Wednesday, July 15, 2026 11:02 PM
Wednesday, July 15, 2026 11:02 PM

ఎన్టీఆర్ : కొత్త పార్టీయా.. తెలుగు దేశమా..?

నాలుగు రోజులుగా సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం.. జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తారా..? కొత్త పార్టీ పెడతారా..? 2029 ఎన్నికల్లో బరిలో దిగుతారా..? ఏపీ పొలిటికల్ సర్కిల్‌లో కొద్ది రోజులుగా దీనిపై చర్చ నడుస్తోంది. సోషల్ మీడియాలో వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. తమిళనాడులో విజయ్ టీవీకే అధికారంలోకి రావడంతో ఇప్పుడు జూనియర్ కూడా అదే బాటలో నడుస్డాడన్ చర్చ నడుస్తోంది. ఇక నాలుగు రోజులుగా జూనియర్ ఎన్టీఆర్‌తో పాటు అల్లు అర్జున్ పొలిటికల్ ఎంట్రీ ఉంటుందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. తొలుత ఓ స్వచ్ఛంద సంస్థ పేరుతో తారక్ పొలిటికల్ అడుగులు వెయ్యబోతున్నట్లు టాక్ నడుస్తోంది.

Also Read : బీజేపీకి పీకే మార్క్ షాక్..!

జూనియర్ ఎన్టీఆర్‌కు రాజకీయ ఆసక్తి ఉన్న విషయం పలు సందర్భాల్లో బయటపడింది. తెలుగుదేశం పార్టీకి ఆయన ప్రచారం కూడా చేశారు. 2004లో తెలుగుదేశం పార్టీ అధికారాన్ని కోల్పోయింది. 2009లో ఎలాగైనా అధికారంలోకి రావాలని భావించింది. ఆ సమయంలో జూనియర్ ఎన్టీఆర్ ఉమ్మడి రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ తరఫున ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఇచ్ఛాపురం నుంచి ఖమ్మం వరకు బస్సు యాత్ర చేశారు. ఆ సమయంలో ప్రమాదానికి గురయ్యారు. అయినా సరే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రచారంలో పాలుపంచుకున్నారు. కానీ ఆ ఎన్నికల్లో తెలుగుదేశం అధికారంలోకి రాలేదు. అనంతర పరిణామాలతో తెలుగుదేశం పార్టీకి దూరంగా ఉన్నారు జూనియర్ ఎన్టీఆర్. పూర్తిగా సినిమాలపై ఫోకస్ పెట్టారు. అయినా సరే జూనియర్ ఎన్టీఆర్ పేరు ప్రముఖంగా వినిపిస్తూ వచ్చింది.

2019 నుంచి 2024 మధ్య తెలుగుదేశం పార్టీ చాలా ఇబ్బందులు పడింది. ఆ సమయంలో జూనియర్ ఎన్టీఆర్ పేరు ప్రముఖంగా వినిపించింది పార్టీలో. ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం టార్గెట్ చేసుకునే క్రమంలో తెలుగుదేశం పార్టీ పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. ఆ సమయంలో వైసీపీలో ఉన్న జూనియర్ ఎన్టీఆర్ సన్నిహితులు కొడాలి నాని, వల్లభనేని వంటీ నేతలు తెలుగుదేశం నాయకత్వాన్ని జూనియర్ ఎన్టీఆర్‌కు అప్పగించాలని కూడా డిమాండ్ చేసిన సందర్భాలు ఉన్నాయి. లోకేష్ కోసమే జూనియర్ ఎన్టీఆర్‌ను తొక్కి పెట్టారని ఆరోపించారు కూడా. అయితే ఇవేవీ పట్టించుకోకుండా జూనియర్ ఎన్టీఆర్ తన సినిమాలు తాను చేసుకుంటూ ముందుకు సాగారు. పవన్ కళ్యాణ్ తో పొత్తులో టిడిపి అధికారంలోకి వచ్చింది. లోకేష్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యారు. మొత్తం పార్టీ బాధ్యతలు లోకేష్ చూస్తున్నారు. అయితే జూనియర్ ఎన్టీఆర్ విషయంలో లోకేష్ సానుకూల ప్రకటనలు చేస్తూ వచ్చారు. జూనియర్ ఎన్టీఆర్ వస్తే పార్టీలో సముచిత స్థానం ఉంటుందని వ్యాఖ్యానించిన సందర్భాలు కూడా ఉన్నాయి.

Also Read : భారత్‌లో కిడ్నీలో రాళ్ల సమస్య పెరుగుతోంది.. నిపుణుల హెచ్చరిక

ప్రస్తుతం టిడిపికి లోకేష్ రూపంలో బలమైన నాయకత్వం కూడా ఉంది. తాజాగా జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ పై పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. అయితే ఇప్పటికిప్పుడు ఆయన రాజకీయాల్లోకి వచ్చే అవకాశం లేదని సన్నిహితులు చెబుతున్నారు. ఆయన తప్పకుండా రాజకీయాల్లోకి వస్తారని.. కానీ అది 2034 నాటికి అని తెలుస్తోంది. అప్పటి పరిస్థితులకు అనుగుణంగా తెలుగుదేశం పార్టీలో చేరుతారా..? లేకుంటే కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తారా..? అన్నది అప్పటి పరిస్థితులకు అనుగుణంగా ఉంటుందని సన్నిహితులు చెబుతున్నారు. అయితే ప్రస్తుతానికి మాత్రం ఆయన టీడీపీలో ఉంటూ నాయకత్వం నచ్చని నేతలతో.. వైసీపీలో ఉన్న తన సన్నిహితులతో కూడా చర్చలు జరుపుతున్నారన్న ప్రచారం సాగుతోంది. అయితే అది ఇప్పటికీ ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చేందుకు కాదు అని.. 2034 ఎన్నికలే టార్గెట్ అని తెలుస్తోంది. మొత్తానికి జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ పై రాజకీయ వర్గాల్లో మాత్రం ఎడతెగని చర్చ మాత్రం జరుగుతోంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

రేవంత్ కు పవన్...

తెలంగాణలోని షాద్‌ నగర్‌ లో పోక్సో...

పవన్ సంచలన నిర్ణయం.....

ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్...

టీడీపీలో ప్రక్షాళన.. వారికి...

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి పరిపాలనలో...

తెలంగాణా ఫోన్ ట్యాపింగ్...

గత ఆరేళ్లుగా తెలంగాణ రాజకీయ, అధికార...

చంద్రబాబుకు ఉన్న నీటి...

తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్...

ఆ ముగ్గురి చుట్టూ...

తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన ఫోన్...

పోల్స్