Sunday, June 21, 2026 02:44 AM
Sunday, June 21, 2026 02:44 AM

అక్కడ హిడ్మాపై అభిమానం చూస్తే.. షాక్ అవ్వాల్సిందే..!

మావో అగ్ర నేత మాడ్వీ హిద్మా.. ఎన్కౌంటర్ లో ప్రాణాలు కోల్పోవడంతో.. అతని స్వగ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. 17 ఏళ్ళ వయసులో తుపాకి పట్టిన ఈ గిరిజన నాయకుడికి.. అక్కడి స్థానికుల్లో హీరో ఇమేజ్ ఉండేది. ఛత్తీస్‌గఢ్‌లోని పువర్తిలో జన్మించి.. సెంట్రల్ కమిటీ వరకు ఎదిగిన అతని ప్రస్తానం అక్కడి గిరిజనుల్లో.. ఎంతో ఆదర్శంగా చెప్పుకుంటూ ఉంటారు. ఇక అతని మరణ వార్త తెలిసిన తర్వాత.. పూవర్తితో పాటుగా చత్తీస్ఘడ్ లోని గిరిజన ప్రాంతాల్లో తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి.

Also Read : బ్రేకింగ్: చెవిరెడ్డికి బిగ్ షాక్.. ఆ ముగ్గురి బెయిల్ రద్దు..

దక్షిణ సుక్మా జిల్లాలోని పూవర్తి గ్రామంలోని 50 ఇళ్లకు గాను సగానికి పైగా ఇళ్లకు తాళాలు వేసి ఉండటం చూసి పోలీసులు కూడా షాక్ అయ్యారు. గ్రామస్తులు అందరూ ఒకచోట కూర్చుని.. హిడ్మా గురించి చర్చించుకుంటున్నారు అని.. దండకరణ్యంలో తిరిగే జర్నలిస్ట్ లు చెప్తున్నారు. నడవలేని స్థితిలో ఉన్న హిడ్మా తల్లి మాంజు.. ఇటీవల తన కొడుకు తుపాకి వదిలిపెట్టాలని కోరిన సంగతి తెలిసిందే. అతని మృతదేహం వచ్చే వరకు బంధువులు అందరూ ఎదురు చూస్తూనే కూర్చున్నారట.

Also Read : బ్రేకింగ్: రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీం షాక్..!

బుధవారం రాత్రి దాటిన తర్వాత మృతదేహం చేరుకుంది. కేవలం 50 ఇళ్లున్న ఈ చిన్న గ్రామం నుంచి హిడ్మా ఏకంగా 90 మంది యువకులను మావోయిస్టులుగా మార్చి సంచలనం సృష్టించాడు. ఈ గ్రామానికి చెందిన మరో వాంటెడ్ మావోయిస్టు బార్స దేవా, హిడ్మా తర్వాత కీలక నేతగా ఎదిగాడు. మావోయిస్టుల పూర్తి నియంత్రణలో ఉన్న ఈ ప్రాంతంలో దశాబ్దాల తర్వాత ఏడాది కిందట సీఆర్‌పీఎఫ్ బేస్ క్యాంపును ఏర్పాటు చేయడంతో క్రమంలో మావోయిస్ట్ లు ఖాళీ చేసారు. గత ఏడాది లోక్‌సభ ఎన్నికల్లో పువర్తి పోలింగ్ బూత్ పరిధిలోని 547 ఓట్లకు గాను కేవలం 31 ఓట్లు పోల్ కావడం గమనార్హం. ఈ గ్రామం నుంచి ఒక్క ఓటు కూడా పడలేదు అంటే అతని ప్రభావం ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

తిరుపతిలో కేఎఫ్‌సీ, డొమినోస్‌...

ప్రముఖ అంతర్జాతీయ ఫుడ్ బ్రాండ్ల ఆహార...

తిరుపతిలో వడ్డీ మాఫియా.....

తిరుపతి నగరంలో వడ్డీ వ్యాపారం పేరుతో...

సాయికృష్ణ కేసులో వైసీపీ...

విజయవాడ రౌడీ షీటర్‌ గాదె సాయికృష్ణ...

బ్రేకింగ్: అల్లు అర్జున్‌...

హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సంధ్య...

తెలంగాణాలో జనసేన తొలి...

గత కొన్నాళ్ళుగా తెలంగాణాలో పార్టీ బలోపేతం...

బ్రేకింగ్: కొడాలి అరెస్ట్...

ఏపీలో వైసీపీ కీలక నేతలకు చట్టపరమైన...

పోల్స్