Saturday, August 8, 2026 09:01 AM
Saturday, August 8, 2026 09:01 AM

తిరుమలలో చంద్రబాబు కీలక ప్రకటన

ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తిరుమల పవిత్రత విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూనే ఉంది. 2019 నుంచి 2024 వరకు వివాదాస్పద నిర్ణయాలతో తిరుమల పవిత్రతను దెబ్బతీసింది… వైసీపీ ప్రభుత్వమనే ఆరోపణలు ఎక్కువగా వినిపించాయి. ఈ తరుణంలో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు సర్కార్.. ఇప్పుడు తిరుమల విషయంలో జాగ్రత్తగా వ్యవహరిస్తోంది. తాజాగా చంద్రబాబు నాయుడు తిరుమల పర్యటనలో కీలక వ్యాఖ్యలు చేశారు.

Also Read : ఆ క్రెడిట్ చంద్రబాబుదే.. పవన్ కు చంద్రబాబు థాంక్స్..!

తిరుమల ఏడుకొండలకు సమీపంలో తలపెట్టిన ముంతాజ్ హోటల్ ప్రాజెక్టు అనుమతులను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. ఈ విషయాన్ని స్వయంగా చంద్రబాబు ప్రకటించారు. తన మనవడు నారా దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి… చంద్రబాబు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం వెంగమాంబ అన్నదాన కేంద్రంలో దేవాన్ష్ పేరుతో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులతో చంద్రబాబు సమీక్షలు జరిపారు.

Also Read : రెబల్ ఫ్యాన్స్ కు.. ఏప్రిల్ ఫస్ట్ వీక్ లో ఫెస్టివల్

ఈ సందర్భంగా ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు. తిరుమలలో పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని… ఈ క్రమంలోనే ఏడుకొండలకు సమీపంలో ఎటువంటి వాణిజ్య కార్యకలాపాలకు పరిధి దాటి అనుమతి ఇవ్వకూడదని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. ఏడుకొండలకు సమీపంలో ఎటువంటి కమర్షియల్ ప్రైవేటు నిర్మాణాలకు అనుమతులు ఇవ్వకూడదని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు చంద్రబాబు నాయుడు స్వయంగా ప్రకటించారు. ఇక తిరుమలలో కేవలం హిందువులను మాత్రమే ఉద్యోగాలలో నియమిస్తామని చంద్రబాబు పేర్కొన్నారు. టీటీడీలో ఇతర మతస్తులు ఎవరైనా… ఉద్యోగాలు చేస్తూ ఉంటే వారి మనోభావాలు దెబ్బతినకుండా ఇతర శాఖలలోకి బదిలీ చేస్తామని హామీ ఇచ్చారు. ఇక దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల రాజధానుల్లోను శ్రీవారి ఆలయాలను నిర్మిస్తామన్నారు చంద్రబాబు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

జనసేన జెండా కోసం...

డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ రాజకీయంగా...

కవితను లైట్ తీసుకున్న...

తండ్రి కేసీఆర్, అన్న కేటీఆర్, బావ...

ఈవీఎంలకు వ్యతిరేకంగా కాక్రోచ్...

ఢిల్లీ జంతర్ మంతర్ వేదికగా నీట్...

బెజవాడ మేయర్ పీఠంపై...

ఇటీవల కాపు నేత ముద్రగడ పద్మనాభం...

ఎలా చెబితే అర్థం...

సాధారణంగా ఒక నానుడి ఉంది. అదేమిటంటే.....

ఇంట్రస్టింగ్ గా సీఎం...

తమిళనాడు ముఖ్యమంత్రి, తమిళగ వెట్రి కళగం...

పోల్స్