Wednesday, May 6, 2026 10:26 PM
Wednesday, May 6, 2026 10:26 PM

విజయసాయి రెడ్డి సంగతేంటి..? అప్రూవర్ గా మారారా..?

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణంలో పలు ఆసక్తికర వ్యవహారాలు కనపడుతున్నాయి. ఈ కేసులో 12 మంది నిందితులను అదుపులోకి తీసుకున్న సిట్ అధికారులు వారిని పలు దఫాలుగా విచారించిన సంగతి తెలిసిందే. ఇక ఈ కేసులో ఏసీబీ కోర్ట్ ముందు చార్జ్ షీట్ దాఖలు చేసారు సిట్ అధికారులు. రెండు చార్జ్ షీట్ లను దాఖలు చేయగా.. వాటిలో మొత్తం 21 అభ్యంతరాలను ఏసీబీ న్యాయమూర్తి వ్యక్తం చేసారు. అందులో ప్రధానంగా 7 నుంచి 15 వరకు ఉన్న నిందితులను ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్నించింది.

Also Read : అరుణ ఫోన్ లో ఐపిఎస్, మాజీ మంత్రి వీడియోలు..?

అందులో వైసీపీ మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి ఉన్నారు. ఈ కేసులో విజయసాయి రెడ్డి సమాచారం ఆధారంగానే నిందితులను అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. రాజ్ కేసిరెడ్డి సహా పలువురు నిందితులకు సంబంధించిన సమాచారం ఆయనే అందించినట్టు వార్తలు రాగానే ఆయన అప్రూవర్ గా మారారు అనే ప్రచారం జరిగింది. కానీ ఈ కేసులో ఎవరినీ అప్రూవర్ గా సిట్ అధికారులు చార్జ్ షీట్ లో ప్రస్తావించలేదు. ఇదే సమయంలో విజయసాయి రెడ్డిని మాత్రం అదుపులోకి తీసుకోలేదు సిట్.

Also Read :జగన్ తిరుమలకు రావొద్దు.. వైసీపీలో అంతర్గత తిరుగుబాటు

కాబట్టి ఏసీబీ కోర్ట్ లో ఆయనకు సంబంధించి ఏ సమాచారం చెప్తారు అనేదే ఆసక్తిని కలిగించే అంశం. లిక్కర్ కేసుకు సంబంధించి విచారణ మొదలు కాగానే ఆయన రాజకీయాల నుంచి తప్పుకుని, రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా కూడా చేసారు. మరి విజయసాయి రెడ్డిని అప్రూవర్ గా ప్రస్తావిస్తారా లేదా అనేది ఇంకా క్లారిటీ లేదు. అటు కోర్ట్ 3500 కోట్లకు సంబంధించి టేబుల్ తో కూడిన సమాచారం అడిగింది. ఎవరి నుంచి ఎవరికి నిధులు వెళ్ళాయి అనే ప్రశ్న అడిగింది. అందులో విజయసాయి రెడ్డి ప్రస్తావన ఉండే అవకాశం ఉంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

లోకేష్ సంచలన నిర్ణయం,...

ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖలో భారీ మార్పులకు శ్రీకారం...

ముఖ్యమంత్రి కాన్వాయ్‌ పై...

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన...

ఏపీకి మరో దిగ్గజ...

ఏపీకి అంతర్జాతీయ పరిశ్రమలు క్యూ కడుతున్నాయి....

ఇన్ అండ్ అవుట్.....

తెలంగాణాలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి రెండున్నరేళ్లు...

ఏపీ ఐపీఎస్ ను...

ఆంధ్రప్రదేశ్‌ లో సంచలనం సృష్టించిన సినీ...

విజయ్ చుట్టూ ఏపీ..వైసీపీ...

తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ...

పోల్స్