Friday, June 19, 2026 11:58 AM
Friday, June 19, 2026 11:58 AM

టీం ఇండియాకు వరుస గండాలు..? విండీస్ ను తట్టుకుంటేనే..?

టి20 వరల్డ్ కప్ లో ఇప్పటి వరకు.. భారత్ ప్రదర్శన ఎక్కడా కూడా గొప్పగా లేదు అనే మాట వాస్తవం. లీగ్ మ్యాచ్ లు, సూపర్ 8 మ్యాచ్ లలో భారత్ విజయాలు సాధించినా.. అనుకున్న స్థాయిలో మన ఆటగాళ్ళు రాణించలేదు. రేపు సెమీస్ కు భారత జట్టు వెళ్ళడం దాదాపు ఖాయమే అయినా.. సెమీస్ లో తలపడే జట్టు అంత ఆషామాషీగా మాత్రం లేదనే మాట వాస్తవం. సఫారీల బలం చూస్తుంటే.. ఒకప్పటి ఆసిస్ మాదిరిగా కనపడుతోంది. న్యూజిలాండ్, ఇంగ్లాండ్ జట్లు కూడా సెమీస్ లో గట్టి పోటీ ఇచ్చేలా ఉన్నాయి.

Also Read : భారత్ సెమీస్ చేరాలంటే ఈ లెక్కలే కీలకం..!

ఒకవేళ పాకిస్తాన్ అడుగుపెడితే.. భారత్ గెలిచే ఛాన్స్ ఉండవచ్చు గాని.. మిగిలిన జట్లపైనే ఇప్పుడు ఆందోళన అంతా కూడా. లీగ్ దశలో మన స్టార్ ఆటగాళ్ళ ప్రదర్శన.. ఎక్కడా కూడా ఇంటర్నేషనల్ లెవెల్ లో లేదనే మాట బలంగా వినపడుతోంది. రేపు ఆదివారం విండీస్ తో జరిగే లీగ్ మ్యాచ్ లో భారత్ గెలిస్తే.. సెమీస్ చేరుతుంది. దాని కంటే ముందు కనపడే కఠిన పరీక్ష ఇది. సఫారీలతో విండీస్ ఆడిన ఆట తీరు చూస్తే భారత్ వెన్నులో వణుకు ఖాయం. లోయర్ ఆర్డర్ కూడా తుక్కురేగ్గోట్టింది.

Also Read : ప్రముఖ కంపెనీలో సగం మంది ఉద్యోగులు అవుట్..!

ఒకప్పటి విండీస్ మాదిరిగా వారి ఆట తీరు ఉంది. ఇప్పుడు భారత్ సెమీస్ కు చేరాలి అంటే ఈ గండం దాటాల్సిన అవసరం ఉంది. ఆ తర్వాత సెమీస్ లో తలపడే జట్టు విషయంలో ప్రత్యేక వర్కౌట్ ఉండాలి. బౌలింగ్, బ్యాటింగ్ విభాగాల్లో కీలక మార్పులు చేసుకోవాల్సిన అవసరం ఉంది. భజనపరులకు అవకాశాలు ఇవ్వడం తగ్గించాల్సి ఉంది. బౌలింగ్ లో సిరాజ్ లాంటి సీనియర్ ఆటగాడిని వాడుకోవాల్సిన అవసరం ఉంది. వాషింగ్టన్ సుందర్ ను తుది జట్టులో వాడుకోవడం తెలియాల్సి ఉంది. అవసరమైతే అభిషేక్ శర్మకు రెస్ట్ ఇచ్చి.. సంజు సామ్సన్ కు మరో ఛాన్స్ ఇవ్వాల్సి ఉంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

బ్రేకింగ్: కొడాలి అరెస్ట్...

ఏపీలో వైసీపీ కీలక నేతలకు చట్టపరమైన...

‘పెద్ది’కి బిగ్ సర్‌ప్రైజ్.....

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్...

రఘురామ కేసుపై హైకోర్ట్...

ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఐపీఎస్ అధికారి సునీల్‌...

ఏపీ లిక్కర్ స్కామ్‌లో...

ఏపీలో సంచలనం సృష్టించిన మద్యం రవాణా...

ప్రజల్లోకి వెళ్ళాల్సిందే.. చంద్రబాబు...

ఏపీలో అధికారుల తీరుపై విమర్శలు వస్తున్న...

బ్రేకింగ్: లోకేష్ సంచలన...

మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి...

పోల్స్