Sunday, September 20, 2026 12:09 AM
Sunday, September 20, 2026 12:09 AM

అమరావతి నిర్మాణ కూలీలలో మావోలు..?

ఆంధ్రప్రదేశ్ లో ఉగ్రవాద కార్యాకలాపాలు బయటపడటంతో, మావోయిస్ట్ లు తిష్ట వేయడంతో పోలీసు ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. ఎక్కడికక్కడ భద్రతను కట్టుదిట్టం చేస్తూ.. ప్రముఖుల ఇళ్ళపై ఫోకస్ చేసారు. ఓ అగ్ర నేతను హతమార్చేందుకు మావోయిస్ట్ లో బెజవాడలో దిగారని, రెక్కీ కూడా నిర్వహించారు అని గుర్తించిన పోలీసులు.. ఆ దిశగా మావోలు వేసిన అడుగులపై ఫోకస్ పెట్టారు. విజయవాడ, ఏలూరు, కాకినాడలో వీరికి ఎవరెవరు సహకరిస్తున్నారు అనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

Also Read : మళ్ళీ మావోల రిక్రూట్మెంట్.. ఏపీ పోలీసుల సంచలనం..!

వాళ్ళు టార్గెట్ చేసిన అగ్ర నేత ఇంటికి కూడా భద్రతను కట్టుదిట్టం చేసారు. ఇక సచివాలయం, అసెంబ్లీ, హైకోర్ట్, సిఎం చంద్రబాబు నివాసం, ప్రభుత్వ కార్యాలయాలు, పోలీసు కమీషనరేట్, ఎమ్మెల్యేల నివాసాలు, మాజీ సిఎం వైఎస్ జగన్ నివాసం సహా పలు ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేసారు. అమరావతిలో నిర్మాణాలు జరుగుతోన్న ప్రాంతాల్లో కూడా నిఘా పెంచారు. అక్కడ పని చేసే కార్మికులు సహా పలువురి గురించి ఆరా తీస్తున్నారు. అలాగే విజయవాడ, ఏలూరులో ఇళ్ళను అద్దెకు ఇచ్చింది ఎవరు అనే దానిపై కూడా ఆరా తీసారు.

Also Read : సిఎం మార్పు ఖాయమే..? వదలని డిప్యూటి సిఎం..!

ఇక విచారణలో కూడా కీలక అంశాలను గుర్తించారు. ఏలూరులో అక్టోబర్‌ 26న ఇల్లు అద్దెకు తీసుకున్న మావోయిస్టులు.. పెద్దగా బయటకు వచ్చేవారు కాదని తేల్చారు. కేబుల్‌ పనిచేస్తున్నామని, నెలకు రూ.10 వేల చొప్పున ఇల్లు అద్దెకు తీసుకున్నారట. అలాగే ఇద్దరు మాత్రమే బయట నుంచి ఆహారం తీసుకొచ్చేవారని స్థానికులు చెప్పడం గమనార్హం. ఇంటి యజమానిని ప్రశ్నిస్తున్న పోలీసులు.. ఇల్లు అద్దెకు మధ్యవర్తిత్వం ఎవరు వహించారనే దానిపై కూడా ఆరా తీస్తున్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

తిరుమల లడ్డూ పై,...

ఈడీ అంటే ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌.. ఈ...

ఇప్పటికీ వారికే పదవులు.....

కూటమి ప్రభుత్వం ఏర్పడి, దాదాపు రెండున్నర...

సాయిరెడ్డి.. నెట్టుకు రాగలరా.....

కొత్త ఎపుడూ వింతే. అందుకే కొత్తగా...

25 రోజుల తర్వాత...

ఏపీ డిప్యూటి సీఎం, జనసేన అధినేత...

ఏపీలో మద్యం షాపుల...

ఆంధ్రప్రదేశ్‌లో 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను...

బాంబు పేల్చిన టీడీపీ...

గుంటూరు పశ్చిమ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ...

పోల్స్