Wednesday, August 5, 2026 06:44 AM
Wednesday, August 5, 2026 06:44 AM

మళ్ళీ మావోల రిక్రూట్మెంట్.. ఏపీ పోలీసుల సంచలనం..!

మావోయిస్ట్ పార్టీ మరోసారి తన బలాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తోందా..? అంటే అవుననే అంటున్నాయి భద్రతా బలగాలు. ఇటీవలి కాలంలో వరుస ఎన్కౌంటర్ లు, అరెస్ట్ లు, లొంగుబాట్లతో కుదేలు అవుతూ వస్తోన్న మావోయిస్ట్ పార్టీ.. గత రెండు రోజుల నుంచి జరిగిన పరిణామాలతో కీలక నాయకత్వాన్ని కోల్పోయింది. పార్టీని అంచెలు అంచెలుగా బలోపేతం చేసిన నాయకత్వం.. ప్రాణాలు కోల్పోయే పరిస్థితి రావడంతో.. పార్టీ భవిష్యత్తు ఏంటీ అనే దానిపై ఒక స్పష్టత రాలేని పరిస్థితి ఉంది.

Also Read : పోల్: ఇమ్మడి రవి అరెస్ట్ తో సినీ పైరసీ నిజంగానే ఆగుతుందా?

కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన ప్రకటన తర్వాత.. బలగాలు దూకుడుగా వెళ్తున్నాయి. ఇలాంటి సమయంలో రిక్రూట్మెంట్ అనేది సాధ్యం అయ్యే పని కాదు. కానీ మావోయిస్ట్ లు మాత్రం తమ బలగాలను బలోపేతం చేసే అడుగులు వేస్తున్నట్టు పోలీసులు సంచలన ప్రకటన చేసారు. ఏవోబీలో మళ్లీ మావోయిస్టు రిక్రూట్‌మెంట్‌ జరుగుతోందని అల్లూరి జిల్లా ఎస్పీ అమిత్‌ బర్దర్‌ సంచలన ప్రకటన చేసారు. ఇక్కడ షెల్టర్‌ జోన్‌గా చేసుకోవాలని మావోయిస్టులు భావిస్తున్నారని అన్నారు.

Also Read : సైఫ్ ఒక్క ప్యాలెస్ విలువ తెలిస్తే మైండ్ బ్లాక్..!

మారేడుమిల్లి ఎన్కౌంటర్ తర్వాత ఆయన కీలక వ్యాఖ్యలు చేసారు. అటవీప్రాంతంలో మూడు రోజులుగా కూంబింగ్‌ కొనసాగుతోందని తెలిపారు. వాళ్లు వచ్చింది షెల్టర్‌ జోన్‌ కోసమే.. లొంగిపోవడానికి కాదని వ్యాఖ్యానించారు. నిన్న తెల్లవారుజామున ఎన్‌కౌంటర్‌ జరిగింది.. కాల్పుల్లో ఏడుగురు మావోయిస్టులు చనిపోయారని, ఎన్‌కౌంటర్‌లో టెక్‌ శంకర్‌ కూడా మృతిచెందారని తెలిపారు. ఘటనాస్థలంలో భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నామని, మరికొందరు మావోలు ఈ ప్రాంతంలో తిష్ట వేసారని ఆయన వ్యాఖ్యానించారు. అయితే ఈ వ్యాఖ్యలను మాజీలు కొట్టిపారేస్తున్నారు. మావోయిస్ట్ పార్టీ మనుగడే ప్రశ్నార్ధకం అయిన సమయంలో.. రిక్రూట్మెంట్ ఎలా సాధ్యమవుతుందని, ఆయుధాల కొరత ఎక్కువగా ఉందని వ్యాఖ్యానిస్తున్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

వైసీపీ లో బోరుగడ్డ...

అధికారంలో ఉన్నప్పుడు కళ్లు నెత్తికి ఎక్కాయి....

రాజకీయాల్లోకి త్రిష..? సీఎం...

తమిళనాడు రాజకీయాల్లో గత రెండు రోజులుగా...

జగన్ పర్యటన దెబ్బ.....

ఉత్తరాంధ్ర రాజకీయాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ...

బ్రేకింగ్: విజయ్ పై...

తమిళనాడు రాజకీయాలు ఒక్కసారిగా తీవ్ర ఉత్కంఠగా...

దమ్ముంటే పట్టుకోండి చూద్దాం.....

ఏపీలో కూటమి సర్కార్ అధికారంలో ఉందో.....

మళ్లీ మొదలైన కావేరీ...

దక్షిణ భారతదేశంలో దశాబ్దాలుగా నలుగుతున్న కావేరీ...

పోల్స్