Sunday, June 21, 2026 04:15 PM
Sunday, June 21, 2026 04:15 PM

నూతన కార్మిక చట్టాల్లో మహిళల ప్రయోజనాలు తెలుసా..?

భారత్ లో ఉద్యోగుల విషయంలో కేంద్రం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. కార్మికులకు సంబంధించి ఆందోళన వ్యక్తమవుతోన్న నేపధ్యంలో నూతన కార్మిక చట్టాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. 4 లేబర్ కోడ్ లను అమలు చేస్తున్నట్టు ప్రకటించింది. కార్మికశాఖా మంత్రి మన్సుఖ్ మాండవీయ న్యూఢిల్లీలో విలేకరుల సమావేశంలో దీనిపై ప్రకటన చేసారు. ఆత్మ నిర్భర భారత్ ను దృష్టిలో ఉంచుకుని వీటిని తీసుకొచ్చామని, కొత్త పరిశ్రమలకు పునాది వేస్తుందని పేర్కొన్నారు.

Also Read : జగన్, కేటీఆర్ కలయిక.. వారికి పండగే..!

వేతనాల నియమావళి, 2019, సామాజిక భద్రతా కోడ్, 2020, పారిశ్రామిక సంబంధాల నియమావళి, 2020, వృత్తి భద్రత, ఆరోగ్యం, పని పరిస్థితుల కోడ్, 2020 లను అందుబాటులోకి తెచ్చింది. ఈ చారిత్రాత్మక సంస్కరణల కారణంగా.. కార్మికులు భద్రత, గౌరవం, ఆరోగ్యం, సంక్షేమ కార్యక్రమాలను సులభంగా అందే విధంగా సహకరిస్తుంది. 29 కార్మిక చట్టాలను నాలుగు కార్మిక కోడ్‌లుగా క్రోడీకరించింది. ‘గిగ్ వర్క్’, ‘ప్లాట్‌ ఫామ్ వర్క్’ మరియు ‘అగ్రిగేటర్’ అనేవి కోడ్‌ లో మొదటిసారిగా ప్రస్తావించింది కేంద్రం.

ఆదార్ లింక్ చేసిన పాన్ కార్డ్ లు దేశ వ్యాప్తంగా కార్మికులు తమ హక్కులను పొందే విధంగా వీలు కల్పించింది. అగ్రిగేటర్లు వార్షిక టర్నోవర్‌లో 1-2% సంక్షేమ నిధికి వాటా ఇవ్వాల్సి ఉంటుంది. వేతనం విషయంలో మహిళలకు సమానంగా ఉండటమే కాకుండా.. మహిళలు రాత్రి షిఫ్టులలో పని చేయవచ్చు. అన్ని రకాల పనుల్లో మహిళలు రాత్రి సమయాల్లో పని చేసే అవకాశం కల్పించారు. వారి సమ్మతి తీసుకుని, భద్రత కల్పించాల్సి ఉంటుంది. 26 వారాల వరకు మహిళలు వేతనంతో కూడిన సెలవు తీసుకునే అవకాశం కల్పించారు.

Also Read : కర్నూలు టీడీపీపై ఆందోళనలో అధిష్టానం.. సంచలన నివేదికలతో కలవరం..!

మహిళా కార్మికులకు ఆరోగ్య ప్రయోజనాలు కూడా కల్పించారు. రూ. 3,500 వైద్య బోనస్ అందిస్తారు. చాలా కార్మిక చట్టాలు స్వాతంత్ర్యానికి ముందు కాలంలో రూపొందించినవి కావడంతో నేటి ఆర్ధిక పరిస్థితులకు అనుగుణంగా వాటిని అప్డేట్ చేసింది కేంద్రం. మహిళల కుటుంబంలో అత్తా మామలను కూడా చేర్చుకునే అవకాశం కల్పించారు. వారికి కూడా ప్రయోజనాలు అందే విధంగా చట్టాలను తయారు చేసింది కేంద్రం. ప్రతి కార్మికుడికి భద్రత, ఆరోగ్యం, సామాజిక, వేతన భద్రతను దృష్టిలో ఉంచుకుని కేంద్రం ఈ అడుగులు వేసింది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

SBI వర్సెస్ తెలంగాణా...

రాయదుర్గం భూముల కేటాయింపు వ్యవహారంలో స్టేట్...

తిరుపతిలో కేఎఫ్‌సీ, డొమినోస్‌...

ప్రముఖ అంతర్జాతీయ ఫుడ్ బ్రాండ్ల ఆహార...

తిరుపతిలో వడ్డీ మాఫియా.....

తిరుపతి నగరంలో వడ్డీ వ్యాపారం పేరుతో...

సాయికృష్ణ కేసులో వైసీపీ...

విజయవాడ రౌడీ షీటర్‌ గాదె సాయికృష్ణ...

బ్రేకింగ్: అల్లు అర్జున్‌...

హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సంధ్య...

తెలంగాణాలో జనసేన తొలి...

గత కొన్నాళ్ళుగా తెలంగాణాలో పార్టీ బలోపేతం...

పోల్స్