పోలీసులను చూస్తే చాలు.. గౌరవం, మర్యాద కంటే కూడా.. ముందు భయం వేస్తుంది. పోలీసుల ముందు ఓవర్ యాక్షన్ చేస్తే.. బొక్కలో వేసి మక్కెలు ఇరగొడతారని అందరికీ భయం. అందుకే అంత దూరంలో పోలీసు ఉంటే.. ఇటు నుంచి ఇటే పరారవుతారు. డ్రంక్ అండ్ డ్రైవ్ అయినా సరే.. మరేదైనా సరే.. పోలీసును చూస్తే ఎవరికైనా ప్యాంట్ తడిసిపోవాల్సిందే. ఇదంతా సాధారణ ప్రజలకు మాత్రమే. రాజకీయ నాయకులకు మాత్రం పరిస్థితి వేరు. మరీ ముఖ్యంగా వైసీపీ నేతలు, కార్యకర్తలకు అయితే.. పోలీసు అంటే లెక్కే లేదు. పోలీసును చూస్తే భయం కాదు కదా.. ఇంకా రెచ్చిపోతున్నారు. పోలీసు ఎదురుగానే కాలర్ ఎగురవేస్తున్నారు. పోలీసును ఎదిరిస్తున్నారు. ఇంకా చెప్పాలంటే.. ఏం చేస్తావు.. అంటూ బెదిరిస్తున్నారు కూడా.
Also Read : లిఫ్ట్ ప్రమాదాలపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు..!
ఏపీలో వైసీపీ నేతల అరాచకాలకు అడ్డే లేకుండా పోయింది. ముఖ్యంగా ప్రజలకు రక్షణ కల్పించే పోలీసు వ్యవస్థ అంటే కనీస గౌరవం లేకుండా పోయింది. ఇదే విషయం ఇప్పటికే పలుమార్లు రుజువైంది కూడా. 2024లో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఓ నెల రోజులు మాత్రమే వైసీపీ నేతలు సైలెంట్‌గా ఉన్నారు. ఆ తర్వాత నుంచి తమ పాత రాక్షస రూపాన్ని బయటకు తీశారు. జగన్ వినుకొండ పర్యటనతో మొదలైన బెదిరింపుల పర్వం.. తాజా శ్రీకాకుళం పర్యటన వరకు కొనసాగింది. ఇది ఇప్పట్లో ఆగుతుందా అంటే.. ఆ ఛాన్సే లేదు అంటున్నారు వైసీపీ నేతలు, కార్యకర్తలు.
పరామర్శల పేరుతో జగన్ చేస్తున్న యాత్రలను వైసీపీ నేతలు తమ బలప్రదర్శనకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. జగన్ పరామర్శలన్నీ కూడా జైలులో రిమాండ్‌లో ఉన్న వారినో, జైలు నుంచి బెయిల్ మీద విడుదలైన వారినో, లేక రౌడీ షీటర్లనో తప్ప.. మచ్చుకైనా మంచి పని చేసిన వారినైతే కాదు. జైలుకు వెళ్లిన కాకాణి, అంబటి, జోగి, వంశీ, సీదిరి వంటి నేతలనే తప్ప వేరే వాళ్లనే జగన్ పరామర్శించడం లేదు. అయితే ఈ పరామర్శలను రాజకీయంగా ఉపయోగించుకునేందుకు వైసీపీ నేతలు నానా పాట్లు పడుతున్నారు. పార్టీ కార్యకర్తలతో పాటు కిరాయి మనుషులతో జాతీయ రహదారులపై బలప్రదర్శనలు చేస్తున్నారు. దీని వల్ల గంటల తరబడి ట్రాఫిక్ జామ్ అవుతుంది. అయినా సరే.. వైసీపీ నేతలు పట్టించుకోవటం లేదు.
Also Read : వారానికి ఒకసారి ‘చికెన్ బిర్యానీ’.. సీఎం విజయ్ కీలక నిర్ణయం..?
నిజానికి వైసీపీ అధినేత పర్యటనల సమయంలో పోలీసులు ఆంక్షలు పెడుతున్నారు. కానీ అవి ప్రకటనకు మాత్రమే పరిమితం అవుతున్నాయి. తాజాగా శ్రీకాకుళం జిల్లా పర్యటనలో ఇది మరోసారి రుజువైంది. ఇంకా చెప్పాలంటే.. మళ్లీ జగన్ మరో జిల్లా టూర్‌కు వెళ్లినా సరే.. అక్కడ కూడా రూల్స్ బ్రేక్ అనేది సర్వ సాధారణం. జైలులో రిమాండ్ ఖైదీ సీదిరి అప్పలరాజును ములాఖత్ కోసమే జగన్ అనుమతి తీసుకున్నారు. ఇదే మాటను శ్రీకాకుళం జిల్లా ఎస్పీ మహేశ్వరరెడ్డి ముందు రోజే స్వయంగా ప్రకటించారు. బహిరంగ సభ, ర్యాలీ నిర్వహించేందుకు ఎలాంటి అనుమతి లేదని.. జగన్ పర్యటనలో జన సమీకరణ చేపట్టొద్దన్నారు. జన సమీకరణ జరిగితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్పీ వార్నింగ్ కూడా ఇచ్చారు.
అయితే ఎస్సీ వార్నింగ్ కేవలం ప్రకటనలకే పరిమితం అయినట్లు ఉంది. ఎస్పీ ప్రకటన కేవలం మీడియా వారి దగ్గరే ఆగిపోయినట్లుంది. వైసీపీ నేతల వరకు చేరినట్లు కనిపించలేదు. ఎందుకంటే.. జగన్ విశాఖ చేరినప్పటి నుంచి శ్రీకాకుళం జిల్లా అంపోలు జైలుకు చేరే వరకు భారీ కాన్వాయ్, ట్రాఫిక్ జామ్.. రప్పా రప్పా నినాదాలు.. జగన్ టూర్ అంటే ఇలాగే ఉంటుందన్నట్లుగా సాగింది. ఓ వైపు ప్రధాన పర్యటనకు ముమ్మర ఏర్పాట్లు జరుగుతుంటే.. ఇలాంటి సమయంలో జగన్ తన బల ప్రదర్శన టూర్ గ్రాండ్ సక్సెస్ చేశారనే మాట రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. కనీసం ఒక్క సీటు కూడా గెలవని రెండు జిల్లాల్లో వైసీపీ నేతలకు అంత బలం ఎలా వచ్చిందో.. అర్థం కాని ప్రశ్న.
ఇక జగన్ పర్యటనలో వైసీపీ నేతలు దుశ్శాసన పర్వానికి తెగబడ్డారు. ఆముదాలవలస నియోజకవర్గం వైసీపీ ఇంఛార్జ్ చింతాడ రవికుమార్ బరితెగించారు. విధి నిర్వహణలో ఉన్న మహిళ ఎస్ఐ ప్రవళికపై దాడి చేశారు. నిలువరించేందుకు యత్నించిన మహిళ ఎస్ఐ ప్రవళికను చుట్టుముట్టిన వైసీపీ మూకలు.. ఆమెను అసభ్యంగా తాకుతూ నెట్టుకుంటూ వెళ్లారు. బూతులు తిట్టుకుంటూ, చేతులతో తడుతూ అసభ్యంగా ప్రవర్తిస్తూ మహిళా ఎస్ఐ ప్రవళికపై చింతాడ రవికుమార్ దాడి చేశాడు. చివరికి అడ్డుకోబోయిన సీఐ పై కూడా దాడికి తెగబడ్డారు. నా అక్కచెల్లెమ్మలు అని చెప్పడం తప్ప.. మహిళలకు ఆ పార్టీ నేతలు ఎంత గౌరవం ఇస్తున్నారో ఈ ఒక్క ఉదాహరణ చాలు. అధినేత పరామర్శ పేరుతో యాత్రలు చేయడం.. గొడ్డలి పార్టీ నేతలు, కార్యకర్తలు సందట్లో సడేమియా అన్నట్లుగా మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తూ దుశ్శాసన పర్వం కొనసాగించడం చూస్తుంటే..
Also Read : కేవలం వ్యాయామంతోనే ప్రీడయాబెటిస్ కు చెక్ పెట్టవచ్చా..?
మహిళా ఎస్ఐ ప్రవళికపై వైసీపీ నేతలు, రౌడీ మూకలు దాడి ఘటన సభ్యసమాజం సిగ్గుపడుతోంది. వీరికి చట్టం, న్యాయం, వ్యవస్థలపై కనీస గౌరవం లేదని, పోలీసు వ్యవస్థ పట్ల భయం లేదని ఈ ఒక్క ఘటనతో అర్థమవుతోంది. ఈ ఘటనపై ఇప్పటి వరకు వైసీపీ నేతల నుంచి ఎలాంటి స్పందన రాలేదు. అయితే కొందరు వైసీపీ నేతలు మాత్రం.. మా నేతను చూసేందుకు కూడా పోలీసు అనుమతి కావాలా.. అందుకే అడ్డుగా ఉన్న బారికేడ్లను తోసుకుంటూ వెళ్లాం.. అప్పుడు ఏదో చెయ్యి తగిలింది.. ఆ మాత్రానికి అనుచిత ప్రవర్తన అవుతుందా.. అంటూ తమ పార్టీ నేత చర్యను సమర్థించుకుంటున్నారు. పైగా కొంతమంది నేతలైతే.. “జైలుకు వెళ్లిన నేతలనే మా అధినేత జగన్ పరామర్శిస్తారు.. కాబట్టి కేసు పెట్టి జైలులో పెట్టండి.. అప్పుడన్నా మా జగనన్న దృష్టిలో పడతాం..” అంటున్నారు. అంటే.. జైలుకు వెళ్లడం వైసీపీ నేతలకు హాలిడే ట్రిప్‌లా ఉన్నట్లుగా ఉంది.

