Wednesday, November 25, 2026 06:54 PM
Wednesday, November 25, 2026 06:54 PM

సంచలన చట్టానికి సిద్ధమైన చంద్రబాబు సర్కార్..!

ఆంధ్రప్రదేశ్ శాసనసభ శీతాకాల సమావేశాలకు కూటమి ప్రభుత్వం ముహూర్తం ఖరారు చేసే పనిలో నిమగ్నమైంది. డిసెంబర్ 5వ తేదీ నుంచి ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలను ప్రారంభించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈసారి సమావేశాలను సుమారు 15 రోజుల పాటు నిర్వహించాలని భావిస్తుండగా, ఈ మేరకు త్వరలోనే అధికారిక నోటిఫికేషన్ వెలువడనుంది. ఈ సమావేశాల్లో రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలతో పాటు వివిధ శాఖల పనితీరుపై చర్చించనున్నారు.

Also Read : గుడివాడలో హైటెన్షన్.. వైసీపీ శిబిరానికి ఒంటరిగా బైక్‌పై ఎమ్మెల్యే..!

ఈ శీతాకాల సమావేశాల్లో అత్యంత కీలకమైన ‘పెట్టుబడుల రక్షణ చట్టం’ బిల్లును ప్రభుత్వం ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతోంది. రాష్ట్రంలో పరిశ్రమలు స్థాపించేందుకు ముందుకు వచ్చే దేశ, విదేశీ పెట్టుబడిదారులకు పూర్తిస్థాయి నమ్మకం, భద్రత కల్పించడమే ఈ చట్టం ప్రధాన ఉద్దేశం. ప్రభుత్వాలు మారినప్పుడల్లా గతంలో చేసుకున్న ఒప్పందాలు, రాయితీల విషయంలో పారిశ్రామికవేత్తలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా ఈ కొత్త చట్టం రక్షణ కవచంలా పనిచేయనుంది.

Also Read : గోల్డ్ లోన్ తీసుకునే వారికి బిగ్ అలర్ట్.. ఆర్‌బీఐ కీలక హెచ్చరికలు..!

ముఖ్యంగా పరిశ్రమలకు ప్రభుత్వం ప్రకటించే ప్రోత్సాహకాలు, రాయితీలు మరియు భూముల కేటాయింపుల విషయంలో పూర్తి పారదర్శకతతో పాటు చట్టపరమైన భరోసా కల్పించేందుకు ఈ బిల్లును రూపొందిస్తున్నారు. రాష్ట్రంలో పారిశ్రామిక వాతావరణాన్ని మరింత బలోపేతం చేసి, భారీ ఎత్తున పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ఈ చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంటోంది. అసెంబ్లీలో ఈ బిల్లుకు ఆమోదం లభిస్తే ఏపీ పారిశ్రామిక రంగంలో సరికొత్త శకం మొదలవుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

సంబంధిత కథనాలు

- Advertisement -spot_img

తాజా కథనాలు

భారీగా పెరిగిన ఏపీ...

ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ సరికొత్త మైలురాయిని...

జగన్‌పై హరీష్‌రావుకు కోపం...

పల్నాడు వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు ఇప్పుడు...

10 లక్షల మందితో...

‘కార్యకర్తే అధినేత’ అనే నినాదాన్ని ఆచరణలోకి...

కోర్టు విచారణల రికార్డింగ్...

న్యాయస్థానాల విచారణ ప్రక్రియకు సంబంధించి ఏపీ...

టీడీపీ ఎమ్మెల్యేలకు కొత్త...

ఏపీలో జరుగుతున్న గ్రామ పంచాయతీ ఎన్నికల...

గుడివాడలో హైటెన్షన్.. వైసీపీ...

కృష్ణా జిల్లా గుడివాడ మున్సిపల్ ఎన్నికల...

పోల్స్