Saturday, September 26, 2026 07:13 AM
Saturday, September 26, 2026 07:13 AM

ఇదేం ఆట గురూ.. ఇషాన్ ఆట తీరుకు ఫిదా..!

టీం ఇండియాలో రోహిత్ శర్మ తర్వాత ఆ స్థాయిలో దూకుడుగా, నిలకడగా ఆడే ఆటగాడి కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. జట్టులో ఎందరు ఆటగాళ్ళు వచ్చినా.. కసితో ఆడే ఆటగాడు కనపడటం లేదు. ఏదో ఒకటి రెండు మ్యాచ్ లకు మాత్రమే తమ సత్తా చూపుతూ అభిమానులను నిరాశ పరుస్తున్నారు. అలాంటి భారత జట్టుకు ఇప్పుడు సరికొత్త జోష్ కనపడుతోంది. వీరేంద్ర సెహ్వాగ్, రోహిత్ శర్మ, యువరాజ్ సింగ్ వారసులు జట్టులో కనపడుతున్నారు. అభిషేక్ రూపంలో యువరాజ్ కు వారసుడు దొరికినట్టే.

Also Read : ఇండియన్స్ కు సింగపూర్ రెడ్ కార్పెట్..!

ఇక రోహిత్ వారసుడిగా ఇషాన్ కిషన్ ప్రసంశలు అందుకుంటున్నాడు. ఇషాన్ కిషన్ దూకుడు చూసిన క్రికెట్ అభిమానులు.. ఈ నిలకడ టి20 వరల్డ్ కప్ లో కూడా కొనసాగించాలి అంటూ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. న్యూజిలాండ్ తో జరిగిన టి20 సీరీస్ తో జట్టులోకి తిరిగి ఎంట్రీ ఇచ్చిన ఇషాన్ కిషన్.. సీరీస్ ఆసాంతం పరుగుల వర్షం కురిపించాడు. ఓ సెంచరీ, రెండు అర్ధ శతకాలు కూడా ఉన్నాయి. ఇక ఇప్పుడు టి20 వరల్డ్ కప్ కు ముందు జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్ లో కూడా అలాగే రాణించాడు.

Also Read : వాళ్లను ఎందుకు అరెస్టు చేయలేదన్న జగన్..!

ఏకంగా ఏడు సిక్స్ లు బాదాడు ఇషాన్ కిషన్. జట్టులో చోటు కోసం విశ్వ ప్రయత్నాలు చేసి.. డొమెస్టిక్ క్రికెట్ లో దుమ్ము రేపిన ఇషాన్ కిషన్.. నేషనల్ టీంలో కూడా అదే నిలకడ ప్రదర్శిస్తున్నాడు. అతను ఇలాగే ఇతర జట్ల మీద కూడా మంచి ప్రదర్శనలు చేస్తే మాత్రం.. భవిష్యత్తులో భారత జట్టుకు బ్యాటింగ్ లో అస్త్రం దొరికినట్టే అంటూ క్రికెట్ అభిమానులు ఆకాశానికి ఎత్తేస్తున్నారు. అతను మూడవ స్థానంలో ఆడితే మాత్రం ఖచ్చితంగా టాప్ ఆర్డర్ తో పాటుగా మిడిల్ ఆర్డర్ కు కూడా కొండంత బలం అవుతాడని ఆశిస్తున్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

బ్రేకింగ్: కాకినాడ జిల్లాలో...

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి...

పార్టీ అధ్యక్షుడి కంటే...

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ,...

ఫిరాయింపులలో తెలంగాణా వరస్ట్...

భారత రాజకీయాల్లో ప్రజాప్రతినిధుల పార్టీ ఫిరాయింపులపై...

వరద ఉధృతిలో చిక్కుకున్నటీడీపీ...

శ్రీకాకుళం జిల్లాలో భారీ వర్షాల కారణంగా...

గుండె పోటు కాదు.....

చనిపోయింది గుండెపోటుతో.. ఈ విషయాన్ని వైద్యులు...

మజ్లీస్ నుంచి దానం...

తెలంగాణ రాజకీయాల్లో ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ...

పోల్స్