Thursday, May 7, 2026 07:04 AM
Thursday, May 7, 2026 07:04 AM

ఉంటారా.. పోతారా.. లోకేష్ వార్నింగ్..!

తెలుగుదేశం పార్టీ నేతలకు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాస్ వార్నింగ్ ఇచ్చారు. పార్టీ నిర్ణయమే ఫైనల్ అని.. పార్టీ లైన్ దాటితే ఎవరైనా ఒకటే అని వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యేగా ఎవరైనా గెలిచారంటే.. అది పార్టీ వల్లే అనే విషయం గుర్తు పెట్టుకోవాలన్నారు. పార్టీ గెలిస్తేనే.. ఎవరికైనా సరే మంత్రిపదవులు, ఇతర పదవులు వస్తాయనే విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తు చేసుకోవాలన్నారు. పార్టీ అండ లేకుండా ఎవరూ గెలవలేదన్నారు లోకేష్. సొంత ఇమేజ్‌తో గెలిచామనుకుంటే.. స్వతంత్రంగా పోటీ చేసి గెలవాలని సూచించారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ప్రజాదర్బార్‌కు పెద్ద ఎత్తున ప్రజలు రావటం పట్ల లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్కరోజే 5 వేల మంది వస్తారా.. అని ప్రశ్నించారు. అంటే.. పార్టీలో ప్రతిరోజూ గ్రీవెన్స్ నిర్వహించటం లేదా అని నిలదీశారు. గ్రీవెన్స్‌లో సమస్యలు పట్టించుకోవటం లేదు కాబట్టే.. ప్రజలు నేరుగా తనను కలిసేందుకు వచ్చారని లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Also Read : కాంగ్రెస్ కోటలో జూబ్లీహిల్స్ గుబులు..!

సుదీర్ఘకాలం తర్వాత పార్టీ కేంద్ర కార్యాలయానికి నారా లోకేష్ వచ్చారు. ప్రతి రోజు ఉండవల్లిలో నిర్వహించే ప్రజాదర్బార్‌ను పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. ఈ నేపథ్యంలో నారా లోకేష్‌కు నేరుగా ఫిర్యాదులు చేసేందుకు, తమ సమస్యలు విన్నవించుకునేందుకు ప్రజలు పెద్ద ఎత్తున వచ్చారు. ఉదయం నుంచే ప్రజలు బారులు తీరిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. పార్టీ కార్యాలయం బయట వరకు క్యూ లైన్ ఏర్పాటు చేశారు. ప్రతి ఒక్కరి నుంచి స్వయంగా మాట్లాడిన లోకేష్.. అనంతరం పార్టీ నేతలతో సమావేశమయ్యారు. అసలు ప్రతిరోజు గ్రీవెన్స్ జరుగుతుందా అని ఆరా తీశారు. అలా గ్రీవెన్స్ జరిగితే.. ఇలా తన వద్దకు ఇంతమంది ఎందుకు వచ్చారని నిలదీశారు. గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేస్తే ఎలాంటి సమస్య అయినా పరిష్కరించాలని.. అలా చేయటం లేదు కాబట్టే.. అందరు తన వద్దకు వస్తున్నారన్నారు లోకేష్. నియోజకవర్గాల్లో గ్రీవెన్స్ నిర్వహిస్తున్నారా లేదా అనే విషయంపై తనకు నివేదిక ఇవ్వాలని పార్టీ నేతలను లోకేష్ ఆదేశించారు.

Also Read : గోవాలో కల్తీ మద్యం.. అద్దేపల్లి లిక్కర్ దందా..!

ఇదే సమయంలో పార్టీలో అంతర్గత కలహాలపై లోకేష్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎవరికైనా సరే.. పార్టీ సుప్రీం అని సూచించారు. సొంత ఇమేజ్ పైన గెలిచామనుకునే వారు స్వతంత్రంగా పోటీ చేయాలని లోకేష్ సూచించారు. తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు, కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి పైన వచ్చిన ఫిర్యాదులు పార్టీకి చేటు కలిగించేలా ఉన్నాయన్నారు లోకేష్. పార్టీలో అంతర్గత కుమ్ములాటలకు కారణాలేమిటని పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావుతో లోకేష్ చర్చించారు. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎవరికైనా పార్టీ నిర్ణయం ఫైనల్ అని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

లోకేష్ సంచలన నిర్ణయం,...

ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖలో భారీ మార్పులకు శ్రీకారం...

ముఖ్యమంత్రి కాన్వాయ్‌ పై...

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన...

ఏపీకి మరో దిగ్గజ...

ఏపీకి అంతర్జాతీయ పరిశ్రమలు క్యూ కడుతున్నాయి....

ఇన్ అండ్ అవుట్.....

తెలంగాణాలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి రెండున్నరేళ్లు...

ఏపీ ఐపీఎస్ ను...

ఆంధ్రప్రదేశ్‌ లో సంచలనం సృష్టించిన సినీ...

విజయ్ చుట్టూ ఏపీ..వైసీపీ...

తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ...

పోల్స్