గత ప్రభుత్వ హయాంలో హడావుడి చేసిన షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్ కు బిగ్ షాక్ ఇచ్చింది ఏపీ సర్కార్. వ్యవసాయ కనెక్షన్లకు స్మార్ట్ మీటర్ల ఏర్పాటు రద్దు చేసింది. కూటమి హయాంలో షిర్డీసాయి ఎలక్ర్టికల్స్ కు మొదటి దెబ్బ పడింది. అదంతా వృథా ఖర్చంటూ ఇంధన పరిశోధన సంస్థ ప్రయాస్ ఇచ్చిన నివేదిక ఆధారంగా నిర్ణయం తీసుకున్నారు. అప్పట్లో ఇష్టం వచ్చినట్టు దోచుకున్న జగన్ బినామి సంస్థ షిర్డీసాయి ఎలక్ట్రికల్స్ కు షాక్ ఎప్పుడు ఇస్తారని కూటమి కార్యకర్తలు ఎదురు చూసారు.
Also Read : దావోస్ లో ఏపీ స్పెషల్ అట్రాక్షన్.. కేంద్రం ఫుల్ సపోర్ట్
అప్పట్లో రైతుల నుంచి వ్యతిరేకత వస్తున్నా పట్టించుకోకుండా జగన్ ప్రభుత్వం 18లక్షల 58వేల వ్యవసాయ పంపుసెట్లకు స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించి… 2 శాతం అదనపు రుణం కోసం మీటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు పైకి చెప్పుకుంటూ వచ్చారు. కాని షిర్డీ సాయి కోసమే ఆ అడుగులు వేసినట్టు ఆరోపణలు వచ్చాయి. ఇక ఇప్పటికే రాష్ట్రంలో 50వేల కనెక్షన్లకు స్మార్ట్ మీటర్లను ఏర్పాటు చేయగా మిగిలిన కనెక్షన్లకు స్మార్ట్ మీటర్లపై ముందుకు వెళ్లకూడదని నిర్ణయం తీసుకున్నారు.
వ్యవసాయ కనెక్షన్లకు స్మార్ట్‌మీటర్లు, అనుబంధ పరికరాల కోసం అప్పట్లో వైసీపీ సర్కార్ 2020లో మొదటిసారి రూ.6,480 కోట్ల ప్రతిపాదనలతో టెండర్లు ఆహ్వానించింది. ఈ ధరలపై తీవ్ర ఆరోపణలు రావడంతో టెండర్ల ప్రక్రియను రద్దు చేసారు. అనంతరం రెండోసారి అనుబంధ పరికరాలు, స్మార్ట్‌మీటర్లు, నిర్వహణ పనులుగా విడగొట్టి వేర్వేరుగా టెండర్లు ఆహ్వానించారు. ఒక్కో మీటర్ కు ఏకంగా 35వేల చొప్పున ధరలను ఫైనల్ చేసారు. ప్రయోజనాలపై పైలట్ ప్రాజెక్టులు లేకుండానే నిర్ణయాలు తీసుకున్నారు.
Also Read : ఫార్ములా ఈ కారు కేసు.. లొట్ట పీసు కేసు..!
ఈ మీటర్లతో ఆదా చేసామని హడావుడి చేసినా అది సొల్లు అని తేల్చారు. పంపిణీ ట్రాన్స్‌ఫార్మర్ల దగ్గర మీటరింగ్, ఫీడర్ మీటరింగ్ విధానంలో కొద్ది మొత్తం అదనపు ఖర్చుతో విద్యుత్ ఆడిట్ కు అవకాశం ఇచ్చారు. దీనితో వ్యవసాయ విద్యుత్ వినియోగం, నష్టాల్ని తేలిగ్గా అంచనా వేయొచ్చని పీఈజీ అప్పట్లో సూచనలు చేసినా వినకుండా టెండర్లు పిలిచారు. స్మార్ట్ మీటర్ల ద్వారా రూ.6,500 కోట్లను ఐదేళ్లలో వెనక్కి రాబట్టుకోగలమని కలరింగ్ ఇచ్చినా అది సాధ్యం కాదని తేల్చేసారు.

