Sunday, April 19, 2026 02:29 PM
Sunday, April 19, 2026 02:29 PM

కేటిఆర్ పాదయాత్ర.. సీనియర్ల అసంతృప్తి..!

తెలంగాణ రాజకీయాల్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన తాజా వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. పార్టీ పేరును తిరిగి టీఆర్ఎస్ గా మార్చే ఆలోచనలో ఉన్నామని కేటీఆర్ ప్రకటించడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. అయితే, క్షేత్రస్థాయిలో పరిస్థితులు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దూకుడు, మరియు పార్టీలోని అంతర్గత అసంతృప్తి నేపథ్యంలో కేటీఆర్ అడుగులు ఏ మేరకు ఫలిస్తాయనేది ఆసక్తికరంగా మారింది. పార్టీ పేరు మార్చిన తర్వాత నష్టపోయాం అని కేటీఆర్ స్వయంగా అంగీకరించడం గమనార్హం.

Also Read : అమరావతి వేదికగా సాకారమవుతున్న భారత క్వాంటం విప్లవం

తెలంగాణ సెంటిమెంట్‌ కు మారుపేరుగా ఉన్న టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్‌గా మార్చడం వల్ల ప్రజలకు, పార్టీకి మధ్య దూరం పెరిగిందనేది ఆయన అభిప్రాయం. మళ్ళీ పాత పేరుతో ప్రజల్లోకి వెళ్లి ఆ సెంటిమెంట్‌ను రగిల్చాలని కేటీఆర్ భావిస్తున్నారు. కానీ, కేవలం పేరు మార్పుతోనే కోల్పోయిన వైభవం వస్తుందా..? లేక విధానాల్లో కూడా మార్పు రావాలా..? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రస్తుతం దూకుడుగా వ్యవహరిస్తున్నారు. అటు పాలనలో, ఇటు రాజకీయాల్లో తనదైన ముద్ర వేస్తూ విపక్షాలను ఇరకాటంలో పెడుతున్నారు.

ఈ క్రమంలో కేటీఆర్ ఏ నియోజకవర్గం నుంచైనా పోటీకి సిద్ధమని, 2027లో పాదయాత్ర చేస్తానని ప్రకటించడం రేవంత్ రెడ్డికి సవాల్ విసరడమే అని చెప్పవచ్చు. అయితే, రేవంత్ రెడ్డి మాస్ ఇమేజ్, వాగ్ధాటిని తట్టుకుని కేటీఆర్ ఎంతవరకు నిలబడతారనేది చూడాలి. కేటీఆర్ ప్రకటనలపై పార్టీలోని కొందరు సీనియర్ నేతలు అసంతృప్తితో ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. పార్టీ ఓటమికి కారణాలపై కేటీఆర్ చేస్తున్న విశ్లేషణలు, నిర్ణయాలు సీనియర్లకు మింగుడు పడటం లేదని తెలుస్తోంది.

Also Read :హైడ్రా కమిషనర్ పగ తీర్చుకుంటున్నారా..?

పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కేటీఆర్ చుట్టూ ఉన్న కోటరీ వల్ల సామాన్య కార్యకర్తలకు, ప్రజలకు దూరం అయ్యామని, ఇప్పుడు మళ్ళీ అదే పద్ధతి కొనసాగితే లాభం ఉండదని కొందరు వాదిస్తున్నారు. కేటీఆర్ నాయకత్వాన్ని పూర్తిగా అంగీకరించని వర్గం కూడా పార్టీలో ఉందనే ప్రచారం జరుగుతోంది. ప్రజా సమస్యలపై 2027లో పాదయాత్ర చేస్తానని కేటీఆర్ ప్రకటించారు. అసెంబ్లీ ఎన్నికలకు ఏడాది ముందు ఈ యాత్ర చేపట్టడం ద్వారా కేడర్‌ లో ఉత్సాహం నింపాలని ఆయన ప్లాన్. బీజేపీతో పొత్తు ఉండదని స్పష్టం చేయడం ద్వారా పార్టీ స్టాండ్‌ ను క్లియర్ చేశారు. కానీ, అప్పటివరకు పార్టీలోని బలమైన నేతలు చేజారిపోకుండా కాపాడుకోవడం కేటీఆర్‌కు అతిపెద్ద సవాల్.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

టార్గెట్ ధర్మాన, బొత్స.....

ఉత్తరాంధ్ర రాజకీయాల్లో మరోసారి ఉద్రిక్తతలు రాజుకున్నాయి....

ఏపీకి మోదీ సర్కార్...

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై కేంద్ర ప్రభుత్వం మరోసారి...

ఏపీలో స్లీపర్ బస్సుల...

దేశంలో.. దూరప్రాంత ప్రయాణాలకు అత్యంత ఆదరణ...

చిన్నారి పునర్వికకు పునర్జన్మ.....

ప్రాణాంతక వ్యాధితో పోరాడుతున్న చిన్నారి పునర్విక...

మెటాలో 8,000 మంది...

ఏఐ అడుగుపెట్టిన తర్వాత టెక్ రంగంలో...

ఢిల్లీలో రేవంత్ సెన్సేషన్.....

దేశ రాజధాని ఢిల్లీలో డీలిమిటేషన్, మహిళా...

పోల్స్