Saturday, September 19, 2026 09:29 AM
Saturday, September 19, 2026 09:29 AM

పాకిస్థాన్‌ లో చర్చలకు ఇరాన్ నో.. నిలిచిపోయిన శాంతి ప్రయత్నాలు..!

అమెరికా – ఇరాన్ మధ్య కొనసాగుతున్న భీకర యుద్ధాన్ని ఆపేందుకు జరుగుతున్న దౌత్యపరమైన ప్రయత్నాలకు పాకిస్థాన్‌ లో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఉద్రిక్తతలను తగ్గించేందుకు పాకిస్థాన్ వేదికగా అమెరికా అధికారులతో ముఖాముఖి సమావేశం కావాలన్న ప్రతిపాదనను ఇరాన్ ప్రభుత్వం తిరస్కరించింది. తాజా నివేదికల ప్రకారం, పాకిస్థాన్ మధ్యవర్తిత్వం వహించి ఇరు దేశాల ప్రతినిధులను ఒకే వేదికపైకి తీసుకురావాలని ప్రయత్నించింది. అయితే, అమెరికా తన దూకుడును తగ్గించకుండా, వరుస దాడులు చేస్తున్న తరుణంలో చర్చలకు కూర్చోవడం సాధ్యం కాదని ఇరాన్ స్పష్టం చేసింది.

Also Read : మాట, మర్యాద గురించి పేర్ని నోట నీతి మాటలు..!

ముఖ్యంగా అమెరికా యుద్ధ విమానాల కూల్చివేత, క్షేత్రస్థాయిలో పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో, ఇరాన్ చర్చల కంటే యుద్ధ క్షేత్రంలోనే తేల్చుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీనితో తక్షణమే కాల్పుల విరమణ జరిగే అవకాశాలు తగ్గిపోయాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇస్లామాబాద్‌ లో జరగాల్సిన ఈ కీలక భేటీ విఫలం కావడంతో, యుద్ధం మరికొన్ని వారాల పాటు కొనసాగే ప్రమాదం ఉందని అంతర్జాతీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. పాకిస్థాన్ చేసిన ఈ శాంతి ప్రయత్నం విఫలం కావడం దౌత్యపరంగా ఆందోళన కలిగించే అంశం.

Also Read : అంచనాలు పెంచిన ‘రామాయణ’ టీజర్ బడ్జెట్ వింటే షాక్..!

ఇరాన్ చర్చలకు నిరాకరించినప్పటికీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రం దీనిని పెద్ద అడ్డంకిగా భావించడం లేదట. ప్రస్తుతానికి పాకిస్థాన్ వేదికగా జరగాల్సిన దౌత్య మార్గాలు మూసుకుపోవడంతో, యుద్ధం తీవ్రత ఎలా ఉంటుందా అనే ఆందోళన మొదలైంది. ఇక యుద్దాన్ని ముగించేందుకు టర్కీ, ఈజిప్ట్ కూడా తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నాయి. అటు సౌదీ యువరాజుతో కూడా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చర్చలు జరిపారు. కాల్పుల విరమణ గురించి ఇరాన్ తో చర్చించాలని కోరినట్లు తెలుస్తోంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

ఏపీ లిక్కర్ కుంభకోణం.....

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గత వైఎస్సార్ కాంగ్రెస్...

రేవంత్ దెబ్బ.. బీఆర్ఎస్‌కు...

ఏదో అనుకుంటే.. మరేదో జరిగినట్లు ఉంది...

దానం నాగేందర్ కు...

ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు తెలంగాణ...

ఎల్‌నినో పై బాబు...

ఎల్‌నినో ప్రభావంతో ఏర్పడిన కరవు పరిస్థితులను...

సనాతన ధర్మం.. చేప...

'దుర్గాపూజ సమయంలో బెంగాలీ హిందువులు మాంసాహారానికి...

వైసీపీలో విచిత్ర పరిస్థితి.....

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల వేడి...

పోల్స్