Wednesday, June 24, 2026 11:47 PM
Wednesday, June 24, 2026 11:47 PM

దేశంలో మరో వైరస్ రీ ఎంట్రీ.. ఫ్రూట్స్ తింటే జాగ్రత్త..!

ప్రపంచాన్ని ఏదోక వైరస్ భయపెడుతూనే ఉంది. కరోనా, మంకి పాక్స్, నిఫా, ఎబోలా వైరస్ ఇలా ఏదొకటి ప్రపంచాన్ని కంగారు పెడుతూనే ఉన్నాయి. ప్రభుత్వాలకు ఈ వైరస్ లు చెమటలు పట్టిస్తున్నాయి. తాజాగా మరో వైరస్ మన దేశాన్ని కలవరపెడుతోంది. కేరళలోని రెండు జిల్లాల్లో జూనోటిక్ వ్యాధికి సంబంధించి రెండు పాజిటివ్ కేసులు గుర్తించారు. దీనినే నిపా వైరస్ అని పిలుస్తారు. ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ నిపా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు తీవ్రంగా కష్టపడుతోంది. ప్రజలకు కూడా ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది.

Also Read : భారత్ వ్యవసాయంపై ట్రంప్ దెబ్బ..!

కోజికోడ్, మలప్పురం మరియు పాలక్కాడ్ జిల్లాల్లో హెచ్చరికలు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ రెండు కేసుల కాంటాక్ట్ లిస్ట్‌లో 400 మందికి పైగా ఉన్నారని.. పూణేలో పరిక్షలు చేసిన తర్వాత ఈ రెండు కేసులను గుర్తించామని ప్రభుత్వం తెలిపింది. పరిస్థితిని అదుపు చేయడానికి, కనివ్ 108 ఫ్లీట్‌తో సహా అంబులెన్స్ లను సిద్ధంగా ఉంచారు. ప్రభావిత ప్రాంతాల్లో జ్వరంపై నిఘా పెట్టారు. ఈ వైరస్ ప్రాణాంతకమనే ఆందోళనల నేపధ్యంలో.. వైరస్ బయటపడిన ప్రాంతాల్లో ప్రజలకు అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తోంది.

Also Read : ఐటీ హబ్‌గా వైజాగ్‌… లోకేష్‌ కృషికి కంపెనీలు ఫిదా…!!

నిపా వైరస్ అనేది అత్యంత ప్రాణాంతకమైన జూనోటిక్ వైరస్ గా చెప్తారు. ఇది జంతువుల నుంచి మానవులకు వ్యాపిస్తుంది. మెదడు వాపు, శ్వాసకోశ సమస్యలతో పాటుగా మరణాలకు కూడా కారణంగా మారుతోంది. ఈ ప్రాణాంతక వైరస్‌ను మొట్టమొదట 1999లో మలేషియాలో గుర్తించారు. కేరళలో, 2018లో ఈ వ్యాధి 18 మంది ప్రాణాలు తీసింది. నిపా వైరస్ యొక్క ప్రారంభ లక్షణాలు జ్వరం, తలనొప్పి, కండరాల నొప్పి, తలతిరగడం వంటివి. గబ్బిలాలు తిన్న పండ్లను తినడం ద్వారా ఈ వ్యాధి సంక్రమించే అవకాశం ఉంది. ఈ వైరస్ కు ప్రస్తుతం వ్యాక్సిన్ అందుబాటులో లేదు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

సీఐ నాగరాజు రిమాండ్...

విజయవాడలో తీవ్ర సంచలనం సృష్టించిన గాదె...

నేనే చేసానని గ్యారెంటీ...

ఆంధ్రప్రదేశ్‌ లో తీవ్ర సంచలనం సృష్టించిన...

రేవంత్ సర్కార్ దెబ్బకు...

గత కొన్ని రోజులుగా తెలంగాణ ప్రభుత్వానికి,...

కాపులకు జగన్ నమ్మకద్రోహం.....

ముద్రగడ పద్మనాభం రాజకీయ జీవితంలో ఎన్నో...

సాయికృష్ణ అదృశ్యం కేసులో...

ఏపీలో సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ...

కూటమి సర్కార్ ప్రోగ్రెస్...

ప్రజా ప్రభుత్వం సాధించిన విజయాలు ప్రజల్లోకి...

పోల్స్