Saturday, September 19, 2026 09:35 PM
Saturday, September 19, 2026 09:35 PM

తెలుగు ఆల్ రౌండర్ కు దక్కని చోటు.. ఆసియా కప్ జట్టు ఇదే..!

భారత్ ప్రతిష్టాత్మకంగా భావించే ఆసియా కప్ కు జట్టును ప్రకటించింది సెలెక్షన్ కమిటీ. ఇంగ్లాండ్ పర్యటన తర్వాత క్రికెట్ కు స్వల్ప విరామం లభించగా.. వచ్చే నెల 9 నుంచి జరగబోయే ఆసియా కప్ కు సీనియర్లు, జూనియర్లతో కూడిన జట్టును ఎంపిక చేసింది. ఈ జట్టు ఎంపిక విషయంలో దాదాపు వారం రోజుల నుంచి అనేక వార్తలు వచ్చాయి. టెస్ట్ కెప్టెన్ శుభమన్ గిల్.. టి20 జట్టులో చేరే అవకాశం ఉందని ప్రచారం జరిగింది. అలాగే కెఎల్ రాహుల్, సిరాజ్ కూడా టి20 జట్టులో చేరే అవకాశం ఉందని వార్తలు వచ్చాయి.

Also Read : సూర్య కుమార్ క్యాచ్ పై అంబటి సంచలన కామెంట్..!

వీటిల్లో కొన్ని నిజమయ్యాయి.. గిల్ అందరూ ఊహించినట్టు గానే జట్టులో చేరాడు. గిల్ తో పాటుగా సీనియర్ పేస్ బౌలర్ బూమ్రా కూడా తిరిగి టి20 జట్టులో చేరారు. గిల్ వస్తే తిలక్ వర్మకు చోటు కష్టమే అని భావించినా.. తిలక్ ను కూడా తీసుకుంది సెలెక్షన్ కమిటీ. సూర్య కుమార్ యాదవ్ ను కెప్టెన్ గా ఎంపిక చేసారు. శుభ్‌మన్ గిల్ వైస్ కెప్టెన్ గా.. ఎంపిక అయ్యాడు. మిగిలిన జట్టు చూస్తే.. అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, జితేష్ శర్మ (కీపర్), జస్‌ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, సంజూ శాంసన్ (కీపర్), హర్షిత్ రాణాలను ఎంపిక చేసారు.

Also Read : ఆ ఇద్దరి కోసం పంత్ కెప్టెన్సీ వదులుకున్నాడా..?

తిలక్ వర్మ, తుది జట్టులో ఉంటాడా లేదా అనేది చెప్పడం కష్టమే. గిల్ ఖచ్చితంగా 3వ స్థానంలో బ్యాటింగ్ చేసే అవకాశం ఉంది. సాయి సుదర్శన్ టి20 జట్టులోకి వచ్చే అవకాశం ఉందని భావించినా.. చోటు దక్కలేదు. ఆల్ రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి కూడా జట్టులో చేరే అవకాశం ఉందని అంచనా వేసారు. కాని హార్దిక్ పాండ్యా, శివమ్ దూబేకి చోటు కల్పించారు. ఇక టెస్ట్ క్రికెటర్ జైస్వాల్ కూడా టి20 లలో చోటు కోల్పోయాడు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

తిరుమల లడ్డూ పై,...

ఈడీ అంటే ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌.. ఈ...

ఇప్పటికీ వారికే పదవులు.....

కూటమి ప్రభుత్వం ఏర్పడి, దాదాపు రెండున్నర...

సాయిరెడ్డి.. నెట్టుకు రాగలరా.....

కొత్త ఎపుడూ వింతే. అందుకే కొత్తగా...

25 రోజుల తర్వాత...

ఏపీ డిప్యూటి సీఎం, జనసేన అధినేత...

ఏపీలో మద్యం షాపుల...

ఆంధ్రప్రదేశ్‌లో 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను...

బాంబు పేల్చిన టీడీపీ...

గుంటూరు పశ్చిమ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ...

పోల్స్