Saturday, July 11, 2026 12:06 AM
Saturday, July 11, 2026 12:06 AM

ఐపీఎల్‌ లో బిగ్ బాంబ్.. ముంబై ఇండియన్స్‌కు హార్దిక్ పాండ్యా గుడ్ బై..!

ఐపీఎల్ 2026 సీజన్ లీగ్ దశ ముగిసిన వెంటనే క్రికెట్ ప్రపంచంలో ఓ వార్త ఆసక్తిని రేపుతోంది. గత రెండు సీజన్ల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న.. ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఆ జట్టును వీడి, చెన్నై సూపర్ కింగ్స్ గూటికి చేరబోతున్నాడనే ప్రచారం జోరందుకుంది. దీనికంతటికీ హార్దిక్ పాండ్యా తాజాగా తన ఇన్స్టాగ్రామ్‌ లో పెట్టిన ఒక పోస్టే కారణం. ముంబై ఘోర పరాజయాల నేపథ్యంలో వచ్చిన ఈ పోస్ట్ ఐపీఎల్ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది.

Also Read : క్రికెట్‌లో సమూల మార్పులు.. ఐసీసీ కీలక నిర్ణయాలు..!

ముంబై ఇండియన్స్ టోర్నమెంట్ నుంచి వైదోలిగిన కొద్ది రోజుల్లోనే హార్దిక్ పాండ్యా తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో 07:07 అని టైం చూపిస్తూ ఒక పోస్ట్ పెట్టాడు. ఈ నంబర్ చూసిన వెంటనే నెటిజన్లు, క్రికెట్ విశ్లేషకులు దీన్ని మహేంద్ర సింగ్ ధోనీ ఐకానిక్ జెర్సీ నంబర్ 7 తో ముడిపెడుతున్నారు. హార్దిక్ కెరీర్‌ పై ధోనీ ప్రభావం ఎంత ఉందో అతను గతంలోనే చాలాసార్లు చెప్పాడు. దీంతో, ధోనీ ఐపీఎల్ కి పూర్తిస్థాయిలో వీడ్కోలు పలికిన తర్వాత.. సీఎస్కే ఫ్రాంచైజీ హార్దిక్ పాండ్యాను జట్టులోకి తీసుకుని, భవిష్యత్ కెప్టెన్‌గా పగ్గాలు అప్పగించే ప్లాన్ చేస్తోందంటూ సోషల్ మీడియాలో పసుపు జెర్సీలో ఉన్న హార్దిక్ ఎడిటెడ్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

Also Read : వారణాసి ఇంత ఫాస్ట్ గా కంప్లీట్ చేస్తున్నాడా..?

వాస్తవానికి ఐపీఎల్ 2026 లీగ్ దశలోనే ముంబై ఇండియన్స్ ప్రదర్శనపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఆదివారం వాంఖెడే స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్ చేతిలో జరిగిన మ్యాచ్‌ లో ఓటమితో ముంబై ఐపీఎల్ 2026 ప్రస్థానం అధికారికంగా ముగిసింది. ఈ సీజన్‌ లో ఆడిన 14 లీగ్ మ్యాచ్‌ లలో ముంబై కేవలం 4 మ్యాచుల్లో మాత్రమే గెలిచి, 8 పాయింట్లతో పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో నిలిచింది. ముంబై ఇండియన్స్ గత ఐదు సీజన్ల ట్రాక్ రికార్డ్ చూస్తే జట్టు ప్రదర్శన తీవ్ర నిరాశాజనకంగా సాగుతోంది. కేవలం రెండు సార్లు మాత్రమే ప్లే ఆఫ్స్ చేరిన ముంబై, మూడు సార్లు పట్టికలో అడుగుభాగాన నిలిచింది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

కఫ్ సిరప్‌లపై కేంద్రం...

భారత్ లో ఆల్కహాల్ కలిగిన సిరప్‌లు,...

కొరియా స్టాక్ మార్కెట్‌ను...

ఆంధ్రప్రదేశ్ ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి...

అంతా ఓపెన్.. రావణ్‌కు...

వైసీపీ ముసుగు తొలిగిపోయింది. యూట్యూబర్ ప్రశ్న...

దూకుడు పెంచిన కవితక్క.....

తెలంగాణలో రాజకీయాలు హాట్ హాట్‌గా మారాయి....

మాట నిలబెట్టుకున్న చంద్రబాబు.....

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రజా...

హెచ్-1బీ వీసా, గ్రీన్...

అమెరికాలో ఉద్యోగం చేయాలని ఆశపడే హెచ్-1బీ...

పోల్స్