Saturday, September 19, 2026 10:16 AM
Saturday, September 19, 2026 10:16 AM

లోకేష్ సింధనూరు యాత్రకు ఊహించని రెస్పాన్స్..!

కర్ణాటకలోని సింధనూరులో ఏపీ ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పర్యటనకు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. దశాబ్దాలుగా అక్కడ స్థిరపడ్డ తెలుగు వారు లోకేష్ కు అడుగడుగునా.. బ్రహ్మరథం పట్టారు. దీనితో.. పట్టణంలోని ప్రధాన రహదారులన్నీ పసుపు రంగు పులుముకున్నాయి. వేలాది మంది యువకులు, మహిళలు పెద్ద ఎత్తున లోకేష్ ను చూసేందుకు రావడంతో.. భారీగా ట్రాఫిక్ జాం ఏర్పడటం గమనార్హం. దారిపొడవునా మహిళలు, వృద్ధులు సైతం లోకేష్‌ కు హారతులు పట్టి, పూల వర్షం కురిపిస్తూ తమ అభిమానాన్ని చాటుకున్నారు.

Also Read : వైసీపీలో ముసలం.. మీ ఇష్టం అన్న సజ్జల..!

ఈ పర్యటనలో భాగంగా నిర్వహించిన కార్యక్రమాలు కూడా విశేషంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా పీడబ్ల్యూడీ క్యాంప్ వద్ద తెలుగు యువత భారీ గజమాలతో లోకేష్‌ కు స్వాగతం పలకగా, అశోక్ భవన్ సర్కిల్ వద్ద సింధనూరు ఎమ్మెల్యే హంపన్నగౌడ ఆధ్వర్యంలో ఘన సత్కార కార్యక్రమం నిర్వహించారు. ఎంజీ సర్కిల్ నుంచి హోసళ్లీ క్యాంపు వరకు సాగిన భారీ బైక్ ర్యాలీ ఈ పర్యటనలో హైలైట్‌ గా నిలిచింది. వేలాది బైక్‌లతో యువత కదం తొక్కుతుంటే, వారందరినీ ఉత్సాహపరుస్తూ లోకేష్ ముందుకు కదిలారు.

Also Read : వాళ్ళను సస్పెండ్ చేస్తా.. చంద్రబాబు కీలక వ్యాఖ్యలు..!

ఇక ఈ కార్యక్రమం రాజకీయంగానూ ప్రాధాన్యత సంతరించుకుంది. మంత్రి లోకేష్‌ తో పాటు కేంద్ర ఉక్కుశాఖ మంత్రి హెచ్.డి. కుమారస్వామి, కేంద్ర రక్షణశాఖ సహాయ మంత్రి సంజయ్ సేథ్ స్వయంగా బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. అధికంగా ఉండే ఈ ప్రాంతంలో లోకేష్ పర్యటనకు లభించిన ఈ ఆదరణ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణ కోసం లోకేష్ వెళ్ళడం, ఈ స్థాయిలో తెలుగు ప్రజల నుంచి పెద్ద ఎత్తున రెస్పాన్స్ రావడంతో.. కన్నడ రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చలు మొదలయ్యాయి.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

బాంబు పేల్చిన టీడీపీ...

గుంటూరు పశ్చిమ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ...

ఏపీ లిక్కర్ కుంభకోణం.....

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గత వైఎస్సార్ కాంగ్రెస్...

రేవంత్ దెబ్బ.. బీఆర్ఎస్‌కు...

ఏదో అనుకుంటే.. మరేదో జరిగినట్లు ఉంది...

దానం నాగేందర్ కు...

ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు తెలంగాణ...

ఎల్‌నినో పై బాబు...

ఎల్‌నినో ప్రభావంతో ఏర్పడిన కరవు పరిస్థితులను...

సనాతన ధర్మం.. చేప...

'దుర్గాపూజ సమయంలో బెంగాలీ హిందువులు మాంసాహారానికి...

పోల్స్