Tuesday, May 26, 2026 06:30 PM
Tuesday, May 26, 2026 06:30 PM

తెలుగు తమ్ముళ్లకు పవన్ మాస్ వార్నింగ్..!

రాష్ట్రంలో 5 కోట్ల మంది ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడం కోసం కూటమి కట్టాం. మనమేదో చేస్తామని, రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని కదా ప్రజలు నమ్మింది. అలాంటిది కూటమిలో ఉన్న చిన్న చిన్న సమస్యలకు గొడవ పడతామా? 5 కోట్ల మంది ప్రజల కోసం మనసా, వాచా, కర్మణా మద్దతిస్తా. జనసేన కార్యకర్తలు ప్రస్తావిస్తున్న ఇబ్బందులు తారాస్థాయిలో లేవు. ఒక వ్యక్తి చేసిన తప్పును ఆ వ్యవస్థపై పెట్టకూడదు. ఆ ఇబ్బందులు శృతిమించిపోతే, ఎదిరించక తప్పని పరిస్థితి వస్తే ఊరుకోం’ అని ఉప ముఖ్యమంత్రి, జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ చేసిన వ్యాఖ్యలు.. ఇప్పుడు పొలిటికల్ సర్కిల్‍‌లో హాట్ టాపిక్‌గా మారాయి. జరిగింది జనసేన పార్టీ సమావేశం.. కానీ వార్నింగ్ ఇచ్చింది మాత్రం అందరికీ.. అన్నట్లుగా పవన్ వ్యాఖ్యలున్నాయనే మాట బాగా వినిపిస్తోంది.

Also Read : వంగ మాస్టర్ ప్లాన్.. కాస్టింగ్‌ తోనే బాక్సాఫీస్‌ షేక్..!

‘జనసేన నాయకులు మెత్తగా ఉండొద్దు. నేను మౌనంగా ఉన్నానంటే గట్టి పడుతున్నానని, సరైన సమయం కోసం చూస్తున్నానని అర్థం. ఎప్పుడైనా గొడవపడితే మనం ఎదిగేలా ఉండాలి. మనం గొడవపడే అంశం సరైనదే అని అందరూ మెచ్చుకోవాలి. మంగళగిరిలో మనం కలగజేసుకోవడం లేదు.. పిఠాపురంలో వాళ్లు ఎలా కలగజేసుకుంటారని మీరు అడగొచ్చు. దానికే గొడవ పెట్టేసుకుంటామా?..” అంటూ పరోక్షంగా వర్మ వ్యవహారాన్ని పవన్ ప్రస్తావించారు. ఫ్లెక్సీలో చంద్రబాబు ఫోటో కోసం వర్మ గొడవ పడుతుంటే.. మంగళగిరిలో పవన్ ఫోటో ఉండాలని జన సైనికులు అడగటం లేదనేది జనసేనాని వ్యాఖ్య. అదేే సమయంలో మనమంతా కలిసి బలంగా ఉంటే కూటమిలో మన బలం పెరుగుతుంది. మన మాటకు విలువ ఉంటుంది. మనం అనుమతిస్తేనే అవమానాలు జరుగుతాయి. జనసేన నాయకులంతా ఐక్యంగా ఉంటే ఆ పరిస్థితి ఎందుకొస్తుంది? అంటూ పవన్ నిలదీశారు.

ఇప్పటి వరకు జనసేన పార్టీ నేతలంతా కలిసి లేరని పరోక్షంగా విమర్శలు చేశారు పవన్ కల్యాణ్. ఇందుకు వైసీపీ ప్రభుత్వ ఐదేళ్ల కాలాన్ని ఉదాహరించారు. 2019-24 మధ్య ఎలా కొట్లాడారు? ఎవర్రా మమ్మల్ని అడ్డుకునేది అంటూ పోరాడలేదా? గెలవడం కోసం కాదు.. ఆత్మగౌరవం కోసం అని పోరాడలేదా? ఆ తెగువ ఏమైందంటూ నిలదీశారు. కూటమి సర్కార్‌లో జనసేన నాయకులకు పదవులు రావటం లేదనే విమర్శలకు కూడా పవన్ చెక్ పెట్టారు. వేల మంది జనసేన నాయకులకు పదవులు వస్తే ఇలా చప్పబడిపోయారేంటి? చప్పబడిపోయిన వాళ్లెవరూ జనసేనకు అక్కర్లేదు. నాకు ఇంకా పౌరుషం పోలేదు.. కొట్లాడే గుణం పోలేదు.. అంటూ వార్నింగ ఇచ్చారు. అలాగే వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలకు బలంగా సిద్ధమవ్వండి. ఏయే స్థానాల్లో మనం గెలిచే అవకాశం ఉందో పార్టీ నాయకులకు చెప్పండి’ అని నాయకులను ఎన్నికలకు సమాయత్తం చేశారు.

Also Read : మహిళా పోలీసు తీరు సిగ్గు సిగ్గు..!

పార్టీ నేతలను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు పవన్. ఇప్పటి వరకు తనను జనసేనాని అన్నారని.. కాబట్టి సేనాని చెప్పిన మాటను సైన్యం వినాల్సిందే అంటూ అల్టిమేటం జారీ చేశారు. “పార్టీ పగ్గాలు పూర్థిస్థాయిలో స్వీకరిస్తున్నా. ఇక నుంచి నేనే కమాండర్‌ను. నా మాట వినాల్సిందే. పార్టీని ఏకతాటిపై నడుపుదాం. ఎవరికైనా ఏకాభిప్రాయానికి ఇబ్బంది ఉంటే పార్టీలో నుంచి వెళ్లిపోవచ్చు. క్రమశిక్షణ తప్పితే నేనే పార్టీ నుంచి తప్పిస్తా..” అంటూ పవన్ చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీ నేతల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తున్నాయి. ఆరోపణలు వచ్చాయనే ఏకైక కారణంతోనే ప్రకాశం జిల్లా కమిటీని పూర్తిగా రద్దు చేసినట్లు పవన్ స్వయంగా ప్రకటించారు. దీంతో అక్కడ బాలినేని శ్రీనివాస రెడ్డి, జిల్లా అధ్యక్షుడు షేక్ రియాజ్ మధ్య నడుస్తున్న ఆధిపత్య పోరుకు పవన్ చెక్ పెట్టినట్లు అయ్యింది.

కూటమితో కలిసే ఉంటామని ఫుల్ క్లారిటీ ఇచ్చిన పవన్.. భవిష్యత్తులో మాత్రం.. తమ బలం మరింత పెంచుకుంటామని తేల్చి చెప్పేశారు. తనకు పదవులు అవసరం లేదంటూనే.. పార్టీ కోసం కష్టపడిన నేతలు, కార్యకర్తలకు సముచిత స్థానం వచ్చేలా చేస్తామన్నారు. అలాగే వర్మ వ్యవహారాన్ని పరోక్షంగా ప్రస్తావించిన పవన్.. మరోసారి ఇలా ఏ నియోజకవర్గంలో వ్యవహరించినా సరే.. తమ పార్టీ నేతలు కూడా ఘాటుగా స్పందిస్తారంటూ తెలుగు తమ్ముళ్లకు మాస్ వార్నింగ్ ఇచ్చినట్లుగా ఉందని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

తాడేపల్లి నుంచి జగన్...

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి కీలక పరిణామాలకు...

టీపీసీసీ గౌడ్‌కు పొగ.....

ఏం జరిగిందో తెలియదు. ఏం జరుగుతుందో...

రాప్తాడులో హైటెన్షన్.. తోపుదుర్తి...

అనంతపురం జిల్లా రాజకీయాల్లో కీలక పరిణామం...

దుర్గేశ్ పై పవన్...

తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో డిప్యూటీ...

కావలి ఎమ్మెల్యేలో మార్పు...

నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలో తాజాగా...

మహిళా పోలీసు తీరు...

జరిగింది ఘోరం.. అత్యంత నీచమైన చర్య.....

పోల్స్