Sunday, June 21, 2026 12:43 PM
Sunday, June 21, 2026 12:43 PM

ఏం చేసుకుంటారో చేసుకోండి.. పాకిస్తాన్ కు ఐసీసీ షాకింగ్ రిప్లై

భారత సరిహద్దులలో పాకిస్తాన్ ఆర్మీ కవ్వింపు చర్యలకు పాల్పడుతుంటే మరో వైపు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అంతర్జాతీయంగా డ్రామాలు ఆడుతోంది. పదే పదే భారత క్రికెట్ కంట్రోల్ బోర్డును, ఐసీసీ ని బెదిరించే ప్రయత్నం చేస్తోంది. తాజాగా ఆసియా కప్ లో భారత ఆటగాళ్ళు షేక్ హ్యాండ్ ఇవ్వకపోవడంపై అసహనంగా ఉన్న పాకిస్తాన్.. ఐసీసీకి ఓ వార్నింగ్ ఇచ్చింది. మిగిలిన మ్యాచ్‌ల నుండి మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్‌ను తొలగించాలని డిమాండ్ చేసింది. అతను భారత్ కు అనుకూలంగా వ్యవహరించాడని ఆరోపించింది.

Also Read : క్వాంటం వ్యాలీ ముహుర్తం ఖరారు..!

అయితే పాకిస్తాన్ డిమాండ్‌ ను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ తిరస్కరించింది. భారత్-పాకిస్తాన్ మధ్య గ్రూప్ దశలో జరిగిన మ్యాచ్ లో కరచాలన వివాదంపై పాకిస్తాన్ డిమాండ్లను ఐసిసి అంగీకరించబోదని క్రికెట్ వర్గాలు తెలిపాయి. ఈ విషయంపై దర్యాప్తు చేసిన అనంతరం ఐసిసి ఈ నిర్ణయాన్ని పిసిబికి తెలియజేసింది. పిసిబి డైరెక్టర్‌ తో సహా కొంతమంది ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధికారులకు.. ఇద్దరు కెప్టెన్ల మధ్య కరచాలనం ఉండదని ముందుగానే తెలుసని ఐసీసీ పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు స్పష్టం చేసింది.

Also Read : ఓటీటీ రేట్ లో అఖండ తాండవం.. నెట్ ఫ్లిక్స్ భారీ ధర

సూర్యకుమార్ యాదవ్‌తో కరచాలనం చేయవద్దని పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ అఘాకు పైక్రాఫ్ట్ సూచించాడని పిసిబి తన లేఖలో పేర్కొంది. ఇది ప్రవర్తనా నియమావళికి వ్యతిరేకం అని అసహనం వ్యక్తం చేసింది. ఐసిసికి రాసిన లేఖలో, ఆండీ పైక్రాఫ్ట్‌ను తొలగించకపోతే మిగిలిన మ్యాచ్ లు ఆడేది లేదని పాక్ పేర్కొంది. ఇక భారత్ తో మ్యాచ్ తర్వాత పిసిబి తన అంతర్జాతీయ క్రికెట్ ఆపరేషన్స్ డైరెక్టర్ ఉస్మాన్ వాహ్లాను సస్పెండ్ చేసింది. షేక్ హ్యాండ్ విషయంలో అతను సమర్ధవంతంగా వ్యవహరించలేదు అని సస్పెండ్ చేయడం గమనార్హం.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

SBI వర్సెస్ తెలంగాణా...

రాయదుర్గం భూముల కేటాయింపు వ్యవహారంలో స్టేట్...

తిరుపతిలో కేఎఫ్‌సీ, డొమినోస్‌...

ప్రముఖ అంతర్జాతీయ ఫుడ్ బ్రాండ్ల ఆహార...

తిరుపతిలో వడ్డీ మాఫియా.....

తిరుపతి నగరంలో వడ్డీ వ్యాపారం పేరుతో...

సాయికృష్ణ కేసులో వైసీపీ...

విజయవాడ రౌడీ షీటర్‌ గాదె సాయికృష్ణ...

బ్రేకింగ్: అల్లు అర్జున్‌...

హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సంధ్య...

తెలంగాణాలో జనసేన తొలి...

గత కొన్నాళ్ళుగా తెలంగాణాలో పార్టీ బలోపేతం...

పోల్స్