Wednesday, February 4, 2026 10:20 PM
Wednesday, February 4, 2026 10:20 PM

ఫైబర్ నెట్ లో దారుణాలు.. జీవీ రెడ్డి సంచలన కామెంట్స్

గత వైసీపీ ప్రభుత్వ హాయంలో జరిగిన అవినీతి, అక్రమాలను ఎపీఎస్ఎఫ్ఎల్ ఛైర్మన్ జీవీ రెడ్డి సంచలన విషయాలు బయటపెట్టారు. 2016లో ఎపీఎస్ఎఫ్ఎల్ ను అప్పట్లో సీఎం చంద్రబాబు ప్రారంభించారని.. గ్రామీణ ప్రాంతాల్లోని పేద, మధ్యతరగతి ప్రజలకు తక్కువ ధరలో కేబుల్, ఇంటర్నెట్ అందించడమే లక్ష్యంగా దీన్ని చంద్రబాబు ప్రారంభించారన్న ఆయన… 2019 వరకు 24 వేల కిలోమీటర్ల కేబుల్ వేసి 10 లక్షల కనెక్షన్లు ఇచ్చామని… 2019 తర్వాత ఎపీఎస్ఎఫ్ఎల్ కనెక్షన్ల సంఖ్య 5 లక్షలకు పడిపోయిందన్నారు. సంస్థ ప్రస్తుతం దివాలా అంచున ఉందని, వైసీపీ ఆ స్థితికి తీసుకొచ్చింది అన్నారు.

Also Read: పాపం అవంతి.. భవిష్యత్తు ఏమిటో?

గత ప్రభుత్వం కిరాణ కొట్టు కంటే దారుణంగా ఎపీఎస్ఎఫ్ఎల్ ను అమలు చేశారని… సంస్థలో విచ్చల విడిగా అవినీతి జరిగింది.. విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతోందన్నారు. 2019లో 108 మంది ఉద్యోగులతో నెలకు 40 లక్షల ఖర్చుతో నడిపి 10 లక్షల కనెక్షన్లను పెంచామన్నారు. కనెక్షన్లు 10 లక్షల నుంచి 5 లక్షలకు పడిపోయినా భారీగా అక్రమంగా ఉద్యోగులను నియమించారని ఆరోపించారు. వైసీపీ హయాంలో 1,363 మంది ఉద్యోగులను నియమించి.. నెలకు 4 కోట్లు వేతనాలు చెల్లిస్తున్నారన్నారు.

Also Read: శిరిష జోలికి వస్తే.. సిక్కోలు నేతల వార్నింగ్..!

గత ప్రభుత్వంలో ఉద్యోగుల వేతనాలు పదిరెట్లు పెరిగినా ఆ మేరకు కనెక్షన్లు పెరగాల్సి ఉండగా 5 లక్షలు తగ్గాయని… గత ప్రభుత్వం కేబుల్ ఆపరేటర్లను చిత్రహింసలకు, వేధింపులకు గురి చేసిందని ఆయన ఆరోపించారు. గత ఐదేళ్ల వైసీపీ పాలనలో ఎపీఎస్ఎఫ్ఎల్ కు 1262.. కోట్లు అప్పు చేశారని తెదేపా హయాంలో 3513 కోట్లు పెట్టుబడి పెట్టి ఇన్ ఫ్రాస్ట్రక్చర్ పెట్టి 10 లక్షల కనెక్షన్లు పెంచామన్నారు. వైసీపీ హయాంలో అంతా రెడీగా ఉన్న సంస్థలో 6869 కోట్లు ఖర్చుపెట్టి దివాలా తీయించారన్నారు.

Also Read: జగన్‌లో మార్పుపై.. వైసీపీ కార్యకర్త అభిప్రాయం ఏమిటో…?

వైసీపీ నేతల వాట్సప్ మెసేజ్ లతో వందల మంది ఉద్యోగులను నియమించారని… ఎపీఎస్ఎఫ్ఎల్ లో జీతాలు తీసుకుంటూ వైసీపీ హయాంలో ఉన్న మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యే, ఇళ్లల్లో పనిచేశారని.. దీని పై విజిలెన్స్ విచారణ జరుగుతోంది.. నివేదిక వచ్చాక పూర్తి వివరాలు వెల్లడిస్తాను అన్నారు జీవీ రెడ్డి. గత ఐదేళ్లలో అప్పటి ఎండీ మధుసూదన్ చేసిన అక్రమాలపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామన్నారు. 2017లో పోల్ టాక్స్ లేకుండా ఆదేశాలిచ్చాం.. ఇప్పుడు విద్యుత్ అధికారులు ఇబ్బంది పెట్టవద్దని కోరుతున్నాను అన్నారు.

Also Read: రేవంత్ ను రెచ్చగొట్టి బలయ్యారా…? సినిమా పెద్దలు తగ్గాల్సిందే…!

వైసీపీ హయాంలో అక్రమాలపై ప్రశ్నిస్తే చంద్రబాబు పై అక్రమంగా కేసు పెట్టి వేధించారన్నారు. వైసీపీ నేతల అక్రమాలు బయటపడకుండా కీలక డాక్యుమెంట్లను విజయసాయిరెడ్డికి ఒక మహిళా ఉద్యోగిని చేరవేశారని కీలక డాక్యుమెంట్లు సాయి రెడ్డికి చేరవేసిన ఎపీఎస్ఎఫ్ఎల్ మహిళా ఉద్యోగినిని తొలగించామన్నారు. రాబోయే రోజుల్లో ఎపీఎస్ఎఫ్ఎల్ కనెక్షన్ల సంఖ్యను 50 లక్షల కనెక్షన్లకు పెంచుతామన్నారు.

Also Read: సీజ్ ది షిప్… కుదరదుగా గురూ

వ్యూహం సినిమాను ఫైబర్ నెట్ లో టెలికాస్ట్ చేసి అక్రమంగా అధిక మొత్తాన్ని దర్శకుడు రాంగౌపాల్ వర్మకు చెల్లించారన్నారు. ఎక్కడా లేని విధంగా 1 వ్యూవ్ కు 11 వేలు చొప్పున ఆర్జీవీ సంస్థకు అప్పటి అధికారులు చెల్లించారని… 1863 వ్యూస్ వస్తే … 2 లక్షలు చెల్లించాల్సి ఉండగా ఏకంగా 2.10 కోట్లు రాంగోపాల్ వర్మకు అక్రమంగా చెల్లించారన్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

గుంటూరు కారమా.. మజాకానా…!

గుంటూరు కారం పవర్ ఇన్నాళ్లకు కన్పించింది.....

బాబు-పవన్ భేటీ.. ఆ...

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్...

చంద్రబాబు సలహదారుగా మళ్లీ...

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్...

అందరికీ తలో రోగం.....

ఏపీ సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల...

తెలంగాణా సైనికులకు జనసేనాని...

తెలంగాణాలో మున్సిపల్ ఎన్నికలు దగ్గర పడుతున్న...

నాటుకోడి రేట్ ఎక్కువగా...

గ్రామాల్లో ఉండే పంచాయితీ సభల నుంచి...

పోల్స్