Sunday, September 13, 2026 08:19 PM
Sunday, September 13, 2026 08:19 PM

టీడీపీ నేతలకు చంద్రబాబు కొత్త టాస్క్ షురూ..!

ఆంధ్రప్రదేశ్‌ లో అధికార తెలుగుదేశం పార్టీ మరో ప్రతిష్టాత్మక ప్రజా బాట కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతోంది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తి చేసుకున్న నేప‌థ్యంలో, ఈ నెల 27 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ మేరకు తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో జరిగిన కీలక సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. నిజానికి ఈ కార్యక్రమాన్ని గత నెలలోనే ప్రారంభించి, 45 రోజుల పాటు నిర్వహించాలని తొలుత భావించారు.

Also Read : యుద్ధం కొనసాగితే 9/11 తరహా అటాక్.. ఇరాన్ మాస్ వార్నింగ్..!

అయితే అదే సమయంలో ఓటరు జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌) ప్రక్రియ కొనసాగుతుండటంతో, క్యాడర్ ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో పార్టీ అధిష్ఠానం దీనిని తాత్కాలికంగా వాయిదా వేసింది. ప్రస్తుతం ఆ ప్రక్రియ ముగింపు దశకు చేరడంతో, జూలై 27 నుంచి అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ ప్రజా ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు పార్టీ శ్రేణులు సర్వం సిద్ధం చేశాయి. ఈ కార్యక్రమం ద్వారా కూటమి ప్రభుత్వం గత రెండేళ్ల కాలంలో సాధించిన అపూర్వ విజయాలను, అమలు చేసిన అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాలను నేరుగా ప్రజలకు వివరించనున్నారు.

Also Read : దేశంలో విశాఖ టాప్‌.. కుప్పలుగా ఉద్యోగాలు

ముఖ్యమంత్రి చంద్రబాబు సారథ్యంలో ఎన్నికల మేనిఫెస్టోలోని హామీలైన ఎన్టీఆర్ భరోసా పింఛన్లు, దీపం పథకం, స్త్రీశక్తి, సూపర్ సిక్స్ పథకాలతో పాటు రాష్ట్ర పునర్నిర్మాణానికి తీసుకుంటున్న చర్యలను ప్రతి పేదవాడి గుమ్మం వద్దకు తీసుకెళ్లనున్నారు. ఎలాంటి వ్యత్యాసాలు లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు ఎలా అందుతున్నాయో వివరిస్తూ ప్రత్యేకంగా రూపొందించిన కరపత్రాలను పంపిణీ చేయనున్నారు. బూత్ స్థాయి కార్యకర్త నుంచి నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు మరియు మంత్రుల వరకు ఈ సుదీర్ఘ ప్రచారంలో ప్రత్యక్షంగా పాల్గొనబోతున్నారు. ఈ 40-45 రోజుల పాటు నాయకులంతా నిరంతరం ప్రజల్లోనే ఉంటూ.. ప్రభుత్వ విజయాలను చాటిచెప్పడంతో పాటు స్థానికంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను, వారి అమూల్యమైన సూచనలను కూడా సేకరించనున్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

కూటమిలో సీట్ల పంచాయతీ.....

ఆలు లేదు.. సూలు లేదు.. కొడుకు...

ఏపీ అభ్యర్థులకు అలర్ట్.....

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా...

రమా నందనాను వెంటాడుతున్న...

లండన్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మబలికి...

నల్లమల సాగర్‌లో కృష్ణమ్మ...

శ్రీశైలం నుంచి కృష్ణా జలాలు పరవళ్లు...

వల్లభనేని ఆస్తుల గుట్టు...

మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని...

DSC స్పోర్ట్స్‌ కోటా...

కష్టపడి పతకాలు సాధించి, అన్ని అర్హతలతో...

పోల్స్