రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ సింగపూర్ లోని సన్ టెక్ సిటీని సందర్శించారు. అక్కడ డీపీ అర్బన్ ఆర్కిటెక్ట్ సంస్థ డైరెక్టర్ ఆనందన్ కరుణాకరన్ తో లోకేష్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ… ప్రపంచస్థాయి మైస్ (MICE – Meetings, Incentives, Conferences, and Exhibitions) ఈవెంట్లకు కేంద్రంగా మారడమే ఆంధ్రప్రదేశ్ లక్ష్యమని రాష్ట్ర మంత్రి లోకేష్ పేర్కొన్నారు. ఇందుకోసం తాము కొత్త మైస్ విధానాన్ని రూపొందిస్తున్నామని తెలిపారు. అంతర్జాతీయ ఈవెంట్ నిర్వాహకులకు సింగిల్ విండో అనుమతులను వేగవంతం చేయడానికి విశాఖపట్నం, అమరావతి, తిరుపతిలలో ప్రత్యేక బ్యూరోలను ఏర్పాటు చేస్తున్నామని లోకేష్ చెప్పారు..
Also Read : మే 15 నుంచి చమురు మోత.. గెట్ రెడీ..
రాబోయే 5 సంవత్సరాలలో రాష్ట్రంలోని హోటల్ గదుల సంఖ్య 4 రెట్లు పెరిగి 20,000కు చేరుకుంటుందని మంత్రి లోకేష్ అన్నారు. ప్రముఖ జాతీయ, అంతర్జాతీయ హాస్పిటాలిటీ సంస్థలు అమరావతికి వస్తున్నాయి. మైస్ పరిశ్రమను ప్రోత్సహించడానికి అమరావతిలో 4 కన్వెన్షన్ సెంటర్లకు రాష్ట్రం ఆమోదం తెలిపింది. విశాఖపట్నంలో ఒక ప్రపంచ స్థాయి MICE కేంద్రాన్ని నిర్మించబోతున్నాం. భారత ప్రభుత్వ ఇండియా ట్రేడ్ ప్రమోషన్ ఆర్గనైజేషన్‌తో భాగస్వామ్యంతో వైజాగ్‌లో ఆంధ్ర మండపాన్ని ఏపీ ఇప్పటికే ప్రకటించింది. విశాఖ తీరప్రాంతం గూగుల్, టీసీఎస్, కాగ్నిజెంట్ వంటి ప్రముఖ గ్లోబల్ టెక్ కంపెనీలకు ఆతిథ్యం ఇస్తోందని లోకేష్ తెలిపారు.
Also Read : రోజా అరెస్టుకు ఐఏఎస్ బ్రేకులు..!
డీపీ అర్బన్ ఆర్కిటెక్ట్ డైరెక్టర్ ఆనందన్ కరుణాకరన్ మాట్లాడుతూ… సింగపూర్ డౌన్ టౌన్ వ్యాపార కేంద్రానికి నడిబొడ్డున ఉన్న సన్ టెక్ సిటీ ని తమ సంస్థ డిజైన్ చేసిందని, ఇది 42వేల మీటర్ల విస్తీర్ణంలో అధునాతన సాంకేతికతతో నిర్మించిన ఈవెంట్ ప్లేస్ అని తెలిపారు. సింగపూర్ ను అగ్రశ్రేణి, సురక్షితమైన, విశ్వసనీయమైన గమ్యస్థానంగా నిలబెట్టడానికి సింగపూర్ టూరిజం బోర్డ్ (STB) విస్తృత ప్రచారం కల్పిస్తోంది. 2040 నాటికి మైస్ సందర్శకుల వ్యయాన్ని పెంచడం, తద్వారా టూరిజం ఆదాయాన్ని మూడు రెట్లు పెంచడం సింగపూర్ టూరిజం బోర్డు లక్ష్యం. ఈ పరిశ్రమ సుస్థిరత ధృవీకరణపై ఎక్కువగా దృష్టి సారిస్తుంది. సన్‌టెక్ సిటీ, మెరీనా బే సాండ్స్ వంటి ఇప్పటికే ఉన్న వేదికలపై కొత్త MICE హబ్‌ను నిర్మించడానికి సింగపూర్ ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు ఆనందన్ కరుణాకరన్ చెప్పారు.

