Sunday, June 21, 2026 05:00 PM
Sunday, June 21, 2026 05:00 PM

ఏ ఆనకట్ట అయినా కూల్చేస్తాం: భారత్ కు పాక్ వార్నింగ్ 

అమెరికా అండ చూసుకుని రెచ్చిపోతున్న పాకిస్తాన్.. ఇప్పుడు పదే పదే భారత్ కు వార్నింగ్ ఇచ్చే ప్రయత్నం చేస్తోన్న సంగతి తెలిసిందే. ఆపరేషన్ సిందూర్ తర్వాత కాల్పుల విరమణ ఒప్పందం జరిగినా సరే రెండు దేశాల మధ్య వాతావరణం మరింత వేడెక్కింది. ఉగ్రవాదులకు పాకిస్తాన్ మద్దతు ఇవ్వడాన్ని భారత్ తీవ్రంగా ఖండిస్తోంది. పహల్గాం దాడి తర్వాత పాకిస్తాన్ విషయంలో భారత్ మరింత కఠిన నిర్ణయాలు తీసుకున్న సంగతి తెలిసిందే. పాకిస్తాన్ కు సింధూ నదీ జలాలు వెళ్ళకుండా చర్యలు తీసుకుంది.

Also Read : అమెరికా టూర్ కు మోడీ.. ట్రంప్ తో భేటీ..?

దీనిపై పాకిస్తాన్ పదే పదే భారత్ కు వార్నింగ్ లు ఇచ్చింది. పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ మరియు ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ సింధు జలాల ఒప్పందం గురించి వార్నింగ్ ఇస్తూ ప్రతీకారం తీర్చుకుంటాం అంటూ హెచ్చరించారు. 26 మంది ప్రాణాలను బలిగొన్న పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత ఏప్రిల్ 23న, 1960 నాటి సింధు జలాల ఒప్పందాన్ని భారత్ రద్దు చేసింది. నీటి ప్రవాహాన్ని అడ్డుకునే ఏ ప్రయత్నమైనా యుద్ధ చర్యగా పరిగణించబడుతుందని పాకిస్తాన్ పదే పదే వార్నింగ్ ఇస్తూ వస్తోంది.

Also Read : పులివెందుల సిత్రాలు.. మళ్లీ అదే ప్రయత్నం..!

తాజాగా ఇస్లామాబాద్ లో మాట్లాడుతూ.. మా నీళ్ళను మీరు అడ్డుకోవడం అనేది జరగని పని అంటూ వార్నింగ్ ఇచ్చారు షరీఫ్. భారత్ మళ్ళీ అలాంటి ప్రయత్నాలు చేస్తే మాత్రం వదిలేది లేదన్నారు. ఫ్లోరిడాలోని టంపాలో పాకిస్తానీ ప్రవాసులను ఉద్దేశించి ప్రసంగించిన పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్, పాకిస్తాన్‌కు నీటి ప్రవాహాన్ని నిలిపివేస్తే పాకిస్తాన్ ఏ ఆనకట్టను అయినా నాశనం చేస్తోందని హెచ్చరించారు. ఆనకట్ట కట్టే వరకు ఎదురు చూసి.. కట్టిన తర్వాత కూల్చేస్తామన్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

SBI వర్సెస్ తెలంగాణా...

రాయదుర్గం భూముల కేటాయింపు వ్యవహారంలో స్టేట్...

తిరుపతిలో కేఎఫ్‌సీ, డొమినోస్‌...

ప్రముఖ అంతర్జాతీయ ఫుడ్ బ్రాండ్ల ఆహార...

తిరుపతిలో వడ్డీ మాఫియా.....

తిరుపతి నగరంలో వడ్డీ వ్యాపారం పేరుతో...

సాయికృష్ణ కేసులో వైసీపీ...

విజయవాడ రౌడీ షీటర్‌ గాదె సాయికృష్ణ...

బ్రేకింగ్: అల్లు అర్జున్‌...

హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సంధ్య...

తెలంగాణాలో జనసేన తొలి...

గత కొన్నాళ్ళుగా తెలంగాణాలో పార్టీ బలోపేతం...

పోల్స్