Wednesday, November 25, 2026 05:47 PM
Wednesday, November 25, 2026 05:47 PM

భారీగా పెరిగిన ఏపీ ఆదాయం.. !

ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ సరికొత్త మైలురాయిని అందుకుంది. ఆదాయ వనరుల సమీకరణలో ఏపీ ప్రభుత్వం నెక్స్ట్ లెవల్ పర్ఫార్మెన్స్ కనబరిచింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ 1 నుంచి నవంబర్ 23, 2026 వరకు రాష్ట్ర ఖజానాకు మొత్తం రూ. 74,342 కోట్ల ఆదాయం వచ్చి చేరింది. గత ఏడాది ఇదే సమయంతో పోలిస్తే ఏకంగా 18.7 శాతం భారీ జంప్ కావడం విశేషం. స్మార్ట్ ఫైనాన్షియల్ ప్లానింగ్, పన్ను వసూళ్లలో పారదర్శకత వల్లే ఈ రికార్డు స్థాయి వృద్ధి సాధ్యమైందని అధికార వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

Also Read : జగన్‌పై హరీష్‌రావుకు కోపం ఎందుకు..?

ఈ ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించుకున్న రూ. 1,27,506 కోట్ల యాన్యువల్ రెవెన్యూ టార్గెట్‌లో ఇప్పటికే 58 శాతం పూర్తయింది. ఫైనాన్షియల్ ఇయర్ ముగియడానికి ఇంకా 4 నెలలకు పైగా సమయం ఉండగానే సగానికి పైగా టార్గెట్‌ను హిట్ చేయడం రాష్ట్ర ఎకానమీకి పెద్ద బూస్ట్‌గా మారింది. ఇదే జోరు కొనసాగితే వార్షిక లక్ష్యాన్ని సులభంగా క్రాస్ చేసే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

వసూలైన మొత్తం ఆదాయంలో ట్యాక్స్ రెవెన్యూ రూ. 63,796 కోట్లుగా నమోదైంది. గత ఏడాదితో పోలిస్తే పన్ను ఆదాయంలో 18.8 శాతం గ్రోత్ కనిపించింది. మరోవైపు, నాన్-ట్యాక్స్ రెవెన్యూ కూడా అనూహ్యంగా పుంజుకుని రూ. 2,091 కోట్లకు చేరుకుంది. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే పన్నేతర ఆదాయంలో ఏకంగా 31.3 శాతం పెరుగుదల నమోదవడం విశేషం.

Also Read : కోర్టు విచారణల రికార్డింగ్ పై ఏపీ హైకోర్టు సంచలన ఉత్తర్వులు..!

రెవెన్యూ లీకేజీలకు పూర్తిస్థాయిలో చెక్ పెట్టేందుకు ఏపీ ప్రభుత్వం ఇప్పుడు టెక్ టచ్ ఇస్తోంది. రాష్ట్రంలోని 123 అర్బన్ లోకల్ బాడీస్ పరిధిలో ప్రాపర్టీ ట్యాక్స్ కలెక్షన్ కోసం కొత్తగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత సిస్టమ్స్‌ను రంగంలోకి దించుతోంది. ఈ స్మార్ట్ టెక్నాలజీ సాయంతో ట్యాక్స్ ఎగవేతదారులను ట్రాక్ చేయడంతో పాటు, రికార్డుల్లో లేని ఆస్తులను కూడా లెక్కలోకి తీసుకురానున్నారు. తద్వారా స్థానిక సంస్థల ఆదాయం మరింత పెరిగి, అర్బన్ డెవలప్‌మెంట్ పనులకు ఫండ్స్ కొరత లేకుండా ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది. మరోవైపు, ఏపీ ఆదాయం ఈ స్థాయిలో పెరగడంపై ఇతర రాష్ట్రాలు షాక్‌ అవుతున్నాయి. చంద్రబాబు నేతృత్వంలోని కూటమి సర్కార్‌ అనుసరిస్తున్న విధానాలపై దృష్టి పెట్టాలని అధికారులని సూచిస్తున్నాయి..

సంబంధిత కథనాలు

- Advertisement -spot_img

తాజా కథనాలు

జగన్‌పై హరీష్‌రావుకు కోపం...

పల్నాడు వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు ఇప్పుడు...

సంచలన చట్టానికి సిద్ధమైన...

ఆంధ్రప్రదేశ్ శాసనసభ శీతాకాల సమావేశాలకు కూటమి...

10 లక్షల మందితో...

‘కార్యకర్తే అధినేత’ అనే నినాదాన్ని ఆచరణలోకి...

కోర్టు విచారణల రికార్డింగ్...

న్యాయస్థానాల విచారణ ప్రక్రియకు సంబంధించి ఏపీ...

టీడీపీ ఎమ్మెల్యేలకు కొత్త...

ఏపీలో జరుగుతున్న గ్రామ పంచాయతీ ఎన్నికల...

గుడివాడలో హైటెన్షన్.. వైసీపీ...

కృష్ణా జిల్లా గుడివాడ మున్సిపల్ ఎన్నికల...

పోల్స్