Sunday, June 21, 2026 08:40 AM
Sunday, June 21, 2026 08:40 AM

ఎస్పీని వేధిస్తున్నారా..? రేవంత్ సర్కార్ పై సుప్రీం కోర్ట్ సంచలన వ్యాఖ్యలు…?

తెలంగాణాలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా ఉండటంతో ఎప్పుడు ఏ పరిణామాలు చోటు చేసుకుంటాయో అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. చాన్నాళ్ళ నుంచి ఈ వ్యవహారం హాట్ హాట్ గా నడుస్తూనే ఉంది. ఇక రాష్ట్ర ప్రభుత్వం కొందరి కోసం ఇప్పటికే సిబిఐ సహకారం కూడా తీసుకుంది. అమెరికా పారిపోయిన వారిని రాష్ట్రానికి రప్పించే ప్రయత్నం చేస్తోంది. ఇక తాజాగా ఈ వ్యవహారంపై సుప్రీం కోర్ట్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. రాష్ట్ర ప్రభుత్వ తీరుపై మండిపడింది.

Also Read : ఉద్యోగాల జాతర.. ఏపీ కేబినేట్ కీలక నిర్ణయాలు

ఫోన్ ట్యాపింగ్ కేసులో అదనపు ఎస్పీ తిరుపతన్న పాత్రపై దర్యాప్తు ఎప్పటికి పూర్తిచేస్తారు? అని ప్రశ్నించింది. తిరుపతన్న బెయిల్ పిటిషన్‌పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. దర్యాప్తు సుదీర్ఘకాలం కొనసాగడం సరికాదని కోర్ట్ అభిప్రాయపడింది. దర్యాప్తు కొనసాగింపు పేరుతో పిటిషనర్‌కు ఉన్న స్వేచ్ఛను మేం అడ్డుకోలేం అని స్పష్టం చేసింది. అలాగని దర్యాప్తును అడ్డుకోవాలని కూడా మేం అనుకోవడం లేదని తేల్చి చెప్పింది. అప్పటిలోగా తిరుపతన్న పాత్రపై దర్యాప్తు పూర్తి వివరాలు కోర్టుకు అందజేయాలని ఆదేశించింది.

Also Read : ఫార్ములా ఈ కారు కేసు.. లొట్ట పీసు కేసు..!

రాష్ట్ర ప్రభుత్వం తరఫున సిద్ధార్థ్ లూత్రా, తిరుపతన్న తరఫున దుష్యంత్ దవే వాదనలు వినిపించారు. ఫోన్ ట్యాపింగ్‌లో తిరుపతన్నే ప్రధాన నిందితుడు అని లూత్రా వాదించారు. రాజకీయ నేతల ఆదేశాల మేరకు అందరి ఫోన్లను ట్యాప్‌‌ చేశారని కోర్ట్ కు వివరించారు. ఫోన్ ట్యాపింగ్‌లో ఆయనే కీలకంగా వ్యవహరించారని సిద్ధార్థ్ లూత్రా స్పష్టం చేసారు. హైకోర్టు జడ్జిల ఫోన్లను సైతం ట్యాప్ చేశారని పేర్కొన్నారు. ఇక తిరుపతన్న పాత్రపై చార్జిషీటు కూడా దాఖలు చేశారు ఆయన తరుపు న్యాయవాది దుష్యంత్ దవే వాదనలు వినిపించారు. ఈ క్రమంలో ఆయన బెయిల్ పొందేందుకు అర్హుడే దుష్యంత్ దవే అని కోర్ట్ ను కోరారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

తిరుపతిలో కేఎఫ్‌సీ, డొమినోస్‌...

ప్రముఖ అంతర్జాతీయ ఫుడ్ బ్రాండ్ల ఆహార...

తిరుపతిలో వడ్డీ మాఫియా.....

తిరుపతి నగరంలో వడ్డీ వ్యాపారం పేరుతో...

సాయికృష్ణ కేసులో వైసీపీ...

విజయవాడ రౌడీ షీటర్‌ గాదె సాయికృష్ణ...

బ్రేకింగ్: అల్లు అర్జున్‌...

హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సంధ్య...

తెలంగాణాలో జనసేన తొలి...

గత కొన్నాళ్ళుగా తెలంగాణాలో పార్టీ బలోపేతం...

బ్రేకింగ్: కొడాలి అరెస్ట్...

ఏపీలో వైసీపీ కీలక నేతలకు చట్టపరమైన...

పోల్స్