Thursday, November 26, 2026 08:34 PM
Thursday, November 26, 2026 08:34 PM

భారత మార్కెట్లోకి తొలి ఫ్లెక్స్-ఫ్యూయల్ హైబ్రిడ్ కారు..!

ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం టయోటా తన పాపులర్ ఎంపీవీ ‘ఇన్నోవా హైక్రాస్ ఫేస్‌లిఫ్ట్’ మోడల్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. భారత మార్కెట్లోకి వచ్చిన మొట్టమొదటి ఫ్లెక్స్-ఫ్యూయల్ స్ట్రాంగ్ హైబ్రిడ్ కారు ఇదే కావడం విశేషం. పెట్రోల్ వేరియంట్ ధర రూ.19.59 లక్షల నుంచి ప్రారంభమవుతుండగా, స్ట్రాంగ్ హైబ్రిడ్ వేరియంట్ల ధరలు రూ.19.99 లక్షల నుంచి రూ.31.99 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉన్నాయి. ఈ కారుకు సంబంధించిన బుకింగ్స్ నవంబర్ 26 నుంచే ప్రారంభమయ్యాయి.

Also Read : పవన్ మాస్టర్ స్ట్రోక్.. వైసీపీకి గడ్డు పరిస్థితులేనా..?

ఇంజిన్ సామర్థ్యం విషయానికి వస్తే, ఇన్నోవా హైక్రాస్ ఫేస్‌లిఫ్ట్ పెట్రోల్ మరియు హైబ్రిడ్ రెండు వెర్షన్లలోనూ 2.0-లీటర్, ఫోర్-సిలిండర్ ఇంజిన్‌తో వస్తోంది. పెట్రోల్ GX వేరియంట్ 170 bhp శక్తిని, 206 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇక ఐదో తరం స్ట్రాంగ్-హైబ్రిడ్ సిస్టమ్ 197 bhp శక్తిని అందిస్తుంది. ఇది E20 నుంచి E85 ఇథనాల్-పెట్రోల్ మిశ్రమ ఇంధనంతో నడిచేలా రూపొందించబడింది. వేరియంట్ల వారీగా ఫీచర్లను పరిశీలిస్తే, ఎంట్రీ-లెవల్ హైబ్రిడ్ వేరియంట్ G-SLF ధర రూ.19.99 లక్షలుగా ఉంది. కమర్షియల్ మరియు ఫ్లీట్ అవసరాల కోసం ఉద్దేశించిన ఈ మోడల్‌లో గరిష్ఠ వేగం గంటకు 80 కిలోమీటర్లకు పరిమితం చేయబడింది.

Also Read : వైసీపీలో ప్రక్షాళన కలవరం..!

ఆ తర్వాత GX హైబ్రిడ్ వేరియంట్ (రూ.23.99 లక్షల నుంచి రూ.24.04 లక్షలు) లో స్మార్ట్ ఎంట్రీ, రివర్స్ పార్కింగ్ కెమెరా, టెలిమాటిక్స్ వంటి అదనపు ఫీచర్లతో పాటు స్పీడ్ లిమిటర్ తొలగించబడింది. మరింత లగ్జరీ కోరుకునే వారి కోసం VX వేరియంట్ (రూ.28.79 లక్షల నుంచి రూ.28.84 లక్షలు) లో పనోరమిక్ సన్‌రూఫ్, 31.2 సెం.మీ ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే, క్రూయిజ్ కంట్రోల్, ప్యాడిల్ షిఫ్టర్స్, 360-డిగ్రీ కెమెరా వంటి ప్రీమియం ఫీచర్లు ఉన్నాయి. ఇక టాప్-ఎండ్ వేరియంట్ ZX ధర రూ.31.99 లక్షలు కాగా, ఇందులో పూర్తిస్థాయి అడాస్ భద్రతా ఫీచర్లు లభిస్తాయి. అన్ని వేరియంట్లలోనూ ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, వెహికల్ స్టెబిలిటీ కంట్రోల్, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ వంటి భద్రతా ప్రమాణాలను టయోటా స్టాండర్డ్‌గా అందిస్తోంది.

సంబంధిత కథనాలు

- Advertisement -spot_img

తాజా కథనాలు

పవన్ మాస్టర్ స్ట్రోక్.....

గ్రామీణ రాజకీయాల్లో జనసేన తనదైన ముద్ర...

సొంత జిల్లాలో జగన్...

కడప జిల్లా రాజకీయాల్లో కీలక పరిణామం...

ప్రకాశం జిల్లాలో సంచలనం.....

ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న గ్రామ పంచాయతీ ఎన్నికలు...

తిరుమల శ్రీవారికి కనీవినీ...

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర...

జగన్ కంటే ముందే...

ఏపీ రాజకీయాల్లో మరో కీలక పరిణామం...

భారీగా పెరిగిన ఏపీ...

ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ సరికొత్త మైలురాయిని...

పోల్స్