Saturday, September 19, 2026 12:18 PM
Saturday, September 19, 2026 12:18 PM

అఖండ సీక్వెల్ పై క్రేజీ అప్డేట్

టాలీవుడ్ ఇప్పుడు బాలీవుడ్ ను షేక్ చేసేస్తోంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. బాలీవుడ్ స్టార్ హీరోలను మించి మన తెలుగు సినిమాలు ఆడటం సంచలనం అవుతోంది. బాహుబలి సినిమా నుంచి ఈ ట్రెండ్ మొదలైనా ఇప్పుడు మాత్రం దూకుడు ఎక్కువగా కనపడుతోంది. సీనియర్ హీరోలు కూడా బాలీవుడ్ లో సందడి చేస్తున్నారు. అఖండ సినిమాతో నార్త్ లో బాలయ్య హవా పక్కాగా కనపడింది. అక్కడ ఈ సినిమాను హిందువులు ఎక్కువగా చూసారు. ఇప్పుడు అఖండ సీక్వెల్ ను ప్లాన్ చేసేసారు. ఈ సీక్వెల్ దసరా రోజు అధికారికంగా ప్రకటించి షూట్ మొదలుపెట్టారు.

ఇక ఈ సినిమాలో విలన్ గా బాలీవుడ్ స్టార్… బాబీ డియోల్ ను ఫైనల్ చేసినట్టు ప్రచారం జరిగింది. యానిమల్ సినిమాతో బాబీ తెలుగులో కూడా ఫేమస్ అయ్యాడు. అలాగే మరో హీరోయిన్ గా ఐశ్వర్య రాయ్ ని తీసుకుంటున్నారని ఆమెకు నాలుగు కోట్లు కూడా ఇవ్వడానికి రెడీ అయ్యారని తెలిసింది. ఇక ఇప్పుడు బాలయ్య ఈ సినిమాను ప్రమోట్ చేయడానికి ఈజీగా ఉండేందుకు అన్ని భాషల్లో తానే డబ్బింగ్ చెప్పాలని డిసైడ్ అయ్యాడు. తెలుగుతో పాటుగా హిందీ, తమిళం, కన్నడ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది.

Also Read : కాస్టింగ్ కౌచ్ పై మహిళా జర్నలిస్ట్ గూబ గుయ్యమనిపించిన అనన్య

మిగిలిన భాషలు కూడా ఆయన చెప్తే సినిమాకు కచ్చితంగా హైప్ వస్తుంది. ఆ భాషలు అన్నీ బాలయ్య ఈజీగానే మాట్లాడతారు. అయితే మూడు భాషల్లో సినిమాను ఏక కాలంలో షూట్ చేయాలని డైరెక్టర్ భావిస్తున్నట్టుగా సమాచారం. ఏది ఎలా ఉన్నా 7 పదుల వయసు దగ్గర పడుతున్నా బాలయ్య మాత్రం దూకుడుగా ఉండటం, వరుసగా సినిమాలు చేయడం మాత్రం సంచలనమే. కాగా ఇటీవల దేవర సినిమా విషయంలో కూడా అన్ని భాషల్లో డబ్బింగ్ చెప్పి సెన్సేషన్ క్రియేట్ చేసాడు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

25 రోజుల తర్వాత...

ఏపీ డిప్యూటి సీఎం, జనసేన అధినేత...

ఏపీలో మద్యం షాపుల...

ఆంధ్రప్రదేశ్‌లో 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను...

బాంబు పేల్చిన టీడీపీ...

గుంటూరు పశ్చిమ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ...

ఏపీ లిక్కర్ కుంభకోణం.....

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గత వైఎస్సార్ కాంగ్రెస్...

రేవంత్ దెబ్బ.. బీఆర్ఎస్‌కు...

ఏదో అనుకుంటే.. మరేదో జరిగినట్లు ఉంది...

దానం నాగేందర్ కు...

ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు తెలంగాణ...

పోల్స్