Tuesday, August 11, 2026 01:09 AM
Tuesday, August 11, 2026 01:09 AM

విమాన ఫ్యూయల్ స్విచ్ లు ఆపేసింది ఎవరు..?

ఘోర విషాదాన్ని మిగిల్చిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అహ్మదాబాద్ విమానాశ్రయం సమీపంలో కూలిపోయిన విమానం దర్యాప్తులో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. బ్లాక్ బాక్స్ లోని డేటాను డౌన్లోడ్ చేసిన తర్వాత కేంద్ర దర్యాప్తు సంస్థలు విచారణ వేగవంతం చేసాయి. విమాన ప్రమాదం గురించి ప్రాథమిక నివేదికలో, టేకాఫ్ తర్వాత ఇంజిన్ల ఇంధన స్విచ్‌లు ఒకదానికొకటి కొన్ని సెకన్ల వ్యవధిలో ‘RUN’ నుండి ‘CUTOFF’కి మారాయని వెల్లడించారు.

Also Read : ముందుగా క్యాన్సర్‌ను గుర్తించడం ఎలా? ప్రాణాలను రక్షించే కీలక సమాచారం

ఈ ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్న ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో శనివారం తెల్లవారుజామున ఈ 15 పేజీల నివేదికను ప్రచురించింది. “మీరు ఎందుకు స్విచ్ ఆపేశారు?” అంటూ ఒక పైలెట్ మరొక పైలెట్ ను అడగడం కాక్‌పిట్ వాయిస్ రికార్డింగ్‌లో వినపడింది. మరో పైలట్ తాను అలా చేయలేదని సమాధానం ఇచ్చారు. అసలు ఇంధన సరఫరా ను ఎందుకు ఆపేశారు, ఎవరు ఆపేశారు అనేది ఆసక్తికరంగా మారిన అంశం. విమానం బయల్దేరిన సెకన్ల వ్యవధిలో.. విమానం యొక్క రెండు ఇంజిన్‌ల స్విచ్‌లు రన్ నుండి కట్ ఆఫ్ కు మార్చేసారు.

Also Read : పవన్.. ప్రశ్నించడం మర్చిపోయావా?

మళ్ళీ ఆ వెంటనే.. కట్ ఆఫ్ నుండి రన్ కు మార్చే ప్రయత్నం చేసినా.. అప్పటికే సమయం చేజారిపోయింది. పరిస్థితి తమ చేతుల్లో లేదని భావించిన పైలెట్ లు మేడే కాల్ ఇచ్చారు. ఆ తర్వాత ఎయిర్ ట్రాఫిక్.. వారి నుంచి సమాచారం కోసం ప్రయత్నం చేసింది. అయినా సరే రిప్లే మాత్రం రాలేదు. ఆ వెంటనే విమానం కూలిపోవడాన్ని అధికారులు స్వయంగా చూసారు. ఈ విమానం కేవలం 32 సెకన్ల పాటు మాత్రమే గాల్లో ఎగిరింది. వాయిస్ రికార్డర్ లో అంతకు మించిన సమాచారం లేదని జాతీయ మీడియా వెల్లడించింది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

మెట్రో రైల్ కూతకు...

ఏపీలో మెట్రో రైలు ప్రాజెక్టు పనులు...

దామచర్లపై బాలినేని మరోసారి...

ఒంగోలు రాజకీయం మరోసారి తీవ్ర రసవత్తరంగా...

విమర్శలకు చెక్ పెట్టడంలో...

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా డీఎస్సీలో అవతల జరిగాయని...

ఏపి పోలీసుల పై...

ఏపీ పారిశ్రామికా శాఖ మంత్రి టి.జి....

స్థానిక పోరు.. రణమా.....

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల వేడి...

ఒంగోలు పాలిటిక్స్‌లో కూటమి...

ఆంధ్రప్రదేశ్‌లో అధికార కూటమికి చెందిన ఇద్దరు...

పోల్స్