Wednesday, August 5, 2026 06:54 AM
Wednesday, August 5, 2026 06:54 AM

బ్యాంకు స్టేట్మెంట్ తో అడ్డంగా దొరికిన జోగి..?

ఆంధ్రప్రదేశ్ లో మద్యం వ్యవహారం తీవ్ర సంచలనం అవుతోంది. కల్తీ మద్యం, లిక్కర్ స్కాం వ్యవహారాలలో రోజు రోజుకి సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఎప్పుడు ఎవరిని అరెస్ట్ చేస్తారో అర్ధం కాక నిందితుల్లో కూడా ఆందోళన మొదలైంది. నిన్న లిక్కర్ స్కాంలో మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సంబంధించిన ఆస్తులను జప్తు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ఇక ఆ తర్వాతి నుంచి మరికొన్ని పరిణామాలు జరిగాయి. ఈ కేసులో నిందితులుగా ఉన్న ముగ్గురు కీలక వ్యక్తుల బెయిల్ రద్దు అయింది.

Also Read : అంతా నా ఇష్టం అంటున్న జగన్

ఇక కల్తీ మద్యం వ్యవహారంలో ఇప్పటికే మాజీ మంత్రి జోగి రమేష్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో ఇతర రాష్ట్రాలకు చెందిన వారిపై కూడా అధికారులు గురి పెడుతూ వచ్చారు. ఇదిలా ఉంచితే ఇప్పుడు మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. నిన్న తూర్పు ఎక్సైజ్‌ ఆఫీసులో అద్దేపల్లి బ్రదర్స్‌ను ప్రశ్నించిన ఎక్సైజ్‌ పోలీసులు.. కీలక విషయాలను రాబట్టారు. తొలిరోజు కస్టడీలో కీలక విషయాలను ఆ ఇద్దరూ చెప్పినట్టు తెలుస్తోంది. అద్దేపల్లి బ్రదర్స్‌ బ్యాంకు ఖాతాల వివరాలపై ఎక్సైజ్‌ పోలీసుల ప్రశ్నలు వేసారట.

Also Read : చలికాలంలో వేడి నీటి స్నానం – జాగ్రత్తలు మర్చిపోతే ఇబ్బందులే

జోగి బ్రదర్స్‌ మరియు అద్దేపల్లి బ్రదర్స్‌ మధ్య ఆర్థిక లావాదేవీలు ఉన్నట్లు వెల్లడి అయింది. పెద్ద మొత్తంలో నగదు విత్‌ డ్రాలపై అద్దేపల్లి బ్రదర్స్‌కు ఎక్సైజ్‌ పోలీసులు ప్రశ్నలు సంధించారు. నకిలీ, అక్రమ మద్యం ముడుపులు జోగి బ్రదర్స్‌ కు ఇచ్చినట్లు అద్దేపల్లి బ్రదర్స్‌ అంగీకరించారు. 5 రోజులపాటు అద్దేపల్లి బ్రదర్స్‌ను ఎక్సైజ్‌ పోలీసులు ప్రశ్నించే అవకాశం కనపడుతోంది. నేడు రెండో రోజు కూడా అద్దేపల్లి బ్రదర్స్‌ విచారణ కొనసాగనుంది. అయితే తనకు అద్దేపల్లి బ్రదర్స్ తో సంబంధం లేదంటూ జోగి రమేష్ చెప్పిన సంగతి తెలిసిందే.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

వైసీపీ లో బోరుగడ్డ...

అధికారంలో ఉన్నప్పుడు కళ్లు నెత్తికి ఎక్కాయి....

రాజకీయాల్లోకి త్రిష..? సీఎం...

తమిళనాడు రాజకీయాల్లో గత రెండు రోజులుగా...

జగన్ పర్యటన దెబ్బ.....

ఉత్తరాంధ్ర రాజకీయాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ...

బ్రేకింగ్: విజయ్ పై...

తమిళనాడు రాజకీయాలు ఒక్కసారిగా తీవ్ర ఉత్కంఠగా...

దమ్ముంటే పట్టుకోండి చూద్దాం.....

ఏపీలో కూటమి సర్కార్ అధికారంలో ఉందో.....

మళ్లీ మొదలైన కావేరీ...

దక్షిణ భారతదేశంలో దశాబ్దాలుగా నలుగుతున్న కావేరీ...

పోల్స్