Saturday, September 19, 2026 08:29 AM
Saturday, September 19, 2026 08:29 AM

బన్నీ సర్ ప్రైజ్.. టైటిల్, టీజర్ అనౌన్స్‌మెంట్‌ కు ముహూర్తం ఫిక్స్..!

పుష్ప సీరీస్ తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్ పాన్ ఇండియా లెవెల్ లో పెరిగింది. ఆ సినిమాతో బాక్సాఫీస్ పై యుద్ధం చేసిన అల్లు అర్జున్.. ఆ తర్వాతి నుంచి ఏ సినిమా చేస్తాడు అంటూ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ఇక ఈ టైం లో ఓ క్రేజీ న్యూస్ ఫ్యాన్స్ కు ఫుల్ జోష్ ఇస్తోంది. ఏప్రిల్ 8న బన్నీ పుట్టినరోజు సందర్భంగా తదుపరి ప్రాజెక్ట్ గురించి ఒక సంచలన ప్రకటన రాబోతోందని టాలీవుడ్ వర్గాల్లో టాక్ నడుస్తోంది.

Also Read : అమరావతి కోసం మహిళా ఎంపీలు.. రాష్ట్రానికి సంబంధం లేకపోయినా..!

స్టార్ డైరెక్టర్ అట్లీతో అల్లు అర్జున్ చేయబోయే సినిమా టైటిల్, స్పెషల్ టీజర్‌ను ఆరోజే విడుదల చేయబోతున్నట్లు నిర్మాత బన్నీ వాసు హింట్ ఇచ్చారు. జవాన్ సినిమాతో బాక్సాఫీస్‌ ను షేక్ చేసిన అట్లీ, ఇప్పుడు అల్లు అర్జున్‌ తో ఒక భారీ యాక్షన్ ఎంటర్టైనర్‌ ను ప్లాన్ చేసాడు. గత కొన్నాళ్లుగా వీరిద్దరి కాంబినేషన్‌ పై సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వస్తున్నప్పటికీ, అధికారికంగా మాత్రం క్లారిటీ లేదు. అయితే, బన్నీ పుట్టినరోజున ఈ సస్పెన్స్‌ కు తెరదించుతూ సినిమా టైటిల్‌ ను ప్రకటించడమే కాకుండా, ఒక పవర్‌ ఫుల్ వీడియోను కూడా వదలాలని మేకర్స్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

Also Read : మాట, మర్యాద గురించి పేర్ని నోట నీతి మాటలు..!

ఈ సినిమాను గీతా ఆర్ట్స్, సన్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మించనున్నట్లు సమాచారం. మొత్తానికి అట్లీ మార్క్ మాస్ ఎలివేషన్స్‌తో బన్నీని చూడాలని ఆశిస్తున్న ఫ్యాన్స్‌ కు, ఏప్రిల్ 8న ఒక అదిరిపోయే సమాధానం దొరకనుందని టాక్. పుష్ప 2 తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకున్న బన్నీ, ఈ అట్లీ ప్రాజెక్ట్‌ తో మళ్ళీ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాయాలని చూస్తున్నాడు. ఈ సినిమాను తెలుగుతో పాటుగా, తమిళ, హిందీ భాషల్లో ఒకేసారి షూట్ చేస్తారని టాక్.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

రేవంత్ దెబ్బ.. బీఆర్ఎస్‌కు...

ఏదో అనుకుంటే.. మరేదో జరిగినట్లు ఉంది...

దానం నాగేందర్ కు...

ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు తెలంగాణ...

ఎల్‌నినో పై బాబు...

ఎల్‌నినో ప్రభావంతో ఏర్పడిన కరవు పరిస్థితులను...

సనాతన ధర్మం.. చేప...

'దుర్గాపూజ సమయంలో బెంగాలీ హిందువులు మాంసాహారానికి...

వైసీపీలో విచిత్ర పరిస్థితి.....

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల వేడి...

నిర్ణయం చంద్రబాబు.. పవన్...

ఆంధ్రప్రదేశ్‌లో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలపై...

పోల్స్