Saturday, August 15, 2026 04:11 PM
Saturday, August 15, 2026 04:11 PM

బ్రేకింగ్: భారత్ – పాక్ మ్యాచ్ కష్టమేనా..?

టి20 వరల్డ్ కప్ లో అత్యంత ఖరీదైన మ్యాచ్ లలో ఒకటైన ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ మరోసారి సందిగ్దంలో పడింది. టోర్నీ షెడ్యూల్ ప్రకటించిన నాటి నుంచి కూడా దాయాదుల పోరు సంచలనమే అయింది. క్రికెట్ కంటే వెలుపల జరిగిన వ్యవహారాలే ఆసక్తిని పెంచాయనే మాట వాస్తవం. బంగ్లాదేశ్ పై ప్రేమతో భారత్ తో మ్యాచ్ ఆడేది లేదని పాక్ ప్రకటించింది. చివరకు ఐసీసీ రంగంలోకి దిగడంతో సినిమా మారిపోయింది. మ్యాచ్ ఆడేందుకు పాక్ జట్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

Also Read : ఏపీ బడ్జెట్ విశేషాలు.. వాటికే ప్రాధాన్యత..!

అయితే ఇప్పుడు అభిమానులను మరో టెన్షన్ వెంటాడుతోంది. ఫిబ్రవరి 15 ఆదివారం కొలంబోలోని ఆర్ ప్రేమదాస స్టేడియంలో జరిగే భారత్-పాకిస్తాన్ గ్రూప్ ఎ మ్యాచ్‌ కు వర్షం ముప్పు ఉందని శ్రీలంక వాతావరణ శాఖ తెలిపింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని హెచ్చరించింది. టోర్నీలో అతిపెద్ద మ్యాచ్ కు ఇప్పుడు వరుణుడు ఆటంకం కలిగిస్తే.. రిజర్వే డే లో మ్యాచ్ నిర్వహించాలని ఫ్యాన్స్ కోరుతున్నారు. వాష్ అవుట్ అయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని వాతావరణ శాఖ చెప్తోంది.

Also Read : అధినేతపై గుర్రుగా క్యాడర్.. అసలున్నాడా..!

అక్యూవెదర్ ప్రకారం, మ్యాచ్ ప్రారంభానికి రెండు గంటల ముందు సాయంత్రం 5 గంటల ప్రాంతంలో జల్లులు పడే అవకాశం ఉంది. అయితే, కొలంబోలో ఆట సమయంలో వర్షం పడే అవకాశం ఎంత అనేది స్పష్టత లేదు. ఆట సమయంలో ఆకాశం మేఘావృతమై ఉంటుంది. ఇక ఈ మ్యాచ్ కు ఇప్పటికే టికెట్ లు ఫుల్ కాగా.. ఇరు జట్ల ఆటగాళ్ళు ముమ్మరంగా ప్రాక్టీస్ చేస్తున్నారు. ప్రేమదాస స్టేడియంలో పటిష్ట భద్రతను శ్రీలంక ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

బంగ్లాదేశ్‌ ను భారత్...

భారతదేశం నుండి అదనంగా డీజిల్ సరఫరా...

తొలిరోజే 31 విమానాలు.....

ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల స్వప్నం సాకారం...

జోగి సీటు చిరిగినట్లేనా.....

జోగి రమేష్.. ఈ పేరు పెద్దగా...

మళ్లీ కొత్త పాట...

ఏరు దాటే వరకు ఏటి మల్లన్న.....

ఏపీలో మద్యం ధరలు...

ఆంధ్రప్రదేశ్‌లో నూతన రిటైల్ ఎక్సైజ్ విధానం...

ఎన్టీఆర్ అభిమాని కొడుక్కి...

తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధ భక్తి...

పోల్స్