Thursday, November 26, 2026 08:56 PM
Thursday, November 26, 2026 08:56 PM

తిరుమల శ్రీవారికి కనీవినీ ఎరుగని కానుక..ఎవరీ వర్ధమాన్ జైన్..?

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారికి ఒక భక్తుడు కనీవినీ ఎరుగని రీతిలో భారీ విరాళాన్ని సమర్పించి చరిత్ర సృష్టించారు. చెన్నైకి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త వర్ధమాన్ జైన్ సుమారు రూ.160 కోట్ల నుంచి రూ.200 కోట్ల విలువైన 121 కిలోల బంగారు ఆభరణాలను స్వామివారికి కానుకగా అందజేశారు. గురువారం తిరుమల ఆలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో, ఆయన చేతుల మీదుగా ఈ విలువైన స్వర్ణాభరణాలను టీటీడీ అధికారులకు అప్పగించారు.

Also Read : చెక్ పెడితేనే మేలు.. లేదంటే అంతే సంగతులు..!

టీటీడీ చరిత్రలోనే ఒకే భక్తుడు ఇంత పెద్ద మొత్తంలో బంగారు ఆభరణాలను సమర్పించడం ఇదే తొలిసారి కావడం విశేషం. స్వామివారి పాదాల నుంచి శిరస్సు వరకు అలంకరించే విధంగా సుమారు 47 రకాల ఆభరణాలను ప్రత్యేకంగా తయారు చేయించి వర్ధమాన్ జైన్ సమర్పించారు. ఇందులో కిరీటం, పాదుకలు, శంఖుచక్రాలు, వడ్డాణం, కటి-వరద హస్తాలు, పీతాంబరం, సాలగ్రామ హారాలతో పాటు విలువైన వజ్రాలు పొదిగిన ఆభరణాలు ఉన్నాయి. స్వామివారి నిత్య కైంకర్యాలకు, విశేష ఉత్సవాలకు ఉపయోగపడేలా మొత్తం తొమ్మిది సెట్లుగా వీటిని అత్యంత సుందరంగా తీర్చిదిద్దారు.

ఇంతటి భారీ విరాళం అందించిన వర్ధమాన్ జైన్ నేపథ్యం కూడా ఎంతో ఆసక్తికరంగా ఉంది. హెల్త్‌కేర్ టెక్నాలజీ మరియు బీపీఓ రంగాల్లో విశేష అనుభవం ఉన్న ఆయన, ప్రముఖ సంస్థ యాక్సెస్ హెల్త్‌కేర్ వ్యవస్థాపకుడిగా, వైస్ ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. గతంలో ఆయన డెల్ సర్వీసెస్ బీపీఓ మేనేజింగ్ డైరెక్టర్‌గా పనిచేయడమే కాకుండా, విజన్ హెల్త్‌సోర్స్ సహ వ్యవస్థాపకుడిగా, ఆసియా ఇంజనీరింగ్ సంస్థకు సహ యజమానిగా, డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. హెల్త్‌కేర్ రంగంలో రోబోటిక్ ప్రాసెస్ ఆటోమేషన్ టెక్నాలజీని అభివృద్ధి చేయడంలో కీలక పాత్ర పోషించిన ఆయన పేరిట ఇమేజ్ ప్రాసెసింగ్, మెడికల్ కోడింగ్ రంగాల్లో పేటెంట్లు కూడా ఉన్నాయి.

Also Read : మేక్ ఇన్ ఇండియాపై ట్రంప్ సర్కార్ గురి..?

చెన్నైలోని ప్రఖ్యాత లయోలా కళాశాలలో స్టాటిస్టిక్స్ విభాగంలో విద్యాభ్యాసం పూర్తి చేసిన వర్ధమాన్ జైన్, అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ నుంచి కంప్యూటర్ సైన్స్‌లో మాస్టర్స్ పట్టా పొందారు. వ్యాపార రంగంలో ఉన్నత శిఖరాలను అధిరోహించిన ఆయన, సామాజిక మరియు ఆధ్యాత్మిక సేవల్లోనూ ఎప్పుడూ ముందుంటారు. చెన్నైలోని కంచి కామకోటి చైల్డ్స్ ట్రస్ట్ హాస్పిటల్ మేనేజింగ్ ట్రస్టీగా సేవలందిస్తూనే, పేద యువత నైపుణ్యాభివృద్ధికి ‘ఆవిష్కార్’ సంస్థను ఏర్పాటు చేశారు. అలాగే ‘శ్రీ సరితా జైన్ ఫౌండేషన్’ ద్వారా పేదలకు ఉచిత విద్య, వైద్య సేవలను అందిస్తూ తన దాతృత్వాన్ని చాటుకుంటున్నారు.

సంబంధిత కథనాలు

- Advertisement -spot_img

తాజా కథనాలు

పవన్ మాస్టర్ స్ట్రోక్.....

గ్రామీణ రాజకీయాల్లో జనసేన తనదైన ముద్ర...

సొంత జిల్లాలో జగన్...

కడప జిల్లా రాజకీయాల్లో కీలక పరిణామం...

ప్రకాశం జిల్లాలో సంచలనం.....

ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న గ్రామ పంచాయతీ ఎన్నికలు...

జగన్ కంటే ముందే...

ఏపీ రాజకీయాల్లో మరో కీలక పరిణామం...

భారీగా పెరిగిన ఏపీ...

ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ సరికొత్త మైలురాయిని...

జగన్‌పై హరీష్‌రావుకు కోపం...

పల్నాడు వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు ఇప్పుడు...

పోల్స్