Saturday, September 19, 2026 12:02 PM
Saturday, September 19, 2026 12:02 PM

చలికాలంలో వేడి నీటి స్నానం – జాగ్రత్తలు మర్చిపోతే ఇబ్బందులే

చలికాలంలో వేడి నీటితో స్నానం చేయడం చాలామందికి ఎంతో సౌకర్యంగా అనిపిస్తుంది. శరీరానికి వెంటనే వేడి ఇవ్వడంతో పాటు చల్లదనం వల్ల కలిగే అసౌకర్యాన్ని తగ్గిస్తుంది. అయితే International Journal of Scientific Research and Engineering Development లో ప్రచురితమైన ఒక పరిశోధన ప్రకారం, అత్యంత వేడి నీటితో స్నానం చేయడం చర్మంలోని కెరటిన్ కణాలను దెబ్బతీసే ప్రమాదం ఉంది. ఈ కెరటిన్ పొర చర్మాన్ని బయటి ప్రభావాల నుంచి రక్షించే కీలకమైన భాగం. ఇది దెబ్బతింటే చర్మం బలహీనపడటమే కాకుండా, ఎక్జిమా, సోరీయాసిస్ వంటి ఇప్పటికే ఉన్న సమస్యలు వృద్ధి చెందే అవకాశం ఉంటుంది. డెర్మటాలజిస్టులు కూడా రోజూ అధిక ఉష్ణోగ్రత ఉన్న నీటితో స్నానం చేయడం ఎన్నో చర్మ సమస్యలకు దారితీస్తుందని హెచ్చరిస్తున్నారు.

Also Read : సొంత పార్టీ నేతలపై జగన్ ఫైర్..!

మన చర్మంలో సహజంగా ఉండే సీబమ్‌, లిపిడ్స్‌ వంటి రక్షణాత్మక ఆయిల్స్‌ ధూళి, కాలుష్యం, బ్యాక్టీరియా నుంచి శరీరాన్ని కాపాడడంలో కీలక పాత్ర పోషిస్తాయి. కానీ వేడి నీటితో స్నానం చేసినప్పుడు ఈ సహజ ఆయిల్స్‌ తొలగిపోవడం ద్వారా చర్మం పొడిబారడం, రఫ్‌గా మారడం వంటి సమస్యలు వేగంగా కనిపిస్తాయి. సెన్సిటివ్ స్కిన్ ఉన్నవారిలో రెడ్‌నెస్, ఇరిటేషన్‌, మైక్రో క్రాక్స్ వంటి లక్షణాలు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. వేడి నీరు రక్తనాళాలను విస్తరింపజేసి చర్మంలోని నీటి నిల్వలను తగ్గించడంతో, శరీరం తేమను త్వరగా కోల్పోతుంది. దీని కారణంగా చర్మం మాదిరిగానే స్కాల్ప్ కూడా పొడిబారి, డ్రై డాండ్రఫ్‌ వంటి సమస్యలను తీవ్రతరం చేస్తుంది.

Also Read : బ్రేకింగ్: చెవిరెడ్డికి బిగ్ షాక్.. ఆ ముగ్గురి బెయిల్ రద్దు..

ఈ సమస్యలను నివారించేందుకు నిపుణులు గోరువెచ్చని నీటిని ఉపయోగించడం ఉత్తమమని సూచిస్తున్నారు. నీటి ఉష్ణోగ్రత చేతిపై వేసుకున్నప్పుడు అసౌకర్యం లేకుండా ఉండే స్థాయిలో ఉండాలి. స్నానం 10–15 నిమిషాలకు మించి చేయకపోవడం, స్నానం అయ్యిన వెంటనే మాయిశ్చరైజర్‌ వినియోగించడం, సెన్సిటివ్ స్కిన్ ఉన్నవారు సువాసనలేని మాయిశ్చరైజర్లు ఎంచుకోవడం వంటి చర్యలు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. ప్రత్యేకంగా చలికాలంలో శరీరం తేమను కోల్పోయే అవకాశం ఎక్కువ కావడంతో, వేడి నీటి వినియోగాన్ని నియంత్రించడం చాలా అవసరం. సరికొత్త అలవాట్లతో గోరువెచ్చని నీటితో స్నానం చేయడం ద్వారా శరీరం వేడిగా ఉండటమే కాకుండా, చర్మ ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవచ్చు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

25 రోజుల తర్వాత...

ఏపీ డిప్యూటి సీఎం, జనసేన అధినేత...

ఏపీలో మద్యం షాపుల...

ఆంధ్రప్రదేశ్‌లో 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను...

బాంబు పేల్చిన టీడీపీ...

గుంటూరు పశ్చిమ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ...

ఏపీ లిక్కర్ కుంభకోణం.....

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గత వైఎస్సార్ కాంగ్రెస్...

రేవంత్ దెబ్బ.. బీఆర్ఎస్‌కు...

ఏదో అనుకుంటే.. మరేదో జరిగినట్లు ఉంది...

దానం నాగేందర్ కు...

ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు తెలంగాణ...

పోల్స్