Wednesday, August 5, 2026 03:34 AM
Wednesday, August 5, 2026 03:34 AM

సిఎం మార్పు ఖాయమే..? వదలని డిప్యూటి సిఎం..!

కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పు ఖాయమేనా..? అంటే అవుననే అంటున్నాయి కాంగ్రెస్ వర్గాలు. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి నేటికి రెండున్నర ఏళ్ళు పూర్తి కాగా.. ముఖ్యమంత్రిని మార్చే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. నవంబర్ విప్లవం కన్నడ రాజకీయాల్లో రాబోతుంది అనే ప్రచారం ఉంది. ప్రస్తుత ముఖ్యమంత్రి సిద్దరామయ్యను మార్చాల్సిందే అనే డిమాండ్ ను ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ చేస్తూ వస్తున్నారు. కర్ణాటకలో డీకే బలమైన నాయకుడిగా ఉన్నారు.

Also Read : అక్కడ హిడ్మాపై అభిమానం చూస్తే.. షాక్ అవ్వాల్సిందే..!

కాంగ్రెస్ అధికారంలోకి రావడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. నమ్మకమైన నేతగా కూడా ఆయనకు కాంగ్రెస్ లో గుర్తింపు ఉన్న సంగతి తెలిసిందే. గతంలో కూడా ముఖ్యమంత్రి కావాలని డీకే ప్రయత్నాలు చేసినా.. పెద్దగా ఫలించలేదు. ఇక ఇప్పుడు డీకే ఎలాగైనా సరే అధికార పీఠంపై కూర్చోవాలని పట్టుదలగా ఉన్నారు. ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం తనకు ముఖ్యమంత్రి కావాల్సిందే అనే డిమాండ్ చేస్తున్నారు. దీనితో గత రెండు రోజుల నుంచి ఆయన ఢిల్లీలోనే ఉన్నారు.

Also Read : బంగారు వర్ణం లో మెరిసిపోతున్న దిశా పటానీ

కాంగ్రెస్ అగ్ర నాయకులతో వరుసగా భేటీ అవుతున్నారు. అయితే రాష్ట్రంలో అధికార మార్పు ఉండదు అంటూ సిఎం చెప్తూ వస్తున్నారు. కానీ డీకే మాత్రం.. తనకు సిఎం కుర్చీ ఇస్తే మరోసారి ఖచ్చితంగా పార్టీని అధికారంలోకి తీసుకు వస్తా అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. కానీ ప్రస్తుతం కాంగ్రెస్ ఇబ్బందుల్లో ఉండటంతో కొత్త తలనొప్పి దిశగా అడుగులు వేస్తుందా అనేది చూడాలి. బీహార్ ఎన్నికల ఓటమి తర్వాత కాంగ్రెస్ ఈ తలనొప్పి తెచ్చుకుంటుందా అనేది ఆసక్తిని రేపే అంశం.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

వైసీపీ లో బోరుగడ్డ...

అధికారంలో ఉన్నప్పుడు కళ్లు నెత్తికి ఎక్కాయి....

రాజకీయాల్లోకి త్రిష..? సీఎం...

తమిళనాడు రాజకీయాల్లో గత రెండు రోజులుగా...

జగన్ పర్యటన దెబ్బ.....

ఉత్తరాంధ్ర రాజకీయాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ...

బ్రేకింగ్: విజయ్ పై...

తమిళనాడు రాజకీయాలు ఒక్కసారిగా తీవ్ర ఉత్కంఠగా...

దమ్ముంటే పట్టుకోండి చూద్దాం.....

ఏపీలో కూటమి సర్కార్ అధికారంలో ఉందో.....

మళ్లీ మొదలైన కావేరీ...

దక్షిణ భారతదేశంలో దశాబ్దాలుగా నలుగుతున్న కావేరీ...

పోల్స్