీయ నాయకుడితో గోక్కోవడం అనేది కొరివితో తల గోక్కున్నట్టే ఉంటుందని. ఏపీలో ఈ విషయం పక్కాగా రుజువు అయింది. వైసీపీలో ఉన్నప్పుడు… ఎంపీ అని కూడా చూడకుండా… తాను జగన్ కు ఎదురు తిరిగాను అనే కారణంతో అరెస్ట్ చేసి చిత్ర హింసలు పెట్టడాన్ని… రఘురామ కృష్ణం రాజు సీరియస్ గా తీసుకున్నారు. ఆయనకు ఉన్న పలుకుబడిని… లేదంటే వ్యక్తిగత బలాన్ని తక్కువ అంచనా వేసిన అధికారులు ఆయన్ను నానా ఇబ్బందులు పెట్టారు.
Also Read: ఆ 5 ఏళ్ళు మర్చిపోను.. చంద్రబాబు సంచలన కామెంట్స్
జగన్ ఆదేశాలతో సిఐడీ అధికారులు చెలరేగిపోయారు. రఘురామను కొట్టినట్టు అప్పుడే చాలా మందికి పక్కాగా క్లారిటీ వచ్చింది. అప్పటి నుంచి ఈ విషయంల్లో రఘురామ న్యాయపోరాటం చేస్తూనే ఉన్నారు. వైసీపీ అధికారంలో ఉంది కాబట్టి ఆ కేసులో ఏ కదలిక కనపడలేదు. ఇప్పుడు ఈ వ్యవహారంలో కీలక అడుగు పడింది. అప్పుడు తనను వేధించిన అధికారి విషయంలో పట్టుదలగా పోరాటం చేసిన రఘురామ… ఎట్టకేలకు విజయ్ పాల్ ను అరెస్ట్ చేయించారు. మంగళవారం విజయ్ పాల్ ను ఒంగోలు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక ఆయన్ను ఒంగోలు జిజిహెచ్ లో వైద్య పరిక్షలు చేయించిన అనంతరం రఘురామను ఉంచిన జైల్లోనే ఉంచే అవకాశం ఉంది.
Also Read: ఆ పదవుల భర్తీ ఎప్పుడు బాబు గారు..?
రఘురామ కృష్ణంరాజు పై కస్టోడియల్ టార్చర్ కేసులో విజయపాల్ నిన్న రాత్రి అరెస్ట్ చేసిన పోలీసులు… రాత్రి మొత్తం ఒంగోలులోనే ఉంచారు. రఘురామ కేసులో నిన్న ఒంగోలు ఎస్పీ కార్యాలయంలో విచారణకి హాజరైన విజయపాల్ ను అరెస్ట్ చేసినట్టు ఎస్పీ దామోదర్ ప్రకటించారు. రాత్రి నుండి ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్ లో విజయపాల్ ఉన్నారు. గుంటూరు కోర్టులో హాజరుపరిచేందుకు ఏర్పాట్లు చేస్తున్న పోలీసులు… నిన్న రాత్రి నుండి విజయపాల్ రిమాండ్ రిపోర్ట్ తయారు చేస్తున్నారు. రిమాండ్ రిపోర్ట్ పూర్తయిన తరువాత గుంటూరు కి తరలిస్తారు. రఘురామను ఉంచిన గదిలోనే ఆయన్ను కూడా ఉంచనున్నారు.

