Saturday, June 27, 2026 05:23 PM
Saturday, June 27, 2026 05:23 PM

మళ్ళీ మొదలైన ఇరాన్ – అమెరికా వార్..?

సుదీర్ఘ శాంతి ఒప్పందం దిశగా అడుగులు పడతాయని అంచనా వేస్తున్న తరుణంలో.. అగ్రరాజ్యం అమెరికా, ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ మధ్య శుక్రవారం రాత్రి మరోసారి యుద్ద మేఘాలు కమ్ముకున్నాయి. హార్ముజ్ జలసంధిలో ప్రయాణిస్తున్న ఒక అంతర్జాతీయ వాణిజ్య కార్గో నౌకపై ఇరాన్ డ్రోన్ దాడి చేసిందనే ఆరోపణల నేపథ్యంలో, అమెరికా సైన్యం ఇరాన్ భూభాగంలోని వ్యూహాత్మక సైనిక స్థావరాలే లక్ష్యంగా విమానాలతో భీకర దాడులు నిర్వహించింది. ఇరు దేశాల మధ్య స్విట్జర్లాండ్‌ లో కుదిరిన తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత అమెరికా నేరుగా ఇరాన్‌ పై జరిపిన మొదటి సైనిక దాడి ఇదే కావడం గమనార్హం.

Also Read : ఏపీ మ్యాప్ తో మార్కెట్లోకి జొన్నగిరి గోల్డ్..!

ఈ దాడులు జరగడానికి కొన్ని నిమిషాల ముందే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇరాన్ దుశ్చర్యకు అమెరికా ప్రతీకారం తీర్చుకుంటుందా అని విలేకరులు ప్రశ్నించగా.. “త్వరలోనే మీకే తెలుస్తుంది” అంటూ ట్రంప్ వ్యాఖ్యానించారు. ఆయన మాట్లాడిన కొద్దిసేపటికే అమెరికా సెంట్రల్ కమాండ్ రంగంలోకి దిగి మెరుపు దాడులను ప్రకటించింది. జూన్ 25న హార్ముజ్ జలసంధి గుండా వెళ్తున్న సింగపూర్ జెండాతో ఉన్న ‘ఎం/వీ ఎవర్ లవ్లీ’ అనే కార్గో షిప్‌ పై ఇరాన్ డ్రోన్ దాడి చేసిందని, దానికి సమాధానంగానే ఇరాన్ లోపల ఉన్న క్షిపణి నిల్వ కేంద్రాలు, డ్రోన్ స్థావరాలు, తీరప్రాంత రాడార్ కేంద్రాలపై తాము ఖచ్చితమైన లక్ష్యాలతో దాడులు చేశామని సెంటకామ్ స్పష్టం చేసింది.

Also Read : జగన్‌ను ఆదర్శంగా తీసుకున్న కేటీఆర్..!

అమెరికా దాడులపై ఇరాన్ సైనిక విభాగమైన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ కూడా అత్యంత వేగంగా స్పందించింది. వాషింగ్టన్ చేసిన ఈ దాడులను తాము ఊరికే వదిలిపెట్టబోమని హెచ్చరిస్తూ, ఆ ప్రాంతంలో ఉన్న పలు అమెరికా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ ఎదురుదాడులు ప్రారంభించింది. ఈ పరిణామాలపై అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ ఎక్స్ వేదికగా ఘాటు వ్యాఖ్యలు చేసారు. “ఇరాన్ కాల్పుల విరమణ ఒప్పందంపై సంతకం చేసింది, మేము దాన్ని గౌరవించాము. వారికి ఏవైనా అభ్యంతరాలు ఉంటే ఫోన్ చేసి మాట్లాడాలి, అంతేకానీ హింసకు దిగితే హింసతోనే సమాధానం చెబుతాం” అంటూ గట్టి వార్నింగ్ ఇచ్చారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

తిరుపతిలో భూమన దారుణాలు.....

తిరుపతి నగరంలో వైసీపీ సీనియర్ నేత,...

ఏపీ పోలీసులపై మానవ...

ఏపీలో సంచలనం సృష్టించిన యువకుడు సాయికృష్ణ...

తెలంగాణా సర్కార్ కు...

తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగరంలో ఒక...

ఏపీ మ్యాప్ తో...

ఏపీలోని కర్నూలు జిల్లా తుగ్గలి మండలంలో...

చివరి రోజుల్లో శ్రీలక్ష్మికి...

ఎట్టికేలకు సీనియర్ మహిళా ఐఏఎస్ అధికారిణి...

ఆ ఇద్దరు హెడ్...

విజయవాడలో పెను సంచలనం సృష్టించిన గాదె...

పోల్స్