ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ఉత్కంఠ కొనసాగుతోంది. పంచాయతీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల ఎన్నికలకు ప్రభుత్వం సన్నాహాలు ముమ్మరం చేస్తున్నప్పటికీ.. బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల అంశం ఎన్నికల ప్రక్రియకు కీలకంగా మారింది. ఈ వ్యవహారంపై అక్టోబర్ 9న సుప్రీంకోర్టులో జరగనున్న విచారణపైనే ప్రస్తుతం ప్రధానంగా దృష్టి కేంద్రీకృతమైంది. స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోలను ఏపీ హైకోర్టు కొట్టివేసింది. అదే సమయంలో ఆరు వారాల్లో ఎన్నికల ప్రక్రియ ప్రారంభించాలని ఆదేశించింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేసింది.
Also Read : చంద్రబాబుకు పవన్ కళ్యాణ్ లిస్ట్..? మున్సిపల్ ఎన్నికల ముందే..!
అక్టోబర్ 9న ఈ అంశానికి సంబంధించిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టనుంది. ఇప్పటికే మధ్యంతర ఉపశమనం లభించకపోయినా.. తదుపరి విచారణకు తేదీ ఖరారైంది. దీంతో సుప్రీంకోర్టు తదుపరి ఆదేశాలు ఎలా ఉంటాయన్నది. స్థానిక ఎన్నికల షెడ్యూల్‌పైన ప్రభావం చూపే అంశంగా మారింది. మరోవైపు 34 శాతం బీసీ రిజర్వేషన్ల విషయంలో వెనక్కి తగ్గేది లేదని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. ఈ అంశంపై సుప్రీంకోర్టులో న్యాయపరమైన పోరాటం కొనసాగిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పటికే ప్రకటించారు. బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు స్పష్టత వచ్చిన తర్వాతే 123 మున్సిపాలిటీల్లో ఎన్నికల నిర్వహణపై నిర్ణయం తీసుకుంటామని మంత్రి నారాయణ వెల్లడించారు.
Also Read : చంద్రబాబు ఢిల్లీ టూర్ వెనుక మెయిన్ రీజన్ ఇదేనా..?
ఇదిలా ఉండగా.. ఎన్నికల నిర్వహణకు సంబంధించి అధికార యంత్రాంగం ఒకవైపు, రాజకీయ పార్టీలు మరోవైపు సన్నాహాలు ప్రారంభించినట్లు చర్చ సాగుతోంది. ఎమ్మెల్యేలు, మంత్రులు స్థానికంగా పార్టీ శ్రేణులను ఎన్నికలకు సిద్ధం చేయడంపై దృష్టి పెడుతున్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అయితే ఎన్నికల నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది? బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు అమలవుతాయా? లేక న్యాయస్థానాల ఆదేశాలకు అనుగుణంగా రిజర్వేషన్లలో మార్పులు ఉంటాయా? అనేది ఇప్పుడు కీలక ప్రశ్నగా మారింది. అక్టోబర్ 9న సుప్రీంకోర్టు విచారణ తర్వాత వెలువడే ఆదేశాల ఆధారంగానే రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్ర ఎన్నికల సంఘం తదుపరి అడుగులు వేయనున్న నేపథ్యంలో.. ఏపీలో స్థానిక ఎన్నికలపై ఉత్కంఠ కొనసాగుతోంది.


