Wednesday, November 25, 2026 06:11 PM
Wednesday, November 25, 2026 06:11 PM

టీడీపీ ఎమ్మెల్యేలకు కొత్త తలనొప్పి.. మండల పార్టీ అధ్యక్షులు ఎందుకిలా..?

ఏపీలో జరుగుతున్న గ్రామ పంచాయతీ ఎన్నికల సమరం అధికార కూటమి ఎమ్మెల్యేలకు ఊహించని రీతిలో కొత్త తలనొప్పిగా మారింది. గ్రామాల్లో ఏకగ్రీవాలు సాధించి, మెజారిటీ సర్పంచ్ స్థానాలను కైవసం చేసుకోవాలని ఎమ్మెల్యేలు వ్యూహాలు రచిస్తుంటే, క్షేత్రస్థాయిలో మాత్రం మండల పార్టీ అధ్యక్షులు సొంత ఎజెండాతో ముందుకు వెళ్తుండటం కలకలం రేపుతోంది. తమ ఆధిపత్యాన్ని నిలబెట్టుకునేందుకు చాలా చోట్ల మండల అధ్యక్షులు సొంత వర్గాలను తయారు చేసుకోవడంతో, గ్రామ స్థాయిలో పార్టీ శ్రేణులు రెండుగా చీలిపోయి పరస్పరం నామినేషన్లు వేసుకునే పరిస్థితి నెలకొంది.

Also Read : నాలుగు మేయర్ కుర్చీలు.. గెలిచేవి ఇవేనా..!

ముఖ్యంగా తమ మాట వినే వారికే సర్పంచ్, వార్డు సభ్యుల టికెట్లు ఇప్పించుకోవాలనే పట్టుదలతో మండల అధ్యక్షులు వ్యవహరిస్తుండటంతో, సీనియర్ నేతలు, పాత కార్యకర్తలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే సూచించిన అభ్యర్థులకు వ్యతిరేకంగా మండల అధ్యక్షుల మద్దతుదారులు రెబల్ అభ్యర్థులుగా బరిలోకి దిగడం పలు నియోజకవర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. మండల స్థాయిలో పట్టు సాధించే క్రమంలో వీరు సృష్టిస్తున్న వర్గ విభేదాలు చివరకు ఎమ్మెల్యేల మెడకే చుట్టుకుంటున్నాయి.

Also Read : ఫేస్‌బుక్ నుంచి పబ్‌జీ వరకు.. ఆర్మీలో కఠిన ఆంక్షలు

నవంబర్ 26న తొలి విడత పోలింగ్ జరగనున్న నేపథ్యంలో, ఈ అంతర్గత కుమ్ములాటలు ప్రత్యర్థి పార్టీలకు అస్త్రంగా మారే ప్రమాదం ఉందని ఎమ్మెల్యేలు ఆందోళన చెందుతున్నారు. మండల పార్టీ అధ్యక్షుల ఏకపక్ష నిర్ణయాలను కట్టడి చేయలేక, అటు సీనియర్ కార్యకర్తలను బుజ్జగించలేక పలువురు ఎమ్మెల్యేలు తలలు పట్టుకుంటున్నారు. పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో తేడా వస్తే అధిష్టానం వద్ద తమ పనితీరుపై మచ్చ పడుతుందని భావిస్తున్న ఎమ్మెల్యేలు, వర్గాలను ప్రోత్సహిస్తున్న మండల అధ్యక్షులపై అధిష్టానానికి ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నట్లు రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది.

సంబంధిత కథనాలు

- Advertisement -spot_img

తాజా కథనాలు

భారీగా పెరిగిన ఏపీ...

ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ సరికొత్త మైలురాయిని...

జగన్‌పై హరీష్‌రావుకు కోపం...

పల్నాడు వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు ఇప్పుడు...

సంచలన చట్టానికి సిద్ధమైన...

ఆంధ్రప్రదేశ్ శాసనసభ శీతాకాల సమావేశాలకు కూటమి...

10 లక్షల మందితో...

‘కార్యకర్తే అధినేత’ అనే నినాదాన్ని ఆచరణలోకి...

కోర్టు విచారణల రికార్డింగ్...

న్యాయస్థానాల విచారణ ప్రక్రియకు సంబంధించి ఏపీ...

గుడివాడలో హైటెన్షన్.. వైసీపీ...

కృష్ణా జిల్లా గుడివాడ మున్సిపల్ ఎన్నికల...

పోల్స్