దేశ ఆర్థిక వ్యవస్థను బాహ్య ఒత్తిళ్ల నుండి కాపాడేందుకు ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ పర్యటన సందర్భంగా.. ఒక కీలకమైన సలహా ఇచ్చారు. పెట్రోల్ వినియోగాన్ని తగ్గించడం, బంగారం కొనుగోళ్లు వాయిదా వేయడం, విదేశీ ప్రయాణాలను నివారించడం వంటివి సామాన్యమైన సూచనల్లా అనిపించినా, వీటి వెనుక భారత్ యొక్క.. యొక్క కరెంట్ అకౌంట్ డెఫిసిట్ ను నియంత్రించాలనే బలమైన వ్యూహం ఉంది. పశ్చిమ ఆసియాలో జరుగుతున్న యుద్ధం కారణంగా అంతర్జాతీయ మార్కెట్ లో క్రూడ్ ఆయిల్ ధరలు బ్యారెల్ కు 105 డాలర్లు దాటింది.
Also Read : అనవసర వివాదానికి తెర లేపిన బాలినేని..!
భారత్ తన చమురు అవసరాల కోసం 85% దిగుమతులపైనే ఆధారపడటం వల్ల, చమురు ధరలు పెరిగిన ప్రతిసారీ దేశం నుండి భారీగా డాలర్లు బయటకు తరలిపోతున్నాయి. ఇది మన కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అంటే.. మనం పంపే డాలర్లు వర్సెస్ మనకు వచ్చే డాలర్ల మధ్య తేడా పెరగడానికి దారి తీస్తోంది. అందుకే, పెట్రోల్ ఆదా చేయడం ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థపై పడుతున్న భారాన్ని తగ్గించాలని ప్రధాని కోరుతున్నారు. చమురు తర్వాత భారత్ అత్యధికంగా డాలర్లను ఖర్చు చేస్తున్నది బంగారం దిగుమతుల కోసమే.
Also Read : ఢిల్లీలో బిజీ బిజీగా చంద్రబాబు..!
బంగారం దిగుమతి అనేది ఆర్థికంగా డెడ్ ఇన్వెస్ట్‌మెంట్ అని ఆర్థికవేత్తలు భావిస్తారు. అలాగే, ఏటా కోట్లాది మంది భారతీయులు విదేశీ ప్రయాణాలు చేయడం వల్ల కూడా విదేశీ మారక ద్రవ్యం బయటకు వెళ్తోంది. ఈ రెండింటిని తగ్గించడం ద్వారా దేశంలో డాలర్ నిల్వలను కాపాడుకోవచ్చని, తద్వారా రూపాయి విలువ పడిపోకుండా చూడవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. ప్రధాని ఇచ్చిన ఈ అడ్వైజరీ కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదు, పౌరుల బాధ్యత కూడా అని ఆయన స్పష్టం చేశారు.
వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రోత్సహించడం, పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ వాడటం, విదేశీ వెకేషన్లకు బదులు స్వదేశీ పర్యాటకానికి మొగ్గు చూపడం వంటి చిన్న చిన్న మార్పులు దేశ ఆర్థిక వ్యవస్థను అస్థిరత నుండి కాపాడతాయి. మొత్తానికి, మీ పెట్రోల్ బిల్లు, మీ బంగారు ఆభరణాలు, మీ విదేశీ యాత్రలు కేవలం మీ వ్యక్తిగత విషయాలు మాత్రమే కాదు.. అవి భారతదేశ ఆర్థిక సార్వభౌమత్వాన్ని నిర్ణయించే కీలక అంశాలని ప్రధాని మోదీ ఈ అడ్వైజరీ ద్వారా గుర్తు చేశారు.

