Thursday, May 7, 2026 08:00 AM
Thursday, May 7, 2026 08:00 AM

ఐఫోన్ 17.. మేడిన్ ఇండియా.. బెంగళూరులో మొదలైన ప్రొడక్షన్..!

భారత్ లో పెట్టుబడుల విషయంలో ప్రముఖ టెక్ దిగ్గజం ఆపిల్, పక్కా ప్లానింగ్ తో దూసుకుపోతోంది. భారత్ లో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు సంస్థ మరిన్ని ప్రణాలికలు రచిస్తోంది. ఇప్పటికే కర్ణాటకలో పెట్టుబడులు పెట్టిన ఆపిల్, త్వరలో ఉత్పత్తులను మరింతగా విస్తరించే దిశగా అడుగులు వేస్తోంది. ఆపిల్ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఐఫోన్ 17 ఉత్పత్తిని ఇప్పుడు బెంగళూరులో మొదలుపెట్టినట్టు అధికారికంగా ప్రకటించింది. ఈ ఫోన్ ను వచ్చే నెల విడుదల చేసే అవకాశం ఉంది.

Also Read : వైసీపీకి టీడీపీ బంపర్ ఆఫర్..!

తైవాన్ ఎలక్ట్రానిక్స్ దిగ్గజం ఫాక్స్‌కాన్, బెంగళూరులో ఆపిల్ ఉత్పత్తులను తయారు చేస్తోంది. తమ కొత్త ఫ్యాక్టరీలో ఐఫోన్ 17 ఉత్పత్తిని ప్రారంభించింది. చైనా వెలుపల ఫాక్స్‌కాన్ కు చెందిన రెండవ అతిపెద్ద ఐఫోన్ తయారీ యూనిట్. దాదాపు 2.8 బిలియన్ల డాలర్లు అంటే భారత కరెన్సీలో సుమారు రూ. 25,000 కోట్లు పెట్టుబడితో ఏర్పాటు చేసారు. దేవనహళ్లిలో ఉన్న బెంగళూరు యూనిట్ ఇప్పుడు ఫాక్స్‌కాన్ చెన్నై ప్లాంట్‌తో కలిసి ఐఫోన్ 17 ను తయారు చేస్తోందని ఆపిల్ తెలిపింది.

Also Read : జీఎస్టీ తగ్గుతోంది.. మిడిల్ క్లాస్ కు పండుగే.. తగ్గే ధరలు ఇవే..!

భారత్ లో ఐఫోన్ ఉత్పత్తులను పెంచాలని ఆపిల్ భావిస్తోంది. 2024–25లో 35–40 మిలియన్ యూనిట్లను ఉత్పత్తి చేసింది. ఈ సంవత్సరం దానిని 60 మిలియన్ యూనిట్లకు పెంచాలని కంపెనీ భావిస్తోంది. అమెరికా, కెనడా సహా పలు దేశాల్లో భారత్ లో తయారు చేసిన ఐఫోన్ లను విక్రయిస్తోంది. 2023లో, బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలోని దేవనహళ్లిలో ఫాక్స్‌కాన్ 13 మిలియన్ చదరపు అడుగుల భూమిని కొనుగోలు చేసి ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. 22 బిలియన్ డాలర్ల విలువ చేసే ఐఫోన్ లను గత ఏడాది ఉత్పత్తి చేసింది ఆపిల్.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

లోకేష్ సంచలన నిర్ణయం,...

ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖలో భారీ మార్పులకు శ్రీకారం...

ముఖ్యమంత్రి కాన్వాయ్‌ పై...

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన...

ఏపీకి మరో దిగ్గజ...

ఏపీకి అంతర్జాతీయ పరిశ్రమలు క్యూ కడుతున్నాయి....

ఇన్ అండ్ అవుట్.....

తెలంగాణాలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి రెండున్నరేళ్లు...

ఏపీ ఐపీఎస్ ను...

ఆంధ్రప్రదేశ్‌ లో సంచలనం సృష్టించిన సినీ...

విజయ్ చుట్టూ ఏపీ..వైసీపీ...

తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ...

పోల్స్