Monday, August 3, 2026 09:38 AM
Monday, August 3, 2026 09:38 AM

రాజకీయాల్లోకి అలేఖ్య రెడ్డి..!

అలేఖ్య రెడ్డి.. ఈ పేరు పెద్దగా తెలియదు. కానీ నందమూరి తారకరత్న పేరు చెబితే చాలు.. వెంటనే గుర్తుకు వస్తుంది. నందమూరి తారక రత్న సతీమణి అలేఖ్య రెడ్డి. నందమూరి కుటుంబం నుంచి మహిళలు బయటకు వచ్చిన సందర్భాలు లేవు. కానీ ఇప్పుడు మాత్రం అలేఖ్య రెడ్డి పేరు బాగా వినిపిస్తోంది. త్వరలోనే ఆమె రాజకీయాల్లోకి వస్తారనే ప్రచారం జోరుగా జరుగుతోంది. అయితే ఈ ఎంట్రీ ఏ పార్టీ తరఫున ఉంటుంది.. ఆమెకు ఎవరు మద్దతు ఇస్తారు అనేది తెలియటం లేదు.

Also Read : ఆ స్కూల్ విద్యార్ధులకు సారీ చెప్పిన లోకేష్.. అసలేం జరిగింది..?

నందమూరి తారకరత్న గుండె పోటుతో మృతి చెంది మూడేళ్లు దాటింది. యువగళం పాదయాత్ర ప్రారంభం సందర్భంగా కుప్పం వెళ్లిన తారకరత్న.. పాదయాత్ర ప్రారంభించిన కొద్ది సేపటికి కుప్పకూలిపోయారు. ఆఘ మేఘాల మీద ఆయనకు ప్రాధమిక చికిత్స అందించిన వైద్యులు.. వెంటనే బెంగళూరు తరలించారు. సుమారు నెల రోజుల పాటు మృత్యువుతో పోరాడిన తారక రత్న.. ఫిబ్రవరి 18, 2023న 39 ఏళ్ల వయసులో కన్ను మూశారు. ఆ తర్వాత నుంచి అలేఖ్య రెడ్డి డీలా పడిపోయారు. ఆమె తిరిగి కోలుకోవడానికి చాలా సమయం పట్టింది.

తారకరత్న, అలేఖ్య రెడ్డిది ప్రేమ వివాహం. అయితే ఈ పెళ్లి తారకరత్న తల్లిదండ్రులకు ఇష్టం లేదు. అందుకే వారు దూరం పెట్టారు. అయితే తమకు తొలి నుంచి తారకరత్న బాబాయ్ నందమూరి బాలకృష్ణ అండగా ఉన్నారని.. అని విధాలుగా సాయం చేశారని అలేఖ్య తెలిపారు. కల్యాణ్ రామ్‌కు కూడా తారకరత్నతో మంచి సంబంధాలున్నాయన్నారు అలేఖ్య రెడ్డి. తారకరత్న చనిపోయి మూడేళ్లు దాటినప్పటికీ.. ఆయన తల్లిదండ్రులు ఇప్పటికీ తనను, పిల్లలను దగ్గరకు తీయటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

Also Read : ‘రాజనీతి సురేష్‌’ పై వంద కోట్ల దావా.. అంత భయం ఎందుకు?

తారకరత్నకు రాజకీయాలపై మంచి అవగాహన ఉందని.. 2024 ఎన్నికల్లో గన్నవరం నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేయాలని భావించినట్లు అలేఖ్య వెల్లడించారు. అందుకే తరచూ ఆ నియోజకవర్గంలో పర్యటించినట్లు గుర్తు చేశారు. తాను రాజకీయాల్లోకి వచ్చే అంశంపై ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం తనపైన పిల్లల బాధ్యత ఉందని.. అది సక్రమంగా నెరవేర్చాల్సిన అవసరం ఉందన్నారు. నందమూరి కుటుంబానికి చెడ్డ పేరు రాకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు అలేఖ్య రెడ్డి తెలిపారు. ఎప్పటికైన తన పిల్లలను తారకరత్న తల్లిదండ్రులు దగ్గరకు తీసుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు.

అలేఖ్య రెడ్డి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి అలేఖ్య రెడ్డి దగ్గర బంధువు. అలేఖ్య రాజకీయాల్లోకి రావాలనుకుంటే.. టీడీపీ తరఫున పోటీ చేస్తారా.. లేక వైసీపీ తరఫున రాజకీయాల్లోకి వస్తారా అనే చర్చ జరుగుతోంది. తారకరత్న మృతి చెందినప్పుడు.. టీడీపీ అధినేత చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ సహా కుటుంబ సభ్యులంతా అలేఖ్యకు అండగా నిలిచారు. బాలకృష్ణ, విజయసాయిరెడ్డి దగ్గరుండి అన్ని పనులు చూసుకున్నారు. ఇప్పటి వరకు సైలెంట్‌గా ఉన్న అలేఖ్య రెడ్డి.. తారకరత్న చనిపోయిన మూడేళ్ల తర్వాత ఇలా వ్యాఖ్యానించటం హాట్ టాపిక్‌గా మారింది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

ఉత్తరాంధ్ర కాదు.. ఇక...

విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన అల్లూరి...

ఇదీ ఉత్తరాంధ్ర దెబ్బ.....

భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ...

మోడీని దారుణంగా మాట్లాడారు.....

భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ...

భోగాపురంలో చరిత్ర సృష్టించిన...

ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాల కల సాకారమవుతూ,...

అంతర్జాతీయ అద్భుతం.. మన...

విజయనగరం జిల్లా భోగాపురంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా...

భోగాపురం భోగం ఎవరిది.....

మరికొన్ని గంటల్లో విజయనగరం జిల్లా భోగాపురంలో...

పోల్స్