Thursday, June 25, 2026 10:44 PM
Thursday, June 25, 2026 10:44 PM

పాస్‌పోర్ట్ జాతీయత కాదా..? చట్టం ఏం చెప్తుంది..?

భారతీయ పాస్‌పోర్ట్ అనేది కేవలం ఒక ట్రావెల్ డాక్యుమెంట్ మాత్రమేనని, అది పౌరసత్వానికి చట్టపరమైన నిరూపణ కాదని కేంద్ర ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి. విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారి ఒకరు చేసిన వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తుండటంతో ప్రభుత్వం ఈ వివరణ ఇచ్చింది. పాస్పోర్ట్ ఉన్నంత మాత్రాన ప్రభుత్వ సంక్షేమ పథకాలకు అర్హులు కాలేరని అధికారులు స్పష్టం చేసారు. భారతదేశంలో పాస్పోర్ట్‌ల జారీ 1967 పాస్పోర్ట్ చట్టం ప్రకారం జరుగుతుంది.

Also Read : తిరుపతిలో భూమన భారీ భూబాగోతాలు..!

ఈ చట్టం ప్రకారం సాంకేతికంగా పౌరులు కాని వారికి కూడా కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో పాస్పోర్ట్ జారీ చేసే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు గుర్తు చేస్తున్నాయి. గతంలో 2013లో బాంబే హైకోర్టు సైతం ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ, కేవలం పాస్పోర్ట్ కలిగి ఉండటం పౌరసత్వానికి ఖచ్చితమైన ఆధారంగా భావించలేమని తీర్పు ఇచ్చింది. మన దేశంలో పౌరసత్వం అనేది 1955 పౌరసత్వ చట్టం పరిధిలోకి వస్తుంది. ఒక వ్యక్తిని చట్టబద్ధంగా భారతీయ పౌరుడిగా గుర్తించడానికి ఈ చట్టంలోని నిబంధనలే ప్రామాణికం.

Also Read : ముగ్గురు సీఎంల చారిత్రాత్మక భేటీ.. తుంగభద్ర వేదికగా సరికొత్త రాజకీయం..!

ప్రస్తుతం ఆధార్ కార్డ్, ఓటర్ ఐడీ, పాస్పోర్ట్ వంటి ఐడీ కార్డులేవీ పౌరసత్వ నిరూపణకు పూర్తి ఆధారాలు కావని తేలడంతో, బర్త్ సర్టిఫికేట్ లేదా ప్రభుత్వం అధికారికంగా జారీ చేసిన పౌరసత్వ పత్రం మాత్రమే అసలైన ఆధారాలుగా నిలుస్తాయని నిపుణులు చెబుతున్నారు. సోషల్ మీడియాలో నెటిజన్లు ప్రభుత్వంపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఆధార్ కార్డు కావాలంటే పాన్ లేదా ఇతర సర్టిఫికేట్లు అడుగుతారు, పాన్ కావాలంటే ఆధార్ లింక్ చేయమంటారు, పాస్పోర్ట్ కావాలంటే ఆధార్ తప్పనిసరి అంటారు. ఇలా ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్న ఐడీ కార్డుల వ్యవస్థను సృష్టించి, చివరకు అవేవీ పౌరసత్వానికి పనికిరావని చెప్పడం సామాన్యుడిని ఎగతాళి చేయడమేనని నెటిజన్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

నదుల అనుసంధానంతో భారత్...

కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్...

తిరుపతిలో భూమన భారీ...

వైసీపీ సీనియర్ నేత, టీటీడీ మాజీ...

ముగ్గురు సీఎంల చారిత్రాత్మక...

తుంగభద్ర ప్రాజెక్టు కొత్త గేట్ల ప్రారంభోత్సవ...

లోకేష్ సంచలన ప్రకటన.....

అరుదైన వ్యాధులతో ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న...

సీఐ నాగరాజు రిమాండ్...

విజయవాడలో తీవ్ర సంచలనం సృష్టించిన గాదె...

నేనే చేసానని గ్యారెంటీ...

ఆంధ్రప్రదేశ్‌ లో తీవ్ర సంచలనం సృష్టించిన...

పోల్స్