Thursday, September 17, 2026 09:43 PM
Thursday, September 17, 2026 09:43 PM

కనిమొళికి, కవితకు జరిగిన న్యాయం.. అయేషా మీరాకు జరగలేదేం..?

ఆయేషా మీరా హత్య కేసు.. తెలుగు రాష్ట్రాల్లో ఒకప్పుడు సంచలనం. 2007 డిసెంబర్ 27న విజయవాడ సమీపంలోని ఇబ్రహీంపట్నంలోని శ్రీదుర్గా లేడీస్ హాస్టల్ బాత్‌రూమ్‌లో రక్తపు మడుగులో పడి ఉన్న ఆమె ఫోటోలు అప్పట్లో న్యూస్ పేపర్ లలో చూసి కన్నీరు పెట్టుకున్నారు అంతా. రాత్రి సమయంలో హాస్టల్‌ లో ఎవరో గుర్తు తెలియని వ్యక్తి.. ప్రవేశించి, ఆమెను రోకలి బండతో తలపై కొట్టి, ఒక కాలును ట్యాప్ కు కట్టేసి.. ఛాతిపై ‘చిరుత 143’, పొట్టపై లవ్ సింబల్ రాసి, ప్రేమ అంగీకరించకపోతే ఇలాగే జరుగుతుంది అంటూ వార్నింగ్ ఇచ్చారు.

Also Read : బీఆర్ఎస్, బిజెపిలకు బులెట్ దిగిందా..?

ఆ కేసులో అప్పుడు నిందితుడు అంటూ ఓ సెల్ ఫోన్ దొంగను తీసుకెళ్ళి అరెస్ట్ చేసి.. పదేళ్ళ పాటు జైలులో ఉంచారు. అతను నిర్దోషి అంటూ కుటుంబ సభ్యులు వాదించినా లాభం లేకుండా పోయింది. ఏళ్ళ తరబడి సాగిన విచారణలో.. ఇప్పుడు అవశేషాలు అప్పగించిన కోర్టు.. సాక్ష్యాలు లేవని ఓ హత్య కేసును క్లోజ్ చేసింది. ఈ కేసు చూసిన తర్వాత, భారతదేశంలో న్యాయం జరుగుతుందా..? 2జీ కేసు, లిక్కర్ కేసులలో రాజకీయ నాయకులకు న్యాయం జరిగితే.. అయేషా మీరా, సుగాలి ప్రీతీ కేసులలో న్యాయం జరుగుతుందా..? ఇప్పుడు ఇదే ప్రశ్న. దాదాపు రెండు దశాబ్దాల అయేషా మీరా కేసు విచారణల మీద విచారణలు జరుగుతూనే ఉంది. ఆమె తల్లి తండ్రులు అప్పటి నుంచి పోరాటం చేస్తూనే ఉన్నారు. కానీ తాజాగా కేసును కోర్ట్ క్లోజ్ చేయడమే కాకుండా ఆమె అవశేషాలను తిరిగి తల్లి తండ్రుల చేతిలో పెట్టింది కోర్ట్. విజయవాడలో ఖననం కూడా చేసారు.

దీనిపై ఆమె తల్లి మాట్లాడుతూ.. ఇదెక్కడి న్యాయం, సి బి ఐ కోర్ట్ ఆధారాలు లేవు అని క్లోజ్ చేసిందని, ఎఫ్ ఐ ఆర్ లో తమ కుమార్తె వయస్సు 17 సంవత్సరాలు అయితే 19 రాసారని, సీన్ ఆఫ్ అఫెన్స్ మొత్తం కడిగేశారని ఆవేదన వ్యక్తం చేసారు. న్యాయం చేయమంటే బాడీ పార్ట్ లు ఇస్తుంటారని కన్నీటి పర్యంతం అయ్యారు. ఇక్కడ రాజకీయ నాయకులుకు, ధనవంతులకు మాత్రమే న్యాయం ఉంటుందని సామాన్యులకు న్యాయం ఉండదని ఆమె వాపోయారు. మైనార్టీ ల మైన మాకు ఒక న్యాయం వేరే వాళ్ళకు ఒక న్యాయం ఉంటుందనారు.

Also Read : సెమీస్ రేసులో టీమిండియా.. కానీ సూర్య ప్రయోగాలే టెన్షన్!

సమాజానికి ఇదే కనువిప్పు కలుగుతుందని, ఈ కేసును హై కోర్ట్ సిటింగ్ జడ్జి తో విచారణ చేయాలని ముఖ్యమంత్రి గారిని కోరుతున్నామన్నారు. పోలీసులు సి పి ఆనంద్, ఎస్ ఐ మురళీ, హనుమంతు రావు, సహారా బేగం ఇలా మా కేసును తొక్కిపట్టేశారని, న్యాయం జరగాలి అంటే ప్రజలు తిరగబడాలని ఆమె పిలుపునిచ్చారు. కోర్టులు కేసులను మూసివేస్తున్నాయని, నేరస్తులకు మనమే శిక్ష వేసుకోవాలని, రేపు వివేకానంద కేసు, సుగాలీ ప్రీతి కేసు ఇలాగే జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కేసులో పోలీసులను కూడా అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించాలని ఆమె డిమాండ్ చేసారు. అప్పట్లో 2జీ కేసులో కనిమొళి వంటి వారికి నిన్న కవిత లాంటి వారికి.. పైగా జైళ్ళలో రిమాండ్ లో ఉన్నవారికి న్యాయం జరిగినా అయేషా మీరాకు మాత్రం న్యాయం జరగలేదు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

మరో వైసీపీ కీలక...

అనంతపురం జిల్లాలో జరుగుతోన్న అక్రమ మైనింగ్...

కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్‌హౌస్...

తెలంగాణ మాజీ సిఎం, బీఆర్ఎస్ అధినేత...

చంద్రబాబుపై కేంద్ర మంత్రి...

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత...

రచ్చకెక్కిన ఉత్తరాంధ్ర వైసీపీ...

శ్రీకాకుళం జిల్లాలో సుదీర్ఘ రాజకీయ అనుభవం...

గ్రామాల్లో అభివృద్ధి పండుగ,...

ఏపీ డిప్యూటి సిఎం పవన్ కళ్యాణ్...

నేను లండన్ వెళ్తా...

సోషల్ మీడియా సెలబ్రిటీ, ప్రముఖ యూట్యూబర్...

పోల్స్