Thursday, May 21, 2026 06:32 PM
Thursday, May 21, 2026 06:32 PM

వాళ్ళను సస్పెండ్ చేస్తా.. చంద్రబాబు కీలక వ్యాఖ్యలు..!

క్రమశిక్షణకు మారుపేరుగా చెప్పుకునే టీడీపీలో ఇటీవలి పరిణామాలు తలనొప్పిగా మారాయి. రాజకీయంగా ఈ పరిణామాలు వైసీపీకి అనుకూలంగా మారతాయనే ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. ఈ తరుణంలో తాజాగా.. పార్టీలో క్రమశిక్షణ విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు మరోసారి తన కఠిన వైఖరిని స్పష్టం చేశారు. పార్టీ ప్రతిష్ఠకు భంగం కలిగించేలా ప్రవర్తించే వారు ఎంతటి వారైనా సరే ఉపేక్షించేది లేదని ఆయన తేల్చి చెప్పారు. శనివారం నరసరావుపేట ఎమ్మెల్యే అరవిందబాబు ఇచ్చిన వివరణపై చర్చ సందర్భంగా సీఎం చంద్రబాబు పార్టీ నేతలను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు.

Also Read : బ్రేకింగ్; ఏపీ ప్రజలకు కేంద్రం మరో గుడ్ న్యూస్..!

ఇటీవల చోటుచేసుకున్న కొన్ని పరిణామాలపై నరసరావుపేట ఎమ్మెల్యే అరవిందబాబు పార్టీ అధిష్ఠానానికి తన వివరణ ఇచ్చారు. ఈ వివరణను టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు.. చంద్రబాబు ముందుంచారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రవర్తన, పార్టీలోని కొందరు నేతల తీరుపై సుదీర్ఘంగా చర్చ జరిగింది. కొందరు నేతల వ్యవహారశైలి వల్ల పార్టీకి, ప్రభుత్వానికి అనవసరమైన చెడ్డపేరు వస్తోందని ముఖ్యమంత్రి అసహనం వ్యక్తం చేశారు. ఈ చర్చ సందర్భంగా సీఎం చంద్రబాబు నేతలకు గట్టి హెచ్చరికలు జారీ చేశారు.

Also Read : అమెరికా కు షాక్ ఇచ్చిన ఇరాన్..!

కొందరి వ్యక్తిగత ప్రయోజనాల కోసం లేదా స్వార్థ రాజకీయాల కోసం దశాబ్దాల చరిత్ర ఉన్న పార్టీని పణంగా పెట్టేందుకు నేను సిద్ధంగా లేనని స్పష్టం చేసారు. పార్టీ క్రమశిక్షణ అనే గీతను దాటి ప్రవర్తించే వారిని ఇకపై భరించే ప్రసక్తే లేదని చంద్రబాబు చెప్పినట్లు తెలుస్తోంది. నేతల వ్యక్తిగత అజెండాల కంటే పార్టీ ప్రయోజనాలే మిన్న అని ఆయన గుర్తు చేశారు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులకు లేదా పార్టీ కార్యక్రమాలకు అడ్డుపడేలా ప్రవర్తిస్తే కఠిన చర్యలు ఉంటాయని చంద్రబాబు హెచ్చరించారు. పార్టీకి గానీ, ప్రభుత్వానికి గానీ ఎవరైనా చెడ్డపేరు తెస్తే.. అటువంటి వారి విషయంలో రెండోసారి ఆలోచించకుండా తక్షణమే సస్పెండ్ చేసేస్తా అని చెప్పడం గమనార్హం. అధికారంలో ఉన్నామని విర్రవీగకుండా, ప్రజలకు సేవ చేయడమే లక్ష్యంగా పనిచేయాలని నేతలకు సూచించారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

ఐఏఎస్‌ల అలక.. మంత్రులకు...

తెలంగాణలో మంత్రులకు, ఐఏఎస్‌లకు మధ్య కోల్డ్...

సీమపై గురిపెట్టిన లోకేష్..!

ఏపీ ఐటీ శాఖా మంత్రి నారా...

బండి సంజయ్ కి...

"పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినపుడె పుట్టదు....

వైసీపీ కి షాక్...

తాజాగా మాజీ ముఖ్యమంత్రి జగన్ మీడియా...

అమెరికాలో ఐటీ ఉద్యోగులకు...

అమెరికాలో స్థిరపడిన విదేశీ ఐటీ ఉద్యోగులకు,...

విశాఖకు కేంద్రం బిగ్...

ఐటీ రంగానికి హబ్ గా మారుతోన్న...

పోల్స్